Link copied!
Sign in / Sign up
6
Shares

సాయంత్రం పూట ఈ స్నాక్స్ తీసుకుంటే ఎలాంటి వారైనా సరే లావు పెరగరు : బరువు తగ్గుతారు

ప్రస్తుత రోజుల్లో అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. ఒక్కసారి బరువు పెరిగితే చాలు ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా సమయం పడుతుంది. పొట్ట చుట్టూ చేరిన అధిక బరువును, కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి జిమ్ కు వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ జిమ్ కు వెళ్లి అధిక బరువును తగ్గించుకోవడం కష్టమే, అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వడం వలన మీ పొట్ట చుట్టూ చేరిన కొవ్వు తగ్గించుకోకపోయినా, పెరగకుండా చూసుకోవచ్చు. అవేంటో మీరే చూడండి.

బరువును తగ్గిస్తూ, ఆకలి కలగకుండా చేసే ఆహారాలు :

బరువు పెరగడానికి ముఖ్య కారణాలు ఎక్కవగా మసాలా ఫుడ్స్ తీసుకోవడం, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలకు బాగా ఇష్టపడటం వలన అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది. దీనికి ముఖ్య కారణం ఎంత, ఎన్ని పూటల తిన్నా సరే ఆకలి ఎక్కువగా వేయడం కూడా ఒక కారణం. అయితే ఆకలిని వేయకుండా చేసే ఈ ఫుడ్స్ తీసుకోవడం వలన మీరు బరువు పెరగకుండా ఉపయోగపడుతుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఒక్కసారి చూడండి…

ఆకలి వేసినప్పుడు తీసుకోవాల్సిన ఫ్రూట్స్

ఆకలిగా ఉందనిపించినప్పుడు మసాలా ఆహారాలు, ఆయిల్ ఫుడ్స్ కు బదులుగా ఆకలిని తగ్గించివేసే ద్రాక్ష, ఆపిల్, నారింజ, అరటిపండు, పైనాపిల్, సపోటాలు తీసుకోవడం వలన మీ శరీరంలో అనవసరపు కొవ్వు చేరకుండా కాపాడగలుగుతుంది. మంచి ఆరోగ్యం కావాలనుకున్నవారు ఇలా చేయడం ఉత్తమం.

బఠాణీలు

చాలామంది సాయంత్రం పూట స్నాక్స్ అనగానే మసాలా ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం చేస్తుంటారు. వాటికి బదులుగా బఠాణీలు తీసుకోవడం వలన మీకు కడుపునిండుగా ఉన్నట్లుంటుంది. ఇలా బఠాణీలు తీసుకోవడం వలన రాత్రి పూట తక్కువగా ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉండదు మరియు కొవ్వు మీ శరీరానికి దరిచేరదు.

డైట్ పాటించేవారు

బరువు ఎక్కువ అవుతుండటం వలన కొందరు ఈ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలని వాళ్లకు తెలిసిన డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ఇలా డైట్ ఫాలో అయ్యేవారు బరువు పెరగకుండా సాయంత్రం పూట ఉడకబెట్టిన గుడ్లు ఒకటి లేదా రెండు తినడం చేయాలి. ఇలా ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం వలన  మీ కడుపు నిండుగా ఉండి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఉండగలరు.

పిల్లలకు ఎటువంటి స్నాక్స్ ఇవ్వాలి..?

స్నాక్స్ అనగానే ఎక్కువగా పెద్దల కోసం పిల్లల కొరకే తయారు చేస్తూ ఉంటారు. పిల్లలకు స్నాక్స్ గా ఎక్కువ మసాలా ఫుడ్స్ మరియు ఆయిల్ ఫుడ్స్ ఇవ్వడం వలన ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. అందుకని ఎక్కువగా ఫ్రూట్స్, సోయా ప్రోటీన్స్, బఠాణీ, వెజిటేబుల్స్ తో చేసినవి ఇవ్వడం వలన ఆరోగ్యంగా ఉంటారు. సోయా ప్రోటీన్స్ ఆహారం తీసుకోవడం వలన రాత్రి పూట ఎక్కువ తినలేరు. అలాగే మీ పిల్లలకు రోజు పడుకునేముందు ఒక గ్లాస్ మిల్క్ ఇవ్వడం మంచిది.

బరువు పెరగకుండా ఉండాలంటే..

చాలామంది ఎక్కువగా తినడం వలనే లావు అవుతున్నాం అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు బరువు పెరగకుండా ఉండాలంటే ప్రతి రోజూ ఈవినింగ్ టైములో బాదంపప్పు తీసుకోవడం వలన మీ కడుపు నిండుగా ఉందనే ఫీల్ కలుగుతుంది. దీని కారణంగా నైట్ కొద్దిగా మాత్రమే ఫుడ్ తీసుకోగలరు.

స్నాక్స్ గా తీసుకోకూడనివి

బరువు పెరగలగానుకున్నా, బరువు తగ్గాలనుకున్నా సరే ఈ ఆహారాలకు మాత్రం చాలావరకు దూరంగా ఉండడం మంచిది. పానీపూరి, బజ్జీలు, గోబీ, కట్ లెట్, మసాలా ఫుడ్స్. వీటికి ఎంతవరకు దూరంగా ఉంటే అంత బాగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. వెయిట్ గైన్ (Weight Gain) కావాలనుకునేవారే కాదు, వెయిట్ తగ్గాలి (Weight Loss) అనుకునేవారు వీటికి అస్సలు వెళ్ళకండి. ఐతే మీకు అంతగా ఇష్టం ఉంటే ఏ నెలకో కొంచెం తీసుకోండి. మరీ ఇష్టాన్ని వదిలేసుకోవక్కర్లేదు.

బరువు ఎక్కువగా ఉన్నాం అని ఫీలయ్యే మహిళలు ఇది తప్పక చదవండి :

బరువు ఎక్కువగా ఉన్నాం, ఏం చేసినా సరే లావు తగ్గడం లేదు అని మీలో మీరే బాధపడుతున్నారా..! బరువు పెరగడం ఈజీనే కానీ బరువు తగ్గడం చాలా కష్టమైన పని. మగ, ఆడ అనే తేడా లేకుండా ఇందులో ఇద్దరూ ఈ విషయం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బరువు ఎక్కువగా ఉన్నారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పేవారు లేకపోలేదు. అయితే ఇక్కడ చెప్పుకునే బరువు (Weight) ఎక్కువగా ఉన్నాం అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇది తెలుసుకోవాలి. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం… మాతో కొంతమంది చెప్పుకున్న అనుభవాలను మీకోసం అందిస్తున్నాం.

1. ఎంత బాధగా ఉంటుందో తెలుసా

మాకు ఎందుకు వేదన కలుగుతుందంటే, మా శరీరం గురించి ఇతరులు ఏమనుకుంటారో అనే అందోలన వల్లే. మేము మా టీనేజ్‌లో ఇతరుల నుండి వచ్చే కామెంట్స్ వల్ల చాలా ఇబ్బందులు పడతాము. దీని నుండి మేము స్వాంతన పొందడానికి చాలా ప్రయత్నిస్తాము.

2. మాకు చెప్పద్దు

మేము ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ చాలా కట్టుబాట్లు పెడతారు. దురదృష్టవశాత్తూ మేము ఆ కట్టుబాట్లకు బానిసవుతాము. ఆ కట్టుబాట్లన్నీ సమాజం నుండీ, ఫ్రెండ్స్ నుండీ, అప్పుడప్పుడూ కుటుంభం నుండి కూడా ఎదురవుతాయి. ఇవన్నీ మహిళా సెలబ్రిటీలకు కూడా వర్తిస్తాయి. ప్రతి సృజనలోనూ అందాన్ని, మంచిని మనం, మన చుట్టూ ఉన్న సమాజం వేతకలేవన్నది వాస్తవం.

3. ఆరోగ్య సమస్యలు

మహిళలు బరువు పెరిగేది పర్‌ఫెక్ట్‌గా లేకపోవడం వల్ల కాదు వారి ఆరోగ్య సమస్యల వల్ల అన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఒకవేల మనం నిజంగా లావుగా ఉన్నా ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. మనలో ఉన్న ప్రతి అనువునూ మనం ప్రేమించాలి. బయటివారు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని మనం పక్కన పెట్టాలి అప్పుడే మనం సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలం.

4. తమ లావైన శరీరం గురించి వచ్చిన మాటలు లేదా కామెంట్స్ కొన్ని ఇలా ఉంటాయి.

- ‘నువ్వు ఫ్యాట్‌గా ఉన్నావ్’ అని ఎక్కువగా అన్నది మా అమ్మ మాత్రమే అని ఒక మహిళ చెప్పింది.

- మగవారి లావు వచ్చే సమస్యలతో పోలిస్తే ఆడవారికి చాలా అధికం.

- ‘నేను నా లిప్స్ మీద ముడుతలు చూసుకున్నప్పుడు, నా స్కిన్‌లో కాంతి కోల్పోయినప్పుడు, నా శరీరానికి అనవసర ఒంపులు వచ్చినప్పుడు నన్ను నేను ఇష్టపడను. అలాంటి సమయంలో నేను అందంగా ఉన్నానని అస్సలు అనిపించదు అని’ ఒక మహిళ చెప్పింది.

- ‘మంచి వాతావరణం ఉన్నప్పుడు నాకు షార్ట్స్ చేసుకోవాలని ఉంటుంది కానీ కుదరదు ఎందుకంటే, నా శరీరం అందంగా ఉండదు కాబట్టి’ అని ఒకామె చెప్పింది.

- ‘శరీరం పెరగడం, తరగడం అన్నది మన చేతుల్లో ఉండదు, అది వారి ఆరోగ్య పరిస్థితిని బట్టీ హెచ్చుతగ్గులు ఉంటుంది’.

కాబట్టి మీరు బరువు ఎక్కువ ఉన్నా కూడా పట్టించుకోకుండా, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. 

ఇవే కాకుండా మీకు ఇంకా ఏవైనా విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటే మాకు వెంటనే COMMENT చేయగలరు. అలాగే ఈ ఆర్టికల్ మీకు నచ్చి ఉంటే మాకు SHARE చేయండి..

Tags: Weight Gain, Weight Loss, Weight Gain Tips in Telugu, Telugu Weight Gain Tips, Foods for Weight Loss in Telugu, Foods to get Weight Gain, Best Tips to get weight gain, weight loss home remedies in Telugu

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon