Link copied!
Sign in / Sign up
6
Shares

భారత దేశపు తల్లులు నమ్మడం ఆపాల్సిన 4 మూఢ నమ్మకాలు


మన భారత దేశం ఎన్నో రకాలైన సంస్కృతులు ఉన్నాయి.అలాగే ఎన్నో మూఢ నమ్మకాలూ ఉన్నాయి. ఈ మూఢ నమ్మకాలు ఇప్పుడు మనకి ఎగతాలిగా అనిపించవచ్చు కానీ ఏ రోజుల్లో కూడా వీటిని నమ్మి పాటించే వారు ఎంతో మంది ఉన్నారు. తల్లి కాబోతున్నపుడు లేదా ఉన్నపుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కానీ కొన్ని మూఢ నమ్మకాలని గుడ్డిగా నమ్మేసి పాటించకూడదు. అటువంటి మూఢ నమ్మకాలు ఏమిటో చూద్దాం రండి.

1 . సెక్సువల్ పొజిషన్స్ పుట్టబోయే బిడ్డ యొక్క లింగాన్ని ప్రభావితం చేస్తుంది

కొంచెం ఆలోచించినట్లు అయితే అర్ధం అయిపోతుంది ఇది ఒక అర్ధం లేని మూఢ నమ్మకం అని. సెక్స్ పొజిషన్స్ పుట్టపోయే బిడ్డ లింగాన్ని నిర్దారించలేవు. మీరు ఏ పొజిషన్లో సెక్స్ చేసిన పురుష వీర్యం మీలోకి ప్రవేశించి, వీర్యకణం అండంలోకి చేరినప్పుడు, మీరు గర్భం ధరిస్తారు. తరువాత పిండం ఆడ లేదా మగ గా మారుతుంది. అది సెక్స్ పొజిషన్స్ కి సంబంధం లేని విషయం.

2 . కుంకుమ పువ్వు పుట్టబోయే బిడ్డ లో రంగు పెంచుతుంది

లింగం తరువాత భారత దేశం లో చర్మ రంగు కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అత్తలు కోడళ్ళకి పాలు,నీళ్లు లేదా ఎదో ఒక రూపం లో కుంకుమ పువ్వు ని ఇస్తూ ఉంటారు పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉండాలి అని. కుంకుమ పువ్వు వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. అది రోగనిరోధక శక్తీ ని కూడా పెంచుతుంది. కానీ పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడుతుంది అనేది నిజం కాదు.

3 .గర్భిణులు గ్రహణం అప్పుడు బయటికి వెళ్ళకూడదు

ఈ మూఢ నమ్మకం అనేది బహుశా గ్రహణం ఎందుకు వస్తుంది అని దాని గురించి అవగాహన లేని వారు చెప్పిఉంటారు. తల్లి గ్రహణం అప్పుడు బయటికి వెళ్తే పుట్టబోయే బిడ్డ లోపాలతో పుడుతుంది అనే నమ్ముతూ ఉంటారు. కానీ నిజానికి నక్షత్రాల్లో ఎదో జరిగే విషయానికి పుట్టబోయే బిడ్డ కి ఎటువంటి సంబంధం లేదు.

4 . బిడ్డ పుట్టక ముందు బిడ్డకి ఎం కొనకూడదు.

ఈ నమ్మకం పాతకాలం లో శిశు మరణాలు ఎక్కువగా ఉండటం వల్ల మొదలైంది. అప్పట్లో తల్లులు బిడ్డ కి సంభందించిన వస్తువులు చూసినప్పుడల్లా బిడ్డ కి ఏమైనా అవుతుందేమో అని బాధ పడుతారు .ఈ భావనని నివారించేందుకు బిడ్డ పుట్టే దాక బిడ్డ కి ఏమి కొనకూడదు అని చేప్తు ఉండే వారు. కానీ కలం మారే కొద్ది మనల్ని మనం మార్చుకోవాలి కదా. ఈ రోజుల్లో ముందే అన్ని కొనిపెట్టుకొని ఉండాలి అప్పుడే మంచిది లేదంటే ఇబ్బంది పడాల్సివస్తుంది. అనవసరమైన ఇబ్బందులను ఎదురుకోకుండా ఉండాలంటే బిడ్డ కి కావాల్సినవి ముందే కొనిపెట్టి ఉంచండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon