Link copied!
Sign in / Sign up
17
Shares

భర్త కోసం 5 రోజుల కన్న బిడ్డతో కలిసి ఈమె చేసిన పని తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు..

మహిళలు చాలా ధైర్యవంతులు, గొప్ప మనస్సు కలిగిన వారు అని చాలామంది చెప్తుంటే వినే ఉంటారు. కానీ ఇక్కడ భార్యగా, తల్లిగా ఒకే క్షణంలో ఈమె చేసిన గొప్ప పని తెలిస్తే మాత్రం నిజంగా చేతులెత్తి మొక్కాలి అని తప్పక అనిపిస్తుంది. ఒకవైపున భర్త చనిపోయాడు అనే బాధ, మరోవైపు 5 రోజుల పసికందును తన తండ్రికి తీసుకువెళ్లడానికి ఈ తల్లి ఎంత క్షోభను అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు.

అసలేం జరిగిందంటే..?

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు కుముద్ దోగ్రా. ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్నారు. ఈమె భర్త పేరు డీవాట్స్. భారత ఏయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అధికారిగా పనిచేస్తున్నారు. విధుల నిమిత్తం వెళ్లిన డీవాట్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ఆక్సిడెంట్ లో ఈ నెల 15 న ప్రాణాలు కోల్పోయారు. డీవాట్స్ మరణించిన రెండు రోజుల తర్వాత కుముద్ దోగ్రా పండంటి ఆడపిల్లకు జన్మను ఇచ్చింది. ఎయిర్ ఫోర్స్ అధికారి కావడం, ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ప్రమాదం కావడంతో ఆయన అంత్యక్రియలు ఆలస్యంగా జరిగాయి.

5 రోజుల పసిబిడ్డతో భర్త ముందుకు..

భర్త డీవాట్స్ ఇక లేడు అని ఒకవైపు, పండంటి ఆడపిల్లకు జన్మను ఇచ్చిన మరోవైపు ఆనందం లేదు. ఆ బాధలోనూ తన 5 రోజుల పసికందును భర్త అంత్యక్రియలకు తీసుకెళ్లింది. బిడ్డను తీసుకువెళ్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారతదేశ సైన్యం దేశం కోసం ఎంత త్యాగం అయినా చేస్తారు అనేదానికి ఇంతకంటే ఏం చెప్పాలి అంటూ ఆ తల్లిని చూసి గర్వపడుతూ, ఆమె భర్త డీవాట్స్ కు సెల్యూట్ చేస్తున్నారు.

భర్త పోయిన శోకంలోనూ ఆమె తీసుకున్న నిర్ణయం, మనదేశ ఆర్మీ, ఎంత గొప్పవో చెప్పే ఈ ఆర్టికల్ అందరికీ చేరేలా SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon