Link copied!
Sign in / Sign up
6
Shares

డెలివరీ తర్వాత వచ్చే బెల్లీ ఫ్యాట్ ను దాచేయండిలా…

ఓ మహిళ తల్లి అయినప్పుడు చాలా సంతోష పడుతుంది. కాని.. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో ఉండే పరిస్థితులు, డెలివరీ తర్వాత వచ్చే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఆసమయంలో ఏతల్లి అయినా.. కొన్ని విషయాలను పోల్చుకొని టెన్షన్ పడుతుంది. కాని.. డెలివరీ తర్వాత శరీరంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణం.

డెలివరీ తర్వాత తల్లి ఎదుర్కొనే ప్రధాన సమస్యలో ఫ్యాట్ చాలా ముఖ్యమైనది. ఎటువంటి కొవ్వు పదార్థాలు తీసుకోకున్నా.. ఫ్యాట్ రోజు రోజుకూ ఒంట్లో పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటుంది తల్లి. దీని వల్ల బరువు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి.. ఇటువంటి పరిస్థితుల్లో ఓ తల్లి తన బెల్లీ ఫ్యాట్ ను ఎలా బయటకి కనిపించకుండా దాచేయాలో తెలుసుకుందాం పదండి..

సరిగ్గా నప్పే నలుపు రంగు డ్రెస్సులు

బ్లాక్ లెగ్గింగ్స్, బ్లాక్ లెదర్ జాకెట్, బ్లాక్ సారీ.. వీటిల్లో కామన్ గా ఉన్నది ఏంటో మీకు ఇప్పటికే అర్థమయిఉంటుంది. అవన్నీ నలుపు రంగు కలర్ కావడం. బెల్లీ ఫ్యాట్ ను కనిపించకుండా దాచేయాలనుకునే వాళ్లు, స్లిమ్ గా కనిపించాలనుకునే వాళ్లు ఖచ్చితంగా ఫాలో కావాల్సిన డ్రెస్ కోడ్ ఇది. నిజానికి డార్క్ కలర్ లో ఉండే డ్రెస్సులు చిన్న చిన్న తప్పులను కప్పి పుచ్చుతాయి. ఇంకా.. చాలా మంది చూపు డ్రెస్ వైపుకు మళ్లుతుంది కాని.. డ్రెస్సు వేసుకున్నవాళ్ల వైపు మళ్లదు. దీంతో బెల్లీ ఫ్యాట్ ను ఎదుటివారి ముందు ఈజీగా దాచేయొచ్చు.

ఎక్కువ సైజు ఉన్న స్వెట్టర్స్, సాఫ్ట్ కార్డిగాన్స్

ఉన్నితో చేసిన డ్రెస్సులు చర్మానికి ఎంతో బాగా నప్పుతాయి. అవి ఎంతో ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అందుకే డార్క్ కలర్ లో ఉండే స్వెట్టర్స్, కార్డిగాన్స్ సూపర్బ్ గా సూట్ అవుతాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ను కనిపించకుండా దాచాలనుకునేవాళ్లు కొంచెం సైజ్ ఎక్కువగా ఉన్న స్వెట్టర్స్ ను, సాఫ్ట్ కార్డిగాన్స్ ను వాడటం బెటర్. ఇవి మిమ్మల్ని స్లిమ్ గా కనిపించేలా చేయడంతో పాటు మీకు ఎంతో సౌకర్యంగా ఉంటాయి.

ఎత్నిక్ వేర్

ఎత్నిక్ వేర్ ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎత్నిక్ వేర్ చాలా సందర్భాల్లో ఎంతో కన్వీనియెంట్ గానూ ఉంటుంది. అయితే.. ఖాదీ, కాటన్ లాంటి ఫ్యాబ్రిక్ బట్టలను కుర్తాలు, ఎత్నిక్ బ్లౌజులు, లైట్ కలర్ డ్రెస్సుల్లో ఉపయోగిస్తారు. ఈ డ్రెస్సులు ఎంతో సౌకర్యంగా ఉండటంతో పాటు అనవసర ఫ్యాట్ ను దాచేస్తాయి. మీరు స్లిమ్ గా కనిపించేలా దోహద పడతాయి. ఇంకా.. ఎత్నిక్ వేర్ టైపు డ్రెస్సు ఏదైనా ఫ్యాట్ బాడీకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఇంకా.. కలంకారి ఫ్యాబ్రిక్స్ మిమ్మల్ని మరింత స్లిమ్ గా మార్చేస్తుంది. అవే కాకుండా ఎటుంటి ఎత్నిక్ వేర్ అయినా.. బెల్లీ ఫ్యాట్ ను కవర్ చేయడానికి, ఓవర్ వెయిట్ ను దాచేయడానికి సెట్ అవుతుంది.

స్పాండెక్స్

స్పాండెక్స్, షేప్ వేర్ అనేవి స్లిమ్ గా కనిపించాలనుకునే వాళ్లకు వరాల్లాంటివి.  ఇటువంటి డ్రెస్సులను ప్రత్యేకంగా స్లిమ్ గా కనిపించాలనుకున్న వాళ్ల కోసమే తయారు చేస్తారు. ఇంకా.. చాలా మంది ఏదైనా ముఖ్యమైన వేడుకలకు డ్రెస్సులు వేసుకోవాలనుకున్నప్పుడు ఇవి కరెక్ట్ గా సూట్ అవుతాయి. అంతే కాదు.. వాళ్ల బాడీకి అనుగుణంగా ఇటువంటి డ్రెస్సులను కుట్టించుకోవచ్చు.

పరిపూర్ణత కోసం టైలరింగ్

కొన్ని కొన్ని సందర్భాల్లో మీ బరువు పెరుగుతుండొచ్చు... తగ్గుతుండొచ్చు. అటువంటి సమయాల్లో మీకు చాలా ఇబ్బంది పెట్టే విషయం మీ డ్రెస్సులు. మీరు బరువు పెరిగనప్పుడు అవి టైట్ అవ్వడమో.. మీరు బరువు తగ్గినప్పుడు లూజ్ అవ్వడమే జరుగుతుంటుంది. ఇటువంటి సమయాల్లో మీరు మీ బరువుకు తగ్గట్టుగా మీ డ్రెస్సులను ఆల్టరేషన్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే పరిపూర్ణమైన డ్రెస్సు కోసం ఓ మంచి టైలర్ ను కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితమైన కొలమానాలతో మీ డ్రెస్సులను కుట్టించుకోండి. అప్పుడే అవి మీకు ఎంతో సూట్ అవడంతో పాటు మీరు స్లిమ్ గా కనిపించేలా చేస్తాయి. ఇంకా.. ఎత్నిక్ వేర్ ను కుట్టించుకోవాలనుకుంటే.. టైలర్ దగ్గర కుట్టించుకున్న కుర్తా లాంటివి ఎంతో కంఫర్టబుల్ గా ఉంటాయి. దీన్ని వల్ల మీరు ఇంకా స్లిమ్ గా కనిపించడంతో పాటు మీ బెల్లీ ఫ్యాట్ ను కనిపించకుండా దాచేయొచ్చు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon