Link copied!
Sign in / Sign up
33
Shares

ఫుడ్ చార్ట్ : ఒక సంవత్సరం నిండిన పిల్లలకు తినిపించాల్సిన ఆహారాలు, 4 వారాల లిస్ట్

ఎదిగే పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలో ప్రతి తల్లికీ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత ఎటువంటి ఆహారం ఇస్తే మంచిది, ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకూడదు అనే విషయాలలో పక్కా ప్రణాళికగా ఉండాలి. 6 నెలల పాటు బిడ్డకు తల్లి పాలు ఎంత ముఖ్యమో, సాలిడ్ ఫుడ్ మొదలుపెట్టాక పోషక విలువలతో కూడిన ఆహారం, విటమిన్స్ ఫుడ్స్ ఇలా ప్రతి ఒక్క ఆహారం ఎప్పుడు ఎలా తినిపించాలో వివరంగా మీకోసం..

1. 12 నెలల పిల్లలకు తినిపించాల్సిన ఆహారం

2. ఒక సంవత్సరం నిండిన పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారాలు

3. సంవత్సరంలోపు ఇష్టంగా తినే ఆహారాలు

4. సంవత్సరం లోపు పిల్లలకు అస్సలు తినిపించకూడని ఆహారాలు

5. 12 నెలల తర్వాత బిడ్డకు ఇవ్వాల్సిన నాలుగు వారాల డైట్ చార్ట్

12 నెలల పిల్లలకు తినిపించాల్సిన ఆహారం : తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బిడ్డ తల్లి పాలు తాగడం ఆపేసిన తర్వాత ప్రతి తల్లికీ ఉండే ఆలోచన ఇదే. ఎటువంటి ఆహారాన్ని బిడ్డకు తినిపించాలి, ఏ ఆహారాన్ని ఇవ్వకూడదని. బిడ్డ వయస్సు పెరిగే కొద్దీ ఆకలి కూడా పెరుగుతుంది కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషక విలువలు, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని ఇస్తూనే ఇక్కడ చెప్పుకునే జాగ్రత్తలు తీసుకోవాలి.

◼️ మీ బిడ్డకు ఆహారాన్ని ఇచ్చేముందు ఒక్కసారి మీ కుటుంబ సభ్యులను లేదా ఫ్యామిలీ డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి. బిడ్డకు అలర్జీలు కలిగించే ఫుడ్స్ ఏవైనా ఉన్నాయేమో అని.

◼️ ఎదుగుతున్న బిడ్డకు మరీ బలవంతంగా తినిపించకూడదు, వారికి ఆకలేస్తేనే తినడానికి ఇష్టపడతారు.

◼️ ఆహారం ఇచ్చేముందు మీ బిడ్డకు పాలు లేదా జ్యూస్ లు ఇవ్వడం చేయకూడదు. ఒకవేళ బిడ్డ తల్లిపాలు తాగుతూ ఉన్నట్లైయితే ఆహారం ఇచ్చే గంటముందు లేదా అరగంట ముందు ఇవ్వటం చేయాలి.

◼️ బిడ్డ కొన్ని ఆహారాలను తినడానికి ఇష్టపడరు. అటువంటప్పుడు ఆ ఫుడ్స్ ను దూరంగానే ఉంచాలి. అలాగే రెగ్యులర్ గా తినే ఆహారాలను కూడా ఒక్కోసారి వద్దని అంటుంటారు. కాబట్టి ఇచ్చే ఆహారాన్ని బాగా ఉడికించి ఇవ్వాలి.

ఇక్కడ క్లిక్ చేయండి సంవత్సరంలోపు పిల్లలకు అస్సలు తినిపించకూడని 5 ప్రమాదకరమైన ఆహారాలు

సంవత్సరం నిండిన పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారాలు :

ఇదివరకే పైన చెప్పుకున్నట్లు ఎదిగే పిల్లలకు ఆహారాన్ని ఇవ్వడం అనేది చాలా కష్టమైన పనే. అయితే ఒక ప్రణాళిక ప్రకారం బిడ్డకు ఆహారాన్ని ఇవ్వడం వలన వారి శరీరానికి కావాల్సిన పోషక విలువలు, వారి ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. నాలుగు వారాల పాటు మీ బిడ్డకు ఎటువంటి ఆహారాలను ఇవ్వాలో ఇక్కడ తెలుసుకోండి..

ఫస్ట్ వీక్ :

ఫస్ట్ వీక్ లో 12 పూర్తి చేసుకున్న పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, లంచ్ కు మధ్యలో స్నాక్స్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ ఇలా నాలుగు వారాల పాటు ప్రతి రోజూ ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలో చూడండి.

బ్రేక్ ఫాస్ట్

◼️ సోమవారం - గోధుమరవ్వతో చేసిన ఉప్మా

◼️ మంగళవారం - కూరగాయలతో చేసిన చపాతీ లేదా పరోటా

◼️ బుధవారం - పాలతో చేసిన ఓట్స్

◼️ గురువారం - కూరగాయలను మిక్స్ చేసిన దోశ

◼️ శుక్రవారం - గోధుమరవ్వతో చేసిన ఉప్మా

◼️ శనివారం - ఇడ్లీ లేదా గోధులతో చేసిన హల్వా

◼️ ఆదివారం - వెజిటేబుల్ పోహా

బ్రేక్ ఫాస్ట్ తర్వాత లంచ్ కు మధ్యలో ఇవ్వాల్సిన స్నాక్స్

◼️ ఒక కప్పు జ్యూస్, ఒక కప్పు ఫ్రూట్స్ లేదా ఉడికించిన ఒక గుడ్డు

లంచ్

పిల్లలకు మీరు తినిపించే లంచ్ లో పోషక విలువలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.

◼️ సోమవారం - చపాతీ పప్పు / వెజిటేబుల్ రైస్ లేదా రైస్ మరియు పెరుగు

◼️ మంగళవారం - మసాలా ఎక్కువ లేకుండా వెజిటేబుల్ బిర్యానీ మరియు పెరుగు

◼️ బుధవారం - చపాతీ పప్పు లేదా ఏదైనా వెజిటేబుల్ ను ఉడికించిన రైస్ మరియు పెరుగు

◼️ గురువారం - పనీర్ చపాతీ ‘ రైస్ మరియు పప్పు

◼️ శుక్రవారం - మసాలా ఎక్కువ లేకుండా చికెన్ మరియు చపాతీ / రైస్

◼️ శనివారం - ఫిష్ కర్రీ, రైస్

◼️ ఆదివారం - వెజ్ పులావ్ మరియు పెరుగు

ఈవినింగ్ స్నాక్స్

◼️ వెజిటేబుల్ సూప్ లేదా మీ బిడ్డ ఇష్టంగా తినే ఫ్రూట్స్ నుండి ఫ్రూట్ జ్యూస్

డిన్నర్

సంవత్సరం నిండిన పిల్లలకు ఫస్ట్ వీక్ బ్రేక్ ఫాస్ట్, లంచ్ కు మధ్యలో స్నాక్స్, లంచ్ టైం ఫుడ్, సాయంత్రం స్నాక్స్..ఇప్పుడు రాత్రికి డిన్నర్ ఏం ఇవ్వాలో తెలుసుకోండి.

◼️ సోమవారం - వెజిటేబుల్ ఖిచిడీ

◼️ మంగళవారం - అన్నంలో గుమ్మడికాయ ఉడకబెట్టి

◼️ బుధవారం - సాంబార్ దోశ

◼️ గురువారం - చికెన్ సూప్ మరియు బ్రెడ్

◼️ శుక్రవారం - గోధుమలు మరియు వెజిటేబుల్స్ తో చేసిన చిన్న పిజ్జా

◼️ శనివారం - ఆలూ పరాటా మరియు పెరుగు

◼️ ఆదివారం - రైస్ మరియు పప్పు

ఇక్కడ క్లిక్ చేయండి సంవత్సరంలోపు పిల్లలకు తప్పకుండా తినిపించాల్సిన అద్భుతమైన 9 ఆహారాలు

సెకండ్ వీక్

ఫస్ట్ వీక్ లో సంవత్సరం నిండిన పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలో తెలుసుకున్నారు కదా. నాలుగు పూటలా రెండవ వారం మీ బిడ్డకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలో ఇక్కడ చూడండి.

బ్రేక్ ఫాస్ట్

◼️ సోమవారం - ఆమ్లెట్

◼️ మంగళవారం - చపాతీ మరియు ఏదైనా వెజిటేబుల్ కర్రీ

◼️ బుధవారం - వెజిటేబుల్ పోహా

◼️ గురువారం - స్వీట్ పొటాటో లేదా ఉడకబెట్టి కీర్ లా చేసి ఇవ్వడం

◼️ శుక్రవారం - గోధుమతో చేసిన ఉప్మా

◼️ శనివారం - రాగి దోశ

◼️ ఆదివారం - ఆలూ పరోటా

బ్రేక్ ఫాస్ట్ తర్వాత లంచ్ కు మధ్యలో ఇవ్వాల్సిన స్నాక్స్

◼️ ఒక కప్పు జ్యూస్, ఒక కప్పు ఫ్రూట్స్ లేదా ఉడికించిన ఒక గుడ్డు

లంచ్

పిల్లలకు మీరు తినిపించే లంచ్ లో పోషక విలువలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.

◼️ సోమవారం - సోయాతో చేసిన కర్రీ, చపాతీ మరియు పెరుగు

◼️ మంగళవారం - కాలీఫ్లవర్ పొటాటో మిక్డ్స్ కర్రీ, చపాతీ, పప్పు మరియు పెరుగు

◼️ బుధవారం - రసం అన్నం మరియు పెరుగన్నం

◼️ గురువారం - రైస్, పప్పు, ఆకుపచ్చ బీన్స్ మరియు పెరుగు

◼️ శుక్రవారం - ఎగ్ కర్రీ మరియు రైస్

◼️ శనివారం - కొంచెం చికెన్ కర్రీతో రైస్ లేదా చపాతీ

◼️ ఆదివారం - రైస్ మరియు ఫిష్

ఈవినింగ్ స్నాక్స్

◼️ వెజిటేబుల్ సూప్ లేదా మీ బిడ్డ ఇష్టంగా తినే ఫ్రూట్స్ నుండి ఫ్రూట్ జ్యూస్

డిన్నర్

సంవత్సరం నిండిన పిల్లలకు ఫస్ట్ వీక్ బ్రేక్ ఫాస్ట్, లంచ్ కు మధ్యలో స్నాక్స్, లంచ్ టైం ఫుడ్, సాయంత్రం స్నాక్స్.. సెకండ్ వీక్ లో రాత్రికి డిన్నర్ ఏం ఇవ్వాలో తెలుసుకోండి.

◼️ సోమవారం - మెత్తగా కాల్చిన చపాతీ, పన్నీర్ కర్రీ

◼️ మంగళవారం - బెండకాయ ఫ్రై మరియు చపాతీ

◼️ బుధవారం - వెజిటేబుల్ సూప్ మరియు జీరా రైస్

◼️ గురువారం - రైస్, ఎగ్ కర్రీ

◼️ శుక్రవారం - దోశ మరియు బాగా ఉడికించిన ఆలు కర్రీ

◼️ శనివారం - మెత్తగా ఉడికించిన మిక్స్ చేసిన పప్పు అన్నం

◼️ ఆదివారం - పనీర్ పరోటా

ఇక్కడ క్లిక్ చేయండి సంవత్సరం లోపు పిల్లలు ఇష్టంగా తినే 3 వంటకాలు : సులభంగా తయారుచేసుకునే విధానం

థర్డ్ వీక్

మొదటి రెండు వారాలు సంవత్సరం నిండిన పిల్లలకు ఎటువంటి ఆహారాలను బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్ మరియు డిన్నర్ గా ఇవ్వాలో, ఇప్పుడు మూడవ వారం నుండి ఏ ఆహారాన్ని ఇస్తే పిల్లలకు ఆరోగ్యకరమో చూడండి.

