Link copied!
Sign in / Sign up
7
Shares

భర్త చేత పొగిడించుకోవడానికి భార్యలు ఏం చేయాలి..?

ఏ బంధంలోనైనా సరే ఆ బంధాన్ని మరింత బలంగా, దృఢంగా, స్నేహపూర్వకంగా చేసేది నమ్మకం తర్వాత  ఒక్క పొగడ్త మాత్రమే. మిమ్మల్ని ఎవరైనా పొగిడారు  అనుకోండి వారిపై ఎంత కోపం ఉన్నా సరే కాస్త తగ్గిపోతుంది. ఇలా పొగడ్తలు అంటే ఇష్టపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే భార్యలు కొన్ని పనులు చేస్తే భర్తలు పొగడకుండా ఉండలేరు. భార్యలు చేసే ఆ పనులు ఏంటో మీరే చూడండి..

ఇష్టమైన వంట రుచిగా చేసినప్పుడు

భర్తకు ఏమంటే ఇష్టమో భార్యకు బాగా తెలుసు. అందుకని తన శ్రీవారికి ఇష్టమైన వంటను ఎంతో రుచికరంగా వండిపెడుతుంది. ఇష్టమైన వంటకం, పైగా అదిరిపోయే గుమగుమలతో రుచికరంగా ఉంటే మీ ఆయన మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. అలాగే ఆ టైములో మీరు ఏమి అడిగినా సరే కాదనలేరు.

పిల్లల పెంపకం

మీ ఆయనకు మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే బాధ్యత ఉంటుంది కానీ ఆ బాధ్యతను ఇంటి నుండి సక్రమంగా నిర్వహించేది, పిల్లల బాగోగులు, పిల్లలకు ఏం కావాలో మీ భర్త కన్నా ఎక్కువగా మీకే తెలుసని ప్రతి భర్త అనుకుంటాడు. అందుకే పిల్లలను బాగా చూసుకుంటున్నావ్ అంటూ ఏదో ఒక రోజు మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడుతాడు.

త్వరగా రెడీ అయి అందంగా వచ్చినప్పుడు

నిజానికి ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. మగవారు రెడీ కావడానికి రెండు నిముషాలు పడితే, ఆడవారు రెడీ అద్దం వదిలిరావడానికి కనీసం 2 గంటలైనా పడుతుందని ప్రతి ఇంట్లోనూ వినిపిస్తూ ఉంటుంది. అటువంటిది మీ ఆయన కంటే త్వరగా ముస్తాబై అందంగా బయటకు వచ్చినప్పుడు కనీసం ఆ రోజు పదిసార్లైనా పొగడటం చేస్తారు.

పొదుపు చేసినప్పుడు..

ఇంట్లో ప్రతి ఒక్కరూ పొదుపు విషయంలో తప్పటడుగులు వేస్తుంటారు. ఒక్క గృహిణి మాత్రమే ముందుగా వచ్చే అవసరాలు, ఆపదల కోసం తనకు వీలైనంత పొదుపు చేసి ఆదుకుంటుంది, అండగా నిలబడుతుంది. ఇటువంటప్పుడు మీ భర్త మిమ్మల్ని పొగడటం కన్నా నాకు ధైర్యాన్ని ఇచ్చావ్, నువ్వు లేక పోతే నన్ను నేను ఊహించుకోవడమే కష్టంగా ఉందని అంటారు.

ఊరి నుండి వచ్చినప్పుడు, అవసరాలు తెలుసుకున్నప్పుడు

మహిళలు ఎప్పుడోగానీ పుట్టింటికి వెళ్ళరు,  వెళితే త్వరగా రాలేరు. ఇటువంటప్పుడు త్వరగా పుట్టింటి నుండి తిరిగివచ్చినప్పుడు హమ్మయ్య వచ్చావా బంగారం నువ్వు నా పక్కన లేకపోయేసరికి ఏమీ తోచడం లేదని ఖచ్చితంగా పొగడ్తల వర్షం కురిపిస్తారు. అలాగే ‘కార్యేషు దాసి కరణేషు మంత్రి’ అంటారు కదా..ఇలా భర్త అవసరాలు తెలుసుకుని భార్య చేసే పనులంటే భర్తకు చాలా ఇష్టం. భార్యకు పొగడ్తల వర్షం..

మరి మీ భర్త మిమ్మల్ని ఎప్పుడైనా ఏ విషయానికైనా పొగిడారా..!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon