Link copied!
Sign in / Sign up
0
Shares

ఈ వేసవిలో మీ పిల్లల కోసం మీదగ్గర ఉండాల్సిన 7 వస్తువులు ఇవే…

అసలే వేసవి కాలం.. మండే సూర్యుడు. పెద్దలే ఈ మండుతున్న ఎండలను తట్టుకోలేకపోతున్నారు. మరి పిల్లల సంగతి.  పిల్లలయితే.. ఈ ఎండను తట్టుకోవడం చాలా కష్టం. మరి.. అటువంటి సందర్భాల్లో పిల్లలను ఎండ వేడి నుంచి మనమే రక్షించుకోవాల్సి ఉంటుంది. వాళ్ల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఒకవేళ పిల్లలను ఎండవేడిలో ఖచ్చితంగా తిప్పాల్సివస్తే మాత్రం మీదగ్గర ఈ ఏడు వస్తువులు ఉండాల్సిందే. మరి.. అవేంటో తెలుసుకుందాం పదండి.

బేబీ సన్ స్క్రీన్

పిల్లల చర్మం ఎంతో మృదువుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే.. పిల్లలకు డైరెక్ట్ గా సూర్యరశ్మిని పడనీయకండి. సూర్యరశ్మి, యూవీ కిరణాల నుంచి మీ పిల్లల చర్మాన్ని కాపాడటానికి బేబీ సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించండి. అవి మీ పిల్లల చర్మాన్ని ఎండవేడి నుంచి కాపాడతాయి. అయితే.. ఏ లోషన్లు బాగుంటాయో.. ఏవి మీ పిల్లలకు నప్పుతాయో రీసెర్చ్ చేసి కొనడం మంచిది.

ఓవర్ షెడ్ స్ట్రోలర్స్

ఓవర్ షెడ్ స్ట్రోలర్స్ ఉపయోగించడం వల్ల పిల్లలకు యూవీ కిరణాలు తాకవు. దీంతో పిల్లలను సూర్యుడి వేడి నుంచి కాపాడవచ్చు. అందుకే బయటికి పిల్లలను తీసుకెళ్లినప్పుడు స్ట్రోలర్స్ తీసుకెళ్లండి.

వేసవి దుస్తులు

ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే.. దుస్తులు ఎంత కంఫర్టబుల్ గా ఉంటే పిల్లలు అంత ఫ్రీగా ఉంటారు. అందుకే పిల్లలకు వదులుగా ఉన్న దుస్తులు వేయండి. ఎక్కువగా లైట్ కలర్ కాటన్ డ్రెస్సులు వేయండి. దీని వల్ల మీ పిల్లల చర్మం కూల్ గా ఉండడంతో పాటు వాళ్లు ఎంతో సౌకర్యంగా ఫీల్ అవుతారు.

స్విమ్ డైపర్స్

మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్లయితే.. వాళ్లను ఎండాకాలంలో బీచ్ కు గాని లేదంటే స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్లండి. వాళ్లకు ఈత నేర్పించండి. అయితే.. ఈత నేర్పించే క్రమంలో వాడే దుస్తులు కూడా చాలా ఫ్రీగా ఉండాలి. వాళ్లు ఆ డ్రెస్సుల వల్ల ఎటువంటి అసౌకర్యానికి గురికాకూడదు. అందుకే రీయూజబుల్ స్విమ్ డైపర్స్ ను వాడండి. వాటివల్ల అవసరానికి తగ్గట్టుగా మీ పిల్లలకు డైపర్స్ వాడొచ్చు. వాటిని మళ్లీ రీయూజ్ చేయొచ్చు.

లైఫ్ జాకెట్స్

మీ పిల్లలను బీచ్ కు గాని.. స్విమ్మింగ్ పూల్ కు గాని తీసుకెళ్లాలనుకుంటే... ఖచ్చితంగా లైఫ్ జాకెట్ తీసుకెళ్లడం మరిచిపోకండి. మీ పిల్లలకు సరిగ్గా నప్పే లైఫ్ జాకెట్ ను కొనండి.

తక్కువ బరువు ఉన్న బ్లాంకెట్స్

ఎండవేడి పిల్లలకు ఎంతో హాని చేస్తుంది. అందుకే.. పిల్లలు పడుకుంటే.. వాళ్లకు ఎండ తగలకుండా ఉండటానికి తక్కువ బరువు ఉన్న బ్లాంకెట్స్ ను ఉపయోగించండి. దాని వల్ల వాళ్లు ఎంతో సౌకర్యంగా ఫీల్ అవుతారు.

పిల్లల ముఖానికి ఎండ తగలకుండా 

పిల్లల ముఖాన్ని కవర్ చేసేలా టోపీలను వాడండి. మీ పిల్లల ముఖం మీద ఉండే చర్మం చాలా మృదువుగా ఉంటుంది. అందుకే ముఖాన్ని కవర్ చేసేలా టోపీలను వాడండి. దీని వల్ల పిల్లలు ఎండవేడి నుంచి రక్షణ పొందుతారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon