Link copied!
Sign in / Sign up
7
Shares

మీ బేబీకి మసాజ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!!

బిడ్డకు జన్మనివ్వడం ఒక ఎత్తు అయితే.. ఆ బిడ్డను పెంచి పెద్ద చేయడం మరో ఎత్తు. బిడ్డ పుట్టినప్పటినుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటేనే బిడ్డ మంచిగా ఎదుగుతాడు. కంటికి రెప్పలా చూసుకోవడం అంటే.. మంచి ఫుడ్ అందించడం, బాడీకి మంచి మసాజ్ చేయడం ఇలా చాలా చేయాల్సి ఉంటుంది. అలా అయితే.. బిడ్డ ఎదుగుదలలో ఎటువంటి సమస్యా ఉండదు. ముఖ్యంగా న్యూట్రిషియస్ ఫుడ్ తో పాటు పిల్లలకు ఎప్పటికప్పుడు మర్ధనం చేస్తూ ఉండాలి.

అయితే.. పిల్లాడికి మసాజ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయిల్. అబ్బో ఏం ఆయిల్ వాడాలో... ఏది వాడకూడదో తెలియని స్థితిలో కొంతమంది పేరెంట్స్ ఉంటారు. ఇంకా.. మసాజ్ ఎలా చేయాలో.. దాని టెక్నిక్ ఏంటో అని ఇబ్బంది పడుతుంటారు. నిజానికి పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వగానే సరిపోదు. దాంతో పాటు మసాజ్ మాత్రమే వాళ్ల ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. అంతే కాదు.. పిల్లల బాడీ కూడా కరెక్ట్ గా ఎదుగుతుంది.

పిల్లలకు స్నానం చేయించడానికి అరగంట ముందు ఆయిల్ తో మసాజ్ చేసి.. తర్వాత స్నానం చేయిస్తే.. పిల్లలు కూడా స్నానం చేయగానే హాయిగా నిద్రపోతారు. అయితే.. పిల్లలకు ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. దానికి తగినట్టుగానే ఆయిల్ ను మసాజ్ చేయాలి. వాళ్ల శరీరంపై చేయితో గట్టిగా నొక్కకూడదు.

ఇక మార్కెట్ లో దొరికే బేబీ మసాజ్ ఆయిల్ ఏదైనా వాడొచ్చు. కాని.. మీకు తెలిసిన బ్రాండ్ ను ఉపయోగించడమే ఉత్తమం. దళసరిగా ఉన్న టవల్ తో గాని లేదంటే సున్నితంగా మీ చేతులతోనే మసాజ్ చేసినా పర్వాలేదు.

అప్పుడే పుట్టిన శిశువు అయితే..

అప్పుడే పుట్టిన పిల్లలకు చాలా జాగ్రత్తగా మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఇంట్లో పెద్దల సహాయం తీసుకోవడం తప్పనిసరి. వాళ్లు పెరుగుతున్నా కొద్ది మసాజ్ టెక్నిక్స్ ను మార్చుతూ ఉండాలి. బేబీ పెరుగుతన్నా కొద్దీ వాళ్లను ఎప్పుడూ వాళ్లతో ఉంటూనే ఉండాలి. వాళ్లతో ఏదో ఒక పని చేయిస్తూ ఉండాలి. వాళ్లను కౌగిలించుకోవడం, వాళ్లతో మాట్లాడటం, కిస్ ఇవడం ఇలాంటివి చేయడంతో పాటు మసాజింగ్ కూడా పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది.

సరే.. పిల్లల బాడీ పార్ట్స్ లో ఏ పార్టును ఎలా మసాజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాళ్లు

కాళ్లకు మసాజ్ చేసేటప్పుడు చేతిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని బేబీ తొడల నుంచి మసాజ్ చేస్తూ నెమ్మదిగా కాళ్ల దాకా రావాలి. అలా అయితేనే పిల్లలకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా

బాగుండి పిల్లలకు ఎటువంటి సమస్యలు రావు.

కాలి పాదాలు

కాలి పాదాలను మీ బొటనవేలుతో గుండ్రంగా రుద్దాలి. దీంతో వాళ్ల కాలి పాదాలు చాలా స్మూత్ గా తయారవుతాయి.

కాలి వేళ్లు

మీ చేతి వేళ్లతో కాలుకు ఉన్న ప్రతి వేలును స్పృశిస్తూ మసాజ్ చేయాలి. అప్పుడే పిల్లల కాలి వేళ్లు ఎంతో మృదువుగా తయారవుతాయి.

చేతులు

కాళ్లకు మసాజ్ చేసినట్లుగానే చేతులకు కూడా సేమ్.. మోచేయి నుంచి చేతి వేళ్ల దాకా జాగ్రత్తగా మసాజ్ చేయాలి.

చేతి మణికట్టు

చేతి మణికట్టును గుండ్రంగా తిప్పుతూ తిన్నగా మసాజ్ చేయాలి.

చేతివేళ్లు

చేతి వేళ్లను మీ చేతిలోకి తీసుకొని... ఒక్కో చేతి వేలుకు నూనెను మృదువుగా రాస్తూ మసాజ్ చేయాలి.

చాతిభాగం

మీ అరచేయితో బేబీ చాతిభాగంలో స్మూత్ గా ఆయిల్ తో మసాజ్ చేయాలి.

కడుపు భాగం

కడుపు భాగంలో కూడా చాతి భాగంలో చేసిన విధంగానే మీ అరచేతితో జాగ్రత్తగా మసాజ్ చేయాలి.

వీపు భాగం

ముందుగా బేబీని ఎంతో జాగ్రత్తగా వెనకవైపు పడుకోబెట్టాలి. తర్వాత మీ అరచేయిని బేబీ వెన్నముక ప్రారంభం నుంచి  చివరి వరకు నెమ్మదిగా మసాజ్ చేయండి. అలాగే.. వెన్నముక చివరి నుంచి ప్రారంభం వరకు మరోసారి మసాజ్ చేయండి.

పిరుదుల దగ్గర

పిరుదుల దగ్గర కూడా చాలా నెమ్మదిగా మసాజ్ చేయాలి.

ముఖం

ముక్కు, పెదాలు, చెంపల మీద చాలా నెమ్మదిగా ఆయిల్ తో మసాజ్ చేయండి. కాని.. ఇక్కడ తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ కంట్లోకి వెళ్లకూడదు. ముక్కు రంద్రాలు, నోట్లోకి కూడా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Image Source : Wikimedia Commons

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon