Link copied!
Sign in / Sign up
4
Shares

బయటకు వచ్చిన గుండెతో పుట్టిన బిడ్డ..3 వారాల తర్వాత ఊహించని మిరాకిల్

పుట్టబోయే ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లితండ్రులు కోరుకుంటారు. కానీ, ఇక్కడ మాత్రం తమకు పుట్టబోయే బిడ్డ ఛాతీ నుండి  గుండె బయటకు వచ్చి పుట్టబోతుందని ప్రగ్నన్సీ సమయంలో డాక్టర్స్ ద్వారా తెలుసుకున్నారు. ఈ వార్త తెలియగానే ఏ తల్లైనా సరే విలవిలలాడిపోతుంది. అనుకున్న టైం కంటే సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మను ఇచ్చారు. అందమైన ఆడపిల్ల..కానీ గుండె బయటకు వచ్చింది..కట్ చేస్తే 3 వారాల ఓ మిరాకిల్ జరిగింది. అదేంటో మీరే చూడండి.

ఆ పాప బ్రతుకుతుందని నమ్మకం పోయింది

వైద్య భాషలో ఎక్టోపియా కార్డిస్ (ectopia cordis) అనే పుట్టుకతోనే వచ్చే అరుదైన వ్యాధి కారణంగా ఇక్కడ ఉన్న చిన్నారి ఛాతీ నుండి బయటకు వచ్చిన గుండెతో జన్మించింది. ఏం చేయాలో డాక్టర్లకు కాళ్ళు చేతులు ఆడలేదు. గతనెల నవంబర్ 22 న జన్మించిన ఈ చిన్నారికి మూడు వారాల తర్వాత మూడు సర్జరీలు జరిపించి బిడ్డను బ్రతికించారు. ఈ పాపను బ్రతికించగలమా అని ఎంతో టెన్షన్ పడ్డాం.. మూడు సర్జరీల తర్వాత బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు  చాలా సంతోషంగా ఉందని వైద్యులు తెలిపారు.

నా కూతురు ఇక నాతో ఉండదనుకున్నాను

గుండెను సరిగ్గా ఛాతీలో అమర్చడానికి సర్జరీకి బయలుదేరేముందు నా కూతురు ఇక నాతో ఉండదేమో అని భయపడిపోయాను, నాకు నేనే లోపల ధైర్యం చెప్పుకున్నా భయం మాత్రం వెంటాడింది. కానీ ఈ డాక్టర్స్ అందరూ నా బిడ్డను బ్రతికించారు. అద్భుతం చేశారు అని ఈ పాప తల్లి చెప్పింది. నేను ఎన్నో హార్ట్ ఆపరేషన్స్ చేశాను కానీ ఈ పాపకు సర్జరీ చేసే సమయంలో ఆపరేషన్ థియేటర్ లో చాలా ఉత్కంఠగా సాగిందని 50 మంది అనువజ్ఞులైన వైద్య బృందంలో సర్జరీ తర్వాత ఓ డాక్టర్ తెలిపాడు.

కడుపులో ఉన్నప్పుడే అసలు విషయం తెలిసింది

ఇంగ్లాండ్ కు చెందిన నామి ఫిండ్లే (31), డీన్ విల్కిన్స్ (43) దంపతులకు జన్మించిన ఈ చిన్నారి పేరు వనెలోప్ హాప్ విల్కిన్స్. ఒకరోజు ఈ దంపతులు ప్రగ్నన్సీ సమయంలో స్కానింగ్ చేయించుకోవడానికి హాస్పిటల్ కు వెళ్లగా కడుపు భాగం ఎక్కువగా పెరుగుతూ, ఛాతీ నుండి గుండె బయటకు వస్తోందని, కడుపులో లేదా బయటకు వచ్చిన తర్వాత అయిన బ్రతికే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. అందుకే ఒక నెల ముందుగానే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసి తమ ప్రయత్నం చేసి బిడ్డను కాపాడారు. కొన్ని కోట్ల మందిలో అరుదుగా ఇలా జరుగుతుందని డాక్టర్స్ తెలిపారు.

ఆశలు వదిలేసుకున్న ఆ తల్లితండ్రులకు తమ బిడ్డను బ్రతికించిన డాక్టర్స్ మనమందరం కృతఙ్ఞతలు తెలుపుదాం.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon