Link copied!
Sign in / Sign up
13
Shares

మంచి నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. సరైన నిద్రలేకపోవడం వలన ఉదయాన్నే తలనొప్పి, వికారంగా ఉండటం, ఆందోళనలు, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటివి జరుగుతాయి. అందుకే నిద్రించే పొజిషన్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. ఇక్కడ చెప్పుకునే విషయాలు ప్రతి దంపతుల కొరకు.  ఈ పొజిషన్ లలో పడుకోవడం వలన మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి అందరికీ తెలిసేలా SHARE చేయండి. 

తల జుట్టు ముఖంపై వేసుకుని

ఒకరిపై ఒకరు కాళ్ళు చేతులు వేసుకుని నిద్రించడం ఓకే కానీ మహిళల తల జుట్టును మగవారు ముఖంపై వేసుకుని నిద్రించడం వలన మంచి నిద్రను మగవారు మిస్ అవ్వాల్సి వస్తుంది. అలాగే మహిళలు పక్కకు జరిగినప్పుడు జుట్టు చిక్కుళ్ళు పడి జుట్టు నొప్పి కలిగి నిద్ర డిస్టర్బ్ అవుతుంది.  ఈ ఫొటోలో చూపించినట్లుగా నిద్రించడం ఉత్తమం.

ముఖంపై చేతులు వేయకండి

దంపతులైనా ఎవరైనా సరే ఒకరి ముఖంపై చేతులు వేసి ముక్కు, నోటికి దగ్గరగా ఉంచడం వలన శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకసారి నిద్రలో మెలకువ వస్తే మళ్ళీ నిద్రపోవడం చాలా సమయం పడుతుంది కూడా.

కాళ్ళను కింద పెట్టకూడదు

మీ భాగస్వామితో పడకగదిలో పడుకున్నప్పుడు లేదా నిద్రిస్తున్నపుడు ఎక్కువ సమయం  వారి శరీరం కింద కాళ్ళను ఉంచి నిద్రించడం వలన రక్తప్రసరణ చాలాసేపు జరగక, కాళ్ళు తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు మీరు ఒక్కసారిగా కాలు తియ్యడం వలన  ఇద్దరూ నిద్రను కోల్పోవలసి వస్తుంది.

మీకు దగ్గరగా పెంపుడు జంతువులు వద్దు

చాలామంది పడకగదిలో తమతో పాటు తాము పెంచుకుంటున్న పెంపుడు జంతువులను పడుకోబెట్టుకోవడం చేస్తుంటారు.  ఈ విధంగా చేయడం వలన పెంపుడు జంతువుల దగ్గర చిన్న చిన్న సూక్ష్మక్రిములు మీ శరీరానికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏ చిన్న వస్తువు కదిలినా వెంటనే గ్రహించి నిద్రలేసే అరుస్తూ ఉంటాయి కాబట్టి మీ నిద్రకు భంగం కలుగుతుంది.

ఇంకా మీకు తెలిసిన సలహాలు సూచనలు మాకు COMMENT రూపంలో చెప్పవచ్చు. అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon