Link copied!
Sign in / Sign up
0
Shares

నడిరోడ్డుపైనే బిడ్డకు జన్మను ఇచ్చిన మహిళ : ఫోన్ చేసినా రాని అంబులెన్స్..

మహిళా ముఖ్యమంత్రిచే పాలించబడే రాష్ట్రంలో, ఒక గర్భిణీ స్త్రీ, అంబులెన్సు రావడం ఆలస్యమైనా కారణంగా, నడి రోడ్డు మీద ప్రసవించే దుర్గతి రావడం చాలా దురదృష్టకరం.వివరాల్లోకెళితే, రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ జిల్లాలోని సెర గ్రామానికి చెందిన బదరీలాల్ మీనా భార్య నానుడి గర్భవతి. హఠాత్తుగా ఆమెకు ప్రవవేదన రావడంచే, తన భర్త తనను కొండ ప్రాంతల్లోంచి బైకు మీద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

దారి మధ్యలో ఆవిడకి నొప్పులు తీవ్రమవగా, తన భర్త అయిన బద్రీలాల్ వెంటనే అంబులెన్సు కోసం 108 నెంబర్ కి కాల్ చేసాడు.. కాని ఈలోగా ఆమె అక్కడ చుట్టుపక్కల ఉన్న కొందరి మహిళల సహాయంతో నడి రోడ్డు మీద తన శిశువుకు జన్మనిచ్చింది.. అంబులెన్సు వచ్చేవరకు, దాదాపు ఒక అరగంటసేపు ఆ తల్లి బిడ్డలు రోడ్డు మీదే ఉండవలసి వచ్చింది.

ఒకపక్క ఆ గర్భిణి స్త్రీ యొక్క భర్త, అంబులెన్స్ ఆలస్యంగా రావడం వలెనే తన భార్యకు ఈ దుర్గతి పట్టింది అని వాపోతుంటే, ఉదయ్ పూర్ యొక్క చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్ఒ) డాక్టర్ సంజీవ్ తక్ గారి ధోరణి పూర్తిగా వేరే విధంగా ఉంది.

అసలేం జరిగిందంటే :

ఒక IANS అధికారి నుండి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీమతి నానుడి జూన్ 7 న, చివరిసారి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చినపుడు, ఆసుపత్రిలో చేరమని అక్కడి వైద్యులు సూచించారు. కాని ఆ దంపతులిద్దరూ మొండిగా ఇంటికి తిరిగి వెళ్తామని, మళ్ళీ అవసరమైన వస్తువులు తీసుకొని తరువాతి రోజు వస్తామని చెప్పి వెళ్ళిపోయారు మరియు జూన్ 8 లేక 9 న కూడా తిరిగి ఆసుపత్రికి రాలేదని వివరించారు.

“జూన్ 10 న, ఆ గర్భిణీ స్త్రీకి నొప్పులు రాగా తన భర్త తనను కొండ ప్రాంతాల్లోనుండి బైకు మీద తీసుకువస్తుండగా, తను అక్కడే రోడ్డు మీద ప్రసవించింది. బద్రీలాల్ అంబులెన్సుకి ఉదయం 9.55 కి కాల్ చేయగా అంబులెన్సు 9.58 కి బయలుదేరి 10.10కి తిరిగి ఆసుపత్రికి చేరుకుంది” అని వైద్యులు చెప్పారు.

ఈ సంఘటనను ఉదాసీనమైనదిగా కాకుండా కేవలం నిర్లక్ష్యంతో వైద్యుల సూచనలను త్రోసిపుచ్చడం కారణంగా జరిగిందని పేర్కొన్నారు.

తల్లీ బిడ్డ ఎలా ఉన్నారు..!

ఇప్పుడు తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని, శిశువు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు వైద్యులు చెప్పారు మరియు ఆ దంపతులకి ముందస్తుగా ప్రసవం గురించి హెచ్చరించాం అని కూడా అన్నారు.

ఈ సందర్భంగా రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్, సచిన్ పైలట్, మాట్లాడుతూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే తన వైద్య పథకాల విజయాన్ని సాధిస్తుండగా, అంతర్గతంగా ఉన్నవారిని ఇప్పటికీ ప్రాథమికంగా సౌకర్యాలు అందడం లేదు అని దుమ్మెత్తిపోశారు.

నిర్భయ కోష్ లోని నిధులను ఇంకా వినియోంచలేదని మరియు మహిళలకు సంబంధించి అన్ని సంక్షోభాల కోసం అవసరమైన ప్రాథమిక సదుపాయాలను ఇంకా ఏర్పాటు చేయలేదని అన్నారు. POSCO యాక్టు కింద ఏర్పాటు చేయవలసిన ప్రత్యేక కోర్టులు కుడా ఇంకా వెలుగులోకి రాలేదని వాపోయారు.

ఈ సంఘటనపై ఆయన రాజకీయ పరంగా స్పందిస్తూ, దీనికి ప్రజలు రాబోయే ఎలెక్షన్లలో భారతీయ జనతా పార్టీకి సరైన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.

మరొక వైపు, వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ, సోమవారం నాడు ఆరోగ్య శాఖా మంత్రి కాలీచరణ్ సారాఫ్ ఇలా అన్నారు, 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి, ఏడు వైద్య కళాశాలలు మాత్రమే ఇవ్వగలిగారు, కానీ వారు కేవలం నాలుగు సంవత్సరాలు వ్యవధిలో ఎనిమిది వైద్య కళాశాలలను ఇచ్చాము, అని వివరించారు.

ఈ ఎనిమిది కళాశాలల్లో అయిదు కళాశాలలు జూలై 1 నుండి పని ప్రారంభమవుతాయని శరఫ్ ఒక ప్రజా విచారణ సమావేశం తరువాత మీడియా కు తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పదవిలో ఉన్నంత కాలం, అన్ని రంగాల్లో రాజస్థాన్ తిరస్కరించబడిందని, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాష్ట్రాన్ని కొత్త ఎత్తుకు తీసుకువచ్చారు, అని శరఫ్ తెలిపారు.

ప్రజలు ప్రభుత్వాలను, పార్టీలను నమ్మి ఓటు వేసేది తమకు అండగా నిలబడి, ఆపదలో ఆదుకుంటారనే కదా.. దయచేసి ఇలా మరో తల్లికీ ఈ పరిస్థితి ఎదురుకాకుండా చూడండని సోషల్ మీడియాలో అంటున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon