Link copied!
Sign in / Sign up
32
Shares

భారతదేశంలో చేప ఆకారంలో పుట్టిన అరుదైన బిడ్డ : కోటిమందిలో ఒక్కరు మాత్రమే ఇలా పుడతారు…


మన పురాణ ఇతిహాసాలలోని, విష్ణువు దశావతారాలలో మత్స్యావతారం ఒకటి అంతే కాకుండా అవతారాలలో మొదటిది కూడా. ప్రళయం నుండి కాపాడడానికి విష్ణువు మత్స్యావతారం దరిస్తాడు. ఇది దేవుడికి మాత్రమే సాధ్యమైన లీల. అయితే ఈ మధ్య ఒక బిడ్డ మత్స్య రూపంలో  జన్మించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏమి జరిగిందో,... ఎలా జరిగిందో తెలుసుకుందాం…

కొన్ని రోజుల క్రితం ముస్కురా బిబి అనే 23 ఏళ్ళ మహిళ కోల్’కాతా లోని చిత్తరంజన్ దేవా సదన్ హాస్పిటల్ కు ప్రసవం కోసం వచ్చింది. అప్పటికే ఆమె చాలా బలహీనంగా వుంది. డాక్టర్లు ప్రసవం చేసిన తరువాత, బిడ్డను చూసిన తల్లి ఆశ్చర్యపోవాల్సివచ్చింది. పుట్టిన బిడ్డ నడుము భాగం వరకు సాధారణంగానే వున్నా, నడుము కింది భాగం మాత్రం చేప ఆకారంలో వుంది. మొదట వైద్యలు కూడా కొంత విస్మయానికి గురైన, తర్వాత ఇది కోటిమందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే అరుదైన సిరినోమెళియా లేదా మెర్మైడ్ సిండ్రోమ్ (sirenomelia or 'mermaid syndrome) అని నిర్ధారించారు.

ఈ సిండ్రోమ్ గురించి వైద్యులు ఇచ్చిన మరికొన్ని వివరాలు ఇలా వున్నాయి. ఈ సిండ్రోమ్ చాలా అరుదుగా ఉంటుంది. ఈ సిండ్రోమ్ వలన కడుపులోని బిడ్డ కాళ్ళు రెండుగా వేరు పడవు. రెండు కలిసి పోయి నడుము కింది చేప ఆకారాన్ని తలిపిస్తుంది. ప్రెగ్నన్సీ సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన, రక్త ప్రసారం అరిగా జరగక, కడుపులోని బిడ్డకు ఈ సిండ్రోమ్ వస్తుంది. ఈ సిండ్రోమ్ తో పుట్టిన బిడ్డ మూత్రనాళాల సమస్యతో కొన్ని రోజులకే చనిపోతాడు. డాక్టర్లు చెప్పిన విధంగానే చేప రూపంలో పుట్టిన ఈ అరుదైన బిడ్డ కేవలం రెండు రోజులు మాత్రమే బతికాడు. ఈ సిండ్రోమ్ మీద మరింత అధ్యాయనం చేయడం కోసం చనిపోయిన బిడ్డను హాస్పిటల్ లో భద్రపరిచారు. ఆ ఫోటోలు ఇక్కడ చూడండి...

 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon