Link copied!
Sign in / Sign up
35
Shares

నానబెట్టిన బాదంలతో కలిగే ప్రయోజనాలు : మీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో చూడండి..

బాదం..దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే విత్తన ఆహారం. స్వీట్స్ తయారీలో, కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్ లలో బాదంను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి రోజూ బాదం తీసుకోవడం వలన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు శరీరానికి ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడుతుంది. చాలామంది ఆకలిని తట్టుకోలేరు, ఆకలి వేసినప్పుడు కొన్ని నిముషాలు కూడా ఉండలేరు. అటువంటివారు నాలుగు లేదా ఐదు బాదం పప్పులు తినడం వలన ఆకలిని తగ్గించివేస్తుంది, పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే సాధారణ బాదం కంటే నీటిలో నానబెట్టిన బాదం తీసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..

రాత్రి నీటిలో నానబెట్టిన బాదం 

ఒక పిడికెడు బాదంలను చిన్న గిన్నెలో నీరు తీసుకుని రాత్రి పడుకునేముందు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నీటి నుండి బాదంలను బయటకు తీసి, వాటి నుండి పై పొట్టును వేరు చేసి ఇంకో బాక్స్ లో వీటిని ఉంచుకోవాలి. వీటిని రోజుకు మూడు లేదా నాలుగు మోతాదులో తీసుకోవడం మంచిది. ఒకేసారి ఒక వారానికి తగ్గట్లు నీటిలో నానబెట్టుకోవడం బెటర్. 

బరువు, గుండె సమస్యలు 

ప్రతి రోజూ నానబెట్టిన బాదంలను నాలుగు లేదా ఐదు తీసుకోవడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. నానబెట్టిన బాదం వలన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది మరియు గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. 

మలబద్ధకం 

ఇది చాలామంది ఎదుర్కుంటున్న సమస్య, కానీ బయటకు చెప్పరు. అందుకని నానబెట్టిన బాదంలను ప్రతి రోజూ నాలుగు తీసుకుని నీటిని బాగా సేవించడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో పీచు పదార్థం ఉండటమే ఇందుకు కారణం. 

గర్భంతో ఉన్నప్పుడు బాదం 

గర్భంతో ఉన్నప్పుడు నానబెట్టిన బాదం తీసుకోవడం వలన తల్లి కడుపులోని బిడ్డ పెరుగుదల బాగా జరగడమే కాకుండా, శిశువుకు ఫోలిక్ యాసిడ్ బాగా అందుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

పిల్లలకు బాదం 

మీ పిల్లలు ఏది చదువుతున్నా మర్చిపోతున్నాం అని చెబుతూ ఉంటే, జ్ఞాపకశక్తి తక్కువని బాధపడుతూ ఉంటే రోజూ నానబెట్టిన బాదంలను పిల్లలకు రెండు లేదా మూడు ఇవ్వడం వలన వారి జ్ఞాపకశక్తి పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. 

డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ 

డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడేవారు బాదంలను తినవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించడమే కాకుండా, ఇందులోని మెగ్నీషియమ్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. 

చూశారు కదా బాదం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈ ముఖ్యమైన విషయాలు అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon