Link copied!
Sign in / Sign up
4
Shares

బెల్లం పానకం - వడపప్పు ఎలా చేసుకోవాలి..?

భగభగమండే సూర్యతాపం నుండి శరీరానికి కాస్త చల్లదనాన్ని ఇచ్చేవి పానకం మరియు వడపప్పు. అలాగే ఈ పానకం వడపప్పు అంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువుకు కూడా ఎంతో ఇష్టమట. ఆరోగ్యాన్నిస్తూ, ఆయుష్షును పెంచే బెల్లం పానకం మరియు వడపప్పును ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

బెల్లం పానకం కావాల్సిన పదార్థాలు :

బెల్లం - ఒక కప్పు

మంచి నీరు - 3 లేదా 4 కప్పులు

మిరియాల పొడి - ఒక స్పూన్

యాలకుల పొడి - ఒక స్పూన్

ఉప్పు - చిటికెడు

శొంఠిపొడి- ఒక స్పూన్

నిమ్మరసం -2 లేదా 3 స్పూన్లు

పానకం ఎలా చేయాలి? తయారీ విధానం

1. ముందుగా నీటిలో బెల్లం వేసి గంట లేదా అరగంట సేపు బాగా కరిగేవరకు ఉంచాలి.

2. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టుకుని అందులో మిరియాల పొడి, శొంఠిపొడి, యాలకుల పొడి, నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంతో పానకం రెడీ అయినట్లే. ఇలా చేసి మీ కుటుంబ సభ్యులకు ఇవ్వండి, కమ్మగా సేవిస్తారు.

వడపప్పు ఎలా చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు

పెసరపప్పు - 1 కప్పు

కీరదోస ముక్కలు - 4 లేదా 5

పచ్చి మిర్చి - ఒకటి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి

కొత్తిమీర - చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి

ఫ్రెష్ కొబ్బరి - కొంచెం

ఉప్పు- చిటికెడు

వడపప్పు తయారీ విధానం

1. ముందుగా కప్పు పెసరపప్పును ఒక గంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

2. ఆ తర్వాత నీటి నుండి పెసరపప్పును బయటకు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ పెసరపప్పులో పైన చెప్పుకున్నట్లుగా కొత్తిమీర, పచ్చి మిర్చి, కొబ్బరి, ఉప్పు , కీరదోస ముక్కలు వేసుకుని మిక్స్ చేసుకోవడం వలన వడపప్పు రెడీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్టార్ట్ చేయండి.

ఇది మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon