Link copied!
Sign in / Sign up
14
Shares

ఎండాకాలంలో మీ చర్మం తెల్లగా ఉండాలంటే ఈ ఆహారాలతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు..

వేసవికాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కునే సమస్యలలో మొదటిది బయట ఎండకు వెళితే చర్మం నలుపుగా మారటం మరియు వేసవి తాపానికి వడదెబ్బ తగిలి పడిపోవడం. సున్నితంగా అందంగా ఉన్నవారు తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా రకాల సౌందర్య చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వడం వలన మీ చర్మాన్ని అందంగా కాంతివంతంగా ఉంచుకోవచ్చు.

ముల్తానీముట్టిలో ఈ మూడు కలిపి

కాస్త ముల్తానీమట్టి తీసుకుని అందులో రోజ్ వాటర్, కాస్త మిల్క్ పౌడర్ లేదా మిల్క్, దానిమ్మ రసం, చిటికెడు పసుపు మిక్స్ చేసుకుని ముఖానికి ప్యాక్ గా వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో కాటన్ ఉంచి శుభ్రం చేసుకోవడం వలన ముఖం అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది.

కొబ్బరి నీరు

వేసవిలో చాలామందికి ఇబ్బంది కలిగించేవి చమటకాయలు, దద్దుర్లు. కొబ్బరినీటిని ముఖం లేదా మీ చర్మంపై లేపనంగా రాసుకోవడం చమటకాయలు సమస్య ఉండదు. అలాగే చమట దుర్వాసన ఉండదు మరియు ముఖం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది.

పెరుగు తేనె

ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరిసిపోవాలంటే పెరుగులో కాస్త తేనె రెండు లేదా మూడు చుక్కల నిమ్మరసం కలుపుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పేస్ పై ప్యాక్ గా వేసుకుని పది నిముషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.

శనగపిండి పెరుగు

ముఖం జిడ్డుగా ఉన్నవారు, ఆయిల్ పేస్ అని ఫీల్ అవుతున్నవారు శనగపిండిలో కాస్త పెరుగు లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసుకుని ప్యాక్ గా వేసుకుని పది నిముషాల తర్వాత చల్లని నీరు లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం అందంగా నిగనిగలాడుతుంది.

తేనె శనగపిండి

చాలామంది ఈ వేసవి తాపానికి మొటిమల సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు, అటువంటివాళ్ళు శనగపిండిలో కాస్త గోరు వెచ్చగా  ఉండే తేనెను మిక్స్ చేసుకుని ముఖంపై రాసుకోవాలి. కొన్ని నిముషాల తర్వాత క్లీన్ చేసుకంటే ముఖంపై మొటిమలు తగ్గుముఖం పడతాయి.

ఈ అందమైన చిట్కాలు మీకు నచ్చి ఉంటే వెంటనే అందరికీ తెలిసేలా SHARE చేయడం మర్చిపోకండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon