మహిళల శరీరం ప్రకాశవంతంగా నిగనిగలాడుతూ మెరవడానికి 5 ఉత్తమ గృహ చిట్కాలు..
అందంగా, ఆకర్షణీయంగా ఉండటం మహిళల సొంతం అని పెద్ద పెద్ద కవులు రచయితలే ఎంతో గొప్పగా అభివర్ణించారు. అయితే ప్రస్తుతం ధూళి, దుమ్ము, కాలుష్యం కారణంగా అందంగా ఉన్న చర్మంపై మొటిమలు, నల్లని మచ్చలు, ముఖం చేతులు నల్లగా మారటం, ఇలా ప్రతి ఒక్కటీ అందాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే మీ అందానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇక్కడ చెప్పుకునే ఈ అందమైన, సులభమైన చిట్కాలను ఫాలో అయితే చాలు. అవేంటో మీరే చూడండి..
పసుపు

మీ అందం ఎప్పటికీ తగ్గిపోకుండా, నిగనిగలాడుతూ ప్రకాశవంతంగా ఉండాలంటే ఒక స్పూన్ పసుపు మరియు నాలుగు స్పూన్ల శనగపిండిని ఒకటిగా చేసి కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పాలు కలుపుకుని మీ ముఖం మరియు మెడ చుట్టూ ప్యాక్ గా వేసుకుని 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వలన ముఖం అందంగా మరియు కాంతివంతంగా మెరిసిపోతుంది.
రోజ్ వాటర్

ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే నోటిని శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని చుక్కల రోజ్ వాటర్ లో కాటన్ ముంచి ముఖంపై మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ఉన్నటువంటి జిడ్డు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా కళలాడుతుంది.
కొబ్బరి నూనె

కొబ్బరినూనెను మనం ఎక్కువగా జుట్టుకు అప్లై చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మీ ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోవడానికి కొన్ని చుక్కల కొబ్బరినూనె గోరు వెచ్చగా వేడి చేసుకుని రాత్రి పడుకునేముందు మీ ముఖానికి రాసుకుని మర్దనా చేసుకుని పడుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖం శుభ్రం చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. డైలీ ఇలా చేసుకోవచ్చు కూడా.
అలోవెరా మరియు తేనె

ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ తేనె, చిటికెడు పసుపు మరియు టీ స్పూన్ మోతాదులో పాలు వీటన్నిటిని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ చుట్టూ అప్లై చేసుకుని 20 నిముషాల తర్వాత శుభ్రంగా గోరువెచ్చని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం అందంగా మెరిసిపోతుంది. వారానికి రెండుసార్లు ఇలా చేసుకోవచ్చు.
నిమ్మరసం

ఒకటి లేదా రెండు నిమ్మకాయలు తీసుకుని వాటిని నుండి తీసిన రసాన్ని గిన్నెలో ఉంచుకోవాలి. ఈ నిమ్మరసాన్ని ముఖం, మెడ భాగం మరియు ఇతర భాగాలలో అప్లై చేసుకుని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే కలుపుకుని ముఖం మరియు మెడ చుట్టూ రాసుకుని పది నిముషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వలన ముఖంపై ఉన్నటువంటి నల్లని మచ్చలు, మొటిమలు దూరమై ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేసుకోవచ్చు.
పైన చెప్పుకున్నటువంటి చిట్కాలలో మీకు నచ్చినటువంటి చిట్కాలను ఏవైనా ఫాలో కావచ్చు. అన్నీ ఒకేసారి ఉపయీగించాల్సిన అవసరం లేదు.