బ్రేక్ ఫాస్ట్

◼️ సోమవారం - గోధుమరవ్వతో చేసిన ఉప్మా

◼️ మంగళవారం - వెజిటేబుల్స్ తో మిక్స్ చేసిన పరాటా

◼️ బుధవారం - పాలతో చేసిన ఓట్స్

◼️ గురువారం - వెజిటేబుల్ మిక్స్ చేసిన దోశ

◼️ శుక్రవారం - ఇడ్లీ లేదా దోశ

◼️ శనివారం - బాగా ఉడికించిన వెజిటేబుల్స్

◼️ ఆదివారం - వెజిటేబుల్ పోహా

బ్రేక్ ఫాస్ట్ తర్వాత లంచ్ కు మధ్యలో ఇవ్వాల్సిన స్నాక్స్

◼️ ఒక కప్పు జ్యూస్, ఒక కప్పు ఫ్రూట్స్ లేదా ఉడికించిన ఒక గుడ్డు

లంచ్

మూడవ వారం నుండి మీ పిల్లలకు మీరు తినిపించే లంచ్ లో పోషక విలువలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఆ డైట్ చార్ట్ వారం రోజుల పాటు మీరు ఇక్కడ చూడవచ్చు..

◼️ సోమవారం - పప్పు మరియు అన్నం / చపాతీ

◼️ మంగళవారం - వెజిటేబుల్ బిర్యానీ మరియు పెరుగు

◼️ బుధవారం - పప్పు మరియు చపాతీ, సీజనల్ వెజిటేబుల్స్ తో చేసిన కర్రీ మరియు పెరుగు

◼️ గురువారం - పనీర్ కర్రీ మరియు చపాతీ / రైస్

◼️ శుక్రవారం - కొంచెం చికెన్ అన్నం లేదా చపాతీ

◼️ శనివారం - ఫిష్ కర్రీ మరియు అన్నం

◼️ ఆదివారం - వెజ్ పలావ్

ఈవినింగ్ స్నాక్స్

◼️ వెజిటేబుల్ సూప్ లేదా మీ బిడ్డ ఇష్టంగా తినే ఫ్రూట్స్ నుండి ఫ్రూట్ జ్యూస్

డిన్నర్

సంవత్సరం నిండిన పిల్లలకు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ బ్రేక్ ఫాస్ట్, లంచ్ కు మధ్యలో స్నాక్స్, లంచ్ టైం ఫుడ్, సాయంత్రం స్నాక్స్.. థర్డ్ వీక్ లో రాత్రికి డిన్నర్ ఏం ఇవ్వాలో తెలుసుకోండి.

◼️ సోమవారం - వెజిటేబుల్ కిచిడి

◼️ మంగళవారం - కొన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసి ఉడికించిన అన్నం

◼️ బుధవారం - దోశ మరియు సాంబార్

◼️ గురువారం - చికెన్ సూప్ మరియు బ్రెడ్

◼️ శుక్రవారం - గోధుమలు మరియు వెజిటేబుల్స్ మిక్స్ చేసి చిన్నని పిజ్జా

◼️ శనివారం - ఆలూ పరాటా వెన్న లేదా పెరుగు

◼️ ఆదివారం - రైస్ మరియు మిక్స్డ్ దాల్

ఇక్కడ క్లిక్ చేయండి ఎదిగే మీ పిల్లల కోసం సింపుల్ గా డైట్ చార్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి!!

నాలుగవ వారం

12 నెలలు పూర్తి చేసిన మీ బిడ్డకు మొదటి మూడు వారాలు ఎటువంటి ఆహారాలను బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ మరియు డిన్నర్ టైములో ఏం ఇవ్వాలో తెలుసుకున్నారుగా, ఇప్పుడు ఫోర్త్ వీక్ లో ఎటువంటి ఆహారాన్ని పరిచయం చేయాలో ఇక్కడ చూడండి.

బ్రేక్ ఫాస్ట్

◼️ సోమవారం - గోధుమరవ్వతో చేసిన ఉప్మా

◼️ మంగళవారం - వెజిటేబుల్స్ తో మిక్స్ చేసిన పరాటా

◼️ బుధవారం - వెజిటేబుల్ పోహా

◼️ గురువారం - స్వీట్ పొటాటో కీర్

◼️ శుక్రవారం - ఉప్మా

◼️ శనివారం - మెత్తగా కాల్చిన ఆలూ పరాటా

◼️ ఆదివారం - ఎగ్ ఆమ్లెట్ / ఇడ్లీ

బ్రేక్ ఫాస్ట్ తర్వాత లంచ్ కు మధ్యలో ఇవ్వాల్సిన స్నాక్స్

◼️ ఒక కప్పు జ్యూస్, ఒక కప్పు ఫ్రూట్స్

లంచ్

మొదటి మూడు వారాలు మీ పిల్లలకు మీరు తినిపించే లంచ్ లో పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని ఇచ్చారు కదా. ఇప్పుడు నాలుగవ వారం నుండి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలో ఈ డైట్ చార్ట్ వారం రోజుల పాటు మీరు ఇక్కడ చూడవచ్చు..

◼️ సోమవారం - సోయా కర్రీ మరియు చపాతీ / అన్నం, ఒక కప్పు పెరుగు

◼️ మంగళవారం - కాలీ ఫ్లవర్ ఆలు మిక్స్ చేసిన కూర, చపాతీ మరియు పప్పు, పెరుగు

◼️ బుధవారం - రసం అన్నం మరియు పెరుగు అన్నం

◼️ గురువారం - రైస్, పప్పు, గ్రీన్ బీన్స్ మరియు పెరుగు

◼️ శుక్రవారం - ఎగ్ కర్రీ మరియు రైస్

◼️ శనివారం - కొంచెం చికెన్ మరియు అన్నం లేదా చపాతీ

◼️ ఆదివారం - రైస్ మరియు ఫిష్ కర్రీ

ఈవినింగ్ స్నాక్స్

◼️ వెజిటేబుల్ సూప్ లేదా మీ బిడ్డ ఇష్టంగా తినే ఫ్రూట్స్ నుండి ఫ్రూట్ జ్యూస్

డిన్నర్

సంవత్సరం నిండిన పిల్లలకు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ బ్రేక్ ఫాస్ట్,థర్డ్ వీక్ లంచ్ కు మధ్యలో స్నాక్స్, లంచ్ టైం ఫుడ్, సాయంత్రం స్నాక్స్ తర్వాత నాలుగవ వారం నుండి రాత్రికి డిన్నర్ ఏం ఇవ్వాలో తెలుసుకోండి.

◼️ సోమవారం - `పరాటా మరియు పన్నీర్ కర్రీ

◼️ మంగళవారం - చపాతీ మరియు బెండకాయ ఫ్రై

◼️ బుధవారం - వెజిటేబుల్ సూప్ మరియు జీరా రైస్

◼️ గురువారం - దోశ మరియు బాగా ఉడికించిన బంగాళదుంపలు

◼️ శుక్రవారం - రైస్ మరియు ఎగ్ కర్రీ

◼️ శనివారం - వెజిటేబుల్ కిచిడీ

◼️ ఆదివారం - పనీర్ పరోటా

ఇక్కడ క్లిక్ చేయండి ఫుడ్ చార్ట్ : 6 నెలల పిల్లల కోసం రోజు తినిపించాల్సిన ఆహారాలు

సో, చూశారుగా సంవత్సరం నిండిన మీ బిడ్డకు నాలుగు వారాల పాటు ఎటువంటి పోషక విలువలు, విటమిన్స్ మరియు ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని ఇవ్వాలో. వీటి గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ చేయవచ్చు. ఈ ఆహారాలు మీ బిడ్డకు పరిచయం చేసేముందు ఒక్కసారి మీ డాక్టర్ ను అడిగి కూడా తెలుసుకోండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon