Link copied!
Sign in / Sign up
6
Shares

బెల్లీ ఫ్యాట్ ను 2 వారాలలో కరిగించే ఆహారాలు

ప్రస్తుతం ప్రతి పది మందిలో కనీసం నలుగురు బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ అంటే లావు పెరగడం, బరువు పెరగడం కాదు, కేవలం పొట్ట మాత్రమే ముందుకు రావడం. ఈ ఉరుకు పరుగుల జీవితంలో మగ, ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు.  కాబట్టి, ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ గృహ చిట్కాలను మీరు ఇంట్లో ఫాలో అవ్వడం వలన బెల్లీ ఫ్యాట్ అనేది ఉండదు.

అవకాడో

బెల్లీ ఫ్యాట్ లేదా లావుగా ముందుకు వచ్చిన పొట్ట తగ్గడానికి భారీగా వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకునే ఆహారంలో కొంచెం బెస్ట్ ఫుడ్స్, బెల్లీ రానివ్వని ఫుడ్స్ తీసుకుంటే చాలు. అలాంటి వాటిలో అవకాడో ది బెస్ట్ అని చెప్పవచ్చు. అవకాడోను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన బెల్లీని సహజంగా తగ్గించుకోవచ్చు. అలాగే ఉన్న బెల్లీని తగ్గించివేస్తుంది. అంతే కాకుండా మీరు యవ్వనంగా కనపడేలా చేయగలదు.

నిమ్మరసం తేనె

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసుకుని ప్రతి రోజూ ఉదయం సేవించడం వలన సహజంగా బెల్లీ ఫ్యాట్ ను దూరం చేసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన 2 వారాలలోనే మంచి ఫలితం కనబడుతుంది.

పుచ్చకాయ

పుచ్చకాయలో దాదాపు 80 శాతం నీరు ఉంటుంది కాబట్టి ఆహారం తీసుకునే ముందు పుచ్చకాయ తినడం వలన పొట్ట నిండుగా ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వలన ఆహారం తక్కువగా తీసుకోవడానికి వీలుంటుంది. పుచ్చకాయలో ఒకే సీజన్ లో ఎక్కువగా దొరుకుతున్నాయి, ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రతి సీజన్ లోనూ లభిస్తున్నాయి.

వెల్లుల్లి

ప్రతి రోజూ ముఖం కడుక్కున్న తర్వాత పరగడుపున రెండు లేదా మూడు వెల్లుల్లి రిబ్బలను తినడం వలన బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కూడా. మొదట్లో కాస్త ఘాటుగా తినడానికి ఇబ్బందిగా ఉన్నా బెల్లీని తగ్గించడానికి ఉత్తమమైన  ఆహారం అని చెప్పుకోవచ్చు.

నీరు

ఎస్. అది అందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళీ చెప్పుకోక తప్పట్లేదు. సరిగ్గా రోజూ నీరు తీసుకోకపోవడం కూడా బెల్లీ రావడానికి ముఖ్యం కారణం. ప్రతిరోజూ 4 లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తీసుకోవడం వలన బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. ఎందుకంటే తగినంత నీటిని సేవించడం వలన డీ హైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది మరియు ట్యాక్సిన్స్ ను దూరం చేస్తుంది.

షుగర్ వద్దు ఎక్సర్ సైజ్ ముద్దు

వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. బెల్లీని ప్రోత్సహించే ఆహారాలలో  తీపి పదార్థాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఉరుకు పరుగుల జీవితంలో కంటినిండా నిద్రలేక, ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం, వ్యాయామాలు చేయకపోవడం వలన బెల్లీ వస్తోంది. అందుకే కనీసం మీకు సులభంగా అనిపించిన ఏదో ఒక ఎక్సర్ సైజ్, యోగా, ధ్యానం, మార్నింగ్ వాకింగ్ చేయడం ఉత్తమం.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే అందరికీ SHARE చేయండి. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon