Link copied!
Sign in / Sign up
11
Shares

బేకింగ్ సోడా తో బరువు తగ్గడానికి 3 మార్గాలు : ఎలాగో ఇక్కడ తెలుసుకోండి

ఈ రోజుల్లో ప్రతి మహిళ చేసే తీవ్రమైన ప్రయత్నాలలో బరువు తగ్గాలనుకోవడం ఒకటి. బరువు తగ్గి నాజుక్కా కానిపించాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తూవుంటారు. ఆ ప్రయత్నాలలో కొన్ని చాలా కష్టమైనవి ఉంటాయి. బరువు కూడ నిదానంగా తగ్గుతాం. అయితే మీకోసం సులువుగా బరువు తగ్గే ఒక చిట్కా అందిస్తున్నాం. అదే బేకింగ్ సోడా, మీరు బేకింగ్ సోడాను ఈ కింది విధంగా వాడితే త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.

1. బేకింగ్ సోడా, నిమ్మ రసం

నిమ్మ రసంలో విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి చాలా సహాయపడుతాయి. గోరు వెచ్చని నీటిలో పావు చెంచా బేకింగ్ సోడా వేసి నిమ్మ రసంతో కలిపి రోజు ఉదయం తాగండి. బేకింగ్ సోడ అరుగుదల వేగవంతం  చేస్తుంది అలానే నిమ్మరసం కొవ్వును కరిగిస్తుంది.

2. బేకింగ్ సోడా, గ్రీన్ టీ

గ్రీన్ టీ ఆరోగ్యానికి చేసే మేలు అందరికి తెలిసిందే. గ్రీన్ టీ క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. అలానే గ్రీన్ టీ తరచుగా తీసుకునే వాళ్ళలో  డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ (catechins ) అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి. అదే గ్రీన్ టీ ను పావు స్పూన్ బేకింగ్ సోడా తో కలిపి తీసుకుంటే కొవ్వును ఇంకా సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు.

3. తిన్న తరువాత

రోజు భోజనం చేశాక చల్లని నీటిని బేకింగ్ సోడాతో తాగండి. బేకింగ్ సోడా గ్యాస్ ను తొలిగించి, ఆహరం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. శరీరం లోని టాక్సిన్స్ తొలిగిస్తుంది. దీని వలన శరీరం పోషకాలను తీసుకుని కొవ్వును స్టోర్ చేసుకోదు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon