Link copied!
Sign in / Sign up
40
Shares

బాలుడి కడుపులో 22 లీటర్ల రక్తం తాగిన కొంకి పురుగులు : అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

పిల్లల కడుపులో సాధారణంగా నులిపురుగులు, బద్దె పురుగులు, సూదిపురుగులు ఉండటం వలన పిల్లల బరువు రోజురోజుకీ తగ్గిపోయి బలహీనంగా అవుతారని ఇది వరకే మన టైనీ స్టెప్ లో చెప్పుకున్నాం. పిల్లల కడుపులో పురుగులు రావడానికి కారణాలు, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఆర్టికల్ కింద ఉండే లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు. కాగా 14 ఏళ్ళ బాలుడి కడుపులో ప్రమాదకరమైన కొంకి పురుగులు చేరి దాదాపు 22 లీటర్ల రక్తాన్ని తాగివేశాయి. అసలు ఏం జరిగిందో చూడండి..

రెండేళ్లలో 22 లీటర్ల రక్తం తాగిన కొంకి పురుగులు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్దీవా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ళ బాలుడి కడుపులో దాదాపు రెండేళ్లుగా కొంకి పురుగులు (Backyard Worms) జీవనం సాగించి, దాదాపు 22 లీటర్ల రక్తాన్ని తాగి వేశాయి. స్థానిక వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లగా పిల్లాడు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు.  రోజురోజుకీ పిల్లాడు నీరసించి పోయి అలసటగా ఉంటూ బలహీనమవటం తల్లితండ్రులను భయానికి గురిచేసింది.

సీసీ కెమెరాలతో కనుగొన్న వైద్యులు

తమ కొడుకు ఆరోగ్యం బలహీనపడటంతో ఢిల్లీలోని ఓ ప్రముఖ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా మైక్రో కెమెరా మరియు క్యాప్సుల్స్ ఎండోస్కోపీ ద్వారా బాలుడి కడుపులోని చిన్న ప్రేగులలో కొంకి పురుగులు ఉండటం గమనించారు. వీటి కారణంగానే శరీరంలోని రక్తాన్ని పీల్చివేశాయని తెలిపారు. వీటిని గుర్తించిన వైద్యులు బయటకు తీసి పిల్లాడి ఆరోగ్యాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకువచ్చారు.

కొంకి పురుగులు ఎలా వస్తాయి..?

నీటిని ఎక్కువ రోజులు స్టోర్ చేయకపోవడం వలన, నీటిని ఉంచే పాత్రలు లేదా బిందెలను శుభ్రంగా కడగకపోవడం వలన, కలుషిత నీరు తాగినప్పుడు, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా నోట్లో పెట్టుకోవడం, ఆ చేతులతోనే ఆహారాన్ని తీసుకోవడం, శుభ్రంగా లేని ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో పురుగులు చేరుతాయి. బద్దె పురుగులు, కొంకి పురుగుల కారణంగా ఊపిరి తిత్తుల సమస్యలు, రక్తహీనత సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.  సో, పేరెంట్స్ పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.. అలాగే ఈ విషయాన్ని అందరికీ SHARE చేయండి ..

ఇది తప్పకుండా చదవలగలరు..మీ పిల్లల ఆరోగ్యం కోసం

పిల్లల కడుపులో 85 శాతం పురుగులు ఉంటాయి. వాటిని బయటకు తీయడం ఎలా?

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon