Link copied!
Sign in / Sign up
20
Shares

ఎలాంటి వారైనా సరే బరువు త్వరగా తగ్గాలంటే తప్పక తెలుసుకోవాల్సిన 3 విషయాలు..

మీరు బరువు తగ్గడం గురించి ఎన్నో ప్రకటనలు వినుంటారు. ఇలా చేస్తే ఒక వారంలో 5 కేజీలు తగిలిపోతారు,  అలా చేస్తే వెంటనే తగ్గిపోతారు. కానీ, ఈ మాటలు ఎంత వరకు నిజం, ఎంత వరకు నమచ్చు? ఈ సందేహాలు కలగక మానవు. నిజానికి వెంటనే వారంలో బరువు తాగాలనుకోవడం  మంచిది కాదు. నిదానంగా, క్రమ బద్దంగా బరువు తగ్గడం మంచిది. బరువు తగ్గడానికి సులువైన మార్గం అంటూ ఏమి లేదు ఒకవేళ ఉన్నా మంచిది కాదు.

బరువు తగ్గాలంటే ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏమిటంటే బరువు తగ్గాలని బలమైన ఆలోచన, సంకల్పం. అసలు బరువు తగ్గడం అంత కష్టం,  నా మనస్సును ఎందుకు మార్చుకోలేను? ఎందుకంటే మనం సుఖానికి రుచికి అలవాటు పడుంటాము కాబట్టి. ఇప్పుడు బరువు తగ్గాలంటే తప్పక  తెలుసుకోవాల్సిన మరియు గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు ఏమిటో తెలుసుకుందాము.

1. ఆహారాన్ని తెలివిగా ఎంచుకోండి

మనం రోజు తినే ఆరాహారం మరియు మన ఆహార అలవాట్లు బరువు తగ్గడం లేదా పెరగడంలో అత్యధిక పాత్ర పోషిస్తాయి. కొన్ని ఆరోగ్యానికి మంచి ఆహారాలు ఉంటాయి మరికొన్నిటిలో ఫాట్ శాతం ఎక్కువగా ఉంది శరీరం బరువు పెరిగేలా చేస్తాయి. కావున, ఆహారాలను తెలివిగా ఎంచుకోవాలి.  అంతే కాకుండా బరువు తాగాలంటే ముందు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. కష్టమైనా ఉదయాన్నే లేవడం, టైం కి వ్యాయామం చేయడం, నూనె వంటలను తినకపోవడం, వంటలో నూనె తగ్గించడం, సరైన టైం కి నిద్రపోవడం ఇలా ప్రతి దానిని క్రమ పద్దతిలో పాటించాలి.

2. ప్రశాంతమైన నిద్ర మరియు క్రమశిక్షనతో కూడిన నిద్ర

ఈరోజుల్లో సుఖంగా ప్రశాంతంగా నిద్రపోవడం అనేది అత్యంత కష్టమైన పని. ఎటు తేలని ఆలోచనలు, శారీరిక శ్రమ లేకపోవడంతో మనకు నిద్ర అంత సులువుగా రాదు. ముఖ్యంగా కొత్తగా తల్లి అయినా వారికి నిద్ర అస్సలు సరిపోదు. కానీ, బరువు తగ్గాలంటే సరైన నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకపోతే బద్దకంగా ఉండి వ్యాయామం చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు.

3. నడవడం మాత్రమే సరిపోదు

అందరు సలహా ఇస్తుంటారు, రోజుకి కొంత సేపు నడిస్తే సులువుగా బరువు తగ్గిపోతాము అని. బరువు పెరగం అంతే, కానీ బరువు తగ్గాలంటే వ్యాయామం తప్పనిసరి. నడవడం అనేది వ్యయం చేయడానికి మీ శరీరాన్ని సిఇదమ్ చేయడం అంతే. కాబట్టి నిదానంగా వ్యాయామం అలవాటు చేసుకోండి.

బరువు తగ్గడానికి ముందు ఏం చేయాలో తెలుసుకున్నారు కదా.. సహజంగా ఎటువంటి ఖర్చు లేకుండా దొరికే అల్లం టీ తో బరువు ఎలా తగ్గవచ్చో ఇక్కడ చూడండి..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon