Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రతి భర్త భార్య నుండి కోరుకునే 5 రహస్యాలు : భార్యకు మాత్రం అస్సలు చెప్పరు..

పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యే భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఎవరో తెలియని వ్యక్తి జీవితంలోకి, వారి కుటుంబంలోకి వెళ్లడం, అందరితో కలిసిపోయి ఆనందంగా ఉండటం అనేది పెళ్లి వలన సాధ్యం అయ్యే గొప్ప విషయం. అయితే భార్యాభర్తల జీవితంలో కొన్ని విషయాలను ప్రతి ఒక్కరితోనూ చెప్పుకోలేనివి ఉంటాయి. ఇది భార్యభర్తలకు ఇద్దరికీ సాధారణమే. అయితే ప్రతి భర్త తన భార్య నుండి కొన్ని విషయాలను ప్రత్యేకంగా కోరుకుంటాడు, కానీ బయటకు మాత్రం చెప్పలేడు. ఆ విషయాలు ఏంటో మీరే చూడండి..

నిజాయితీ

ఎస్.. ప్రతి భర్త తన భార్య తనవద్ద ఏ విషయాలు దాచకుండా నిజాయితీగా ఉండాలని అనుకోవడం తప్పుకాదు. అలాగే భార్య కూడా ఈ విషయాన్ని భర్త నుండి ఉండాలని కోరుకుంటుంది. నా భార్య ప్రతి సంగతి నాతో పంచుకోవాలి, తనకు వ్యక్తిగతంగా ఎన్ని రహస్యాలు ఉన్నా సరే నా దగ్గర ఏవి దాచుకోకూడదు అని కోరుకుంటాడు. అయితే భార్యను ఈ విషయన్ని డైరెక్ట్ గా అడగలేరు కానీ నీకు ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పు అని అడుగుతాడు.

నమ్మకం

పెళ్లి అనే పవిత్రబంధం ద్వారా ఒక్కటైన ప్రతి జంటకు ఒకరిపై మరొకరి నమ్మకం ఉండాలి. ఇది మీ బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. భర్తను ప్రతి విషయంలోనూ లోతుగా అనుమానించి అతనిపై నమ్మకం లేకుండా ఉన్నట్లయితే వైవాహిక బంధంలో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. కొన్ని కొన్ని విషయాలలో అంటే ఉద్యోగపరంగా, ఆర్ధికపరంగా మీరు చేయగలరు, సాధించగలరు అనే నమ్మకాన్ని భార్యగా ప్రోత్సహించాలి.

ప్రేమ ఆప్యాయత అభిమానం

ప్రతి భర్త భార్య నుండి ప్రేమ, ఆప్యాయత, అభిమానాన్ని తప్పక కోరుకుంటాడు. నా భార్యకు నేనే సర్వస్వం అనేలా ప్రేమించాలి. ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆప్యాయతను పంచాలి. మీరు నాకు భర్తగా దొరకడం చాలా గొప్పగా భావిస్తున్నాను అనే అభిమానాన్ని ఇవ్వాలి. ఈ మూడు భార్య నుండి భర్తకు దొరికితే చాలు, వారి దాంపత్యం చాలా ఆనందంగా సాగుతుంది.

మర్యాద మరియు సంతోషం

దంపతుల జీవితంలో ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఒకరినొకరు మర్యాద పూర్వకంగా గౌరవించుకోవడం, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం చేయాలి. ఈ రెండు భార్య నుండి భర్తకు లేకపోతే భర్త ఒంటరిగా ఫీలవుతాడు. ఈ విషయాన్ని వేరేవాళ్లకు చెప్పుకోలేడు కూడా.

మాటలు చెప్పడం

ఉదోగ్యం లేదా వ్యాపారం చేస్తూ బయట ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికి వచ్చే భర్తకు భార్య ప్రశాంతమైన రిలీఫ్ కావాలి. విసిగించి, ఇబ్బందిగా అనిపించే మాటలు చెప్పకుండా హాయిగా మాట్లాడటం, నవ్వుతూ నవ్విస్తూ కబుర్లు చెప్పడం చేయాలి. ఇలా చేయడం వలన ఒక మంచి భార్యతో పాటు మీ ఆయనకు మంచి ఫ్రెండ్ అవుతారు కూడా. చాలామంది భార్యాభర్తలు మనస్సు విప్పి మాట్లాడుకోకపోవడం వలనే తమ దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నారు.

ఈ విషయాలలో నిజం ఉందని మీకు అనిపిస్తే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. ఇది ఏ ఒక్కరినీ ఉద్దేశించినది కాదు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon