Link copied!
Sign in / Sign up
7
Shares

బాలింతలు, పిల్లలు చెవులకు స్కార్ప్ కట్టుకోకపోతే ఎదురయ్యే ప్రమాదాలు

బిడ్డకు జన్మను ఇచ్చే సమయంలో మొత్తం శరీరంలోని నరాలు, అవయవాలు అన్నీ ఒక్కసారిగా కుదిపేసినట్లు ఉంటాయి. మహిళలు మాత్రమే  ఈ నొప్పిని, ప్రసవ  వేదనను తట్టుకుని బిడ్డకు జన్మను ఇవ్వగలిగే గొప్పవాళ్ళు. ప్రగ్నన్సీ సమయంలో బిడ్డ ఆరోగ్యంగా జన్మించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, ప్రసవం తర్వాత కూడా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలంటే చెవులకు స్కార్ప్ ధరించాలని చెబుతున్నారు వైద్యులు.  స్కార్ప్ ధరించకపోతే ఏమైనా ప్రమాదమో తెలుసుకోండి…

ప్రసవం తర్వాత స్కార్ప్ ఎందుకు ధరించాలి?

మన అమ్మమ్మలు, అమ్మలు ఫాలో అవుతున్న ప్రకారం ప్రసవం తర్వాత బాలింతల చెవులకు స్కార్ప్ లేదా చెవులలో దూదిని ఉంచడం చేస్తుంటారు. ఇలా ఎందుకు చేయాలి అని చాలామందికి ఉన్న అనుమానం. చలి చెవులగుండా తలకు చేరకుండా, చల్లని గాలి, ఇన్ఫెక్షన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెవులలో దూదిని పెట్టుకోవడం లేదా స్కార్ప్ ధరించమని చెబుతారు. అలాగే డెలివరీ తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి చేరుతున్నప్పుడు స్కార్ప్, దూదిని పెట్టుకోమని చెబుతున్నారు.

స్కార్ప్, దూది పెట్టుకోకపోతే ప్రమాదమా..!

అనుభవిజ్ఞులైన వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం చలికాలంలో ఐతే చలి నుండి రక్షించుకోవడానికి చెవులకు స్కార్ప్ ధరించమని చెబుతున్నారు. దూదిని పెట్టుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. స్కార్ప్ లేదా దూది పెట్టుకోకపోవడం వలన చల్లని గాలి చెవులకు చేరి కొన్ని రోజుల తర్వాత ఎదుటివారు చెప్పే మాటలు వినపడలేదని చాలామంది బాలింతలు చెప్పిన దాఖలాలు లేకపోలేదు. అలాగే ప్రసవం తర్వాత బాడీ వీక్ గా ఉంటుంది కాబట్టి, స్కార్ప్ లేదా గుడ్డ కట్టుకోకపోతే చలికి కిందపడిపోయే అవకాశం ఉంది.

పిల్లలకు స్కార్ప్ ధరించాలా..?

మీరు ఎలా ఐతే జాగ్రత్తగా ఉంటారో, చంటి మీ పిల్లలను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. స్నానం చేయించడానికి బయటకు తీసుకెళ్లినప్పుడు చల్లనిగాలి చెవులకు చేరకుండా దుస్తులతో కప్పడం, స్నానం తర్వాత వెంటనే లోపలికి తీసుకువెళ్లడం చేయాలి. గగది వాతావరణం వెచ్చగా ఉంటే స్కార్ప్ అవసరం లేదు గానీ చల్లగా ఉన్నప్పుడు, చలికాలంలో స్కార్ప్ వాడటం మంచిది.

ఈ మాట డాక్టర్లను అడగండి

కొంతమంది బాలింతలు స్కార్ప్ ధరించడం వలన తలనొప్పిగా ఉందని చెబుతున్నవారు లేకపోలేదు. నిద్రించే సమయంలో ఇలాగే పెట్టుకోవడం వలన తలనొప్పిగా ఉందని అంటుంటారు. ఐతే మీ ఇంటి వాతావరణం ప్రకారం తలకు స్కార్ప్ ధరించాలా లేదా అని డాక్టర్ ను అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా కాళ్లకు సాక్స్ ధరించడం, చెప్పులు వేసుకోవడం చేయాలి. ఇలా ఐతే ఇన్ఫెక్షన్స్ చేరవు. ఈ సమాచారాన్ని అందరికీ SHARE చేయండి..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon