Link copied!
Sign in / Sign up
14
Shares

వీడియో : 80 ఏళ్ళ వృద్ధుడిలా కనిపిస్తున్న అప్పుడే పుట్టిన ‘అద్భుత శిశువు’

దేవుడి సృష్టో, వరమో, శాపమో ఏమో గానీ ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. వైద్య విభాగంలో ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. అలా అరుదుగా జరిగే వాటిలోనే ఈ చిన్నారి జీవితంలో జరిగింది. పేరుకే చిన్నారి కానీ చూడటానికి మాత్రం ఆ బుడతడు 80 ఏళ్ళ వృద్ధుడిలా కనిపిస్తున్నాడు. అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి? ఏమైనా సమస్యలు తలెత్తుతాయేమో తెలుసుకోండి…

ప్రోగేరియా వ్యాధి వలనే ఇలా..

ప్రపంచంలో కొన్ని కోట్ల మందిలో ఎవరికో ఒకరికే వచ్చే ఓ అరుదైన వ్యాధి ఇది. దీనినే వైద్యులు ప్రోగేరియా అని అంటారు. అంటే పుట్టుకతోనే ఇలా వయస్సు పెద్దగా కనిపించడం, తల భారీ సైజులో ఉండటం, చర్మంపై వెంట్రకలు ఎక్కువగా ఉండటం, కనుగుడ్లు బయటకు వచ్చేలా పెద్దగా ఉండటం జరుగుతుంది. అటువంటి అరుదైన వ్యాధితో బంగ్లాదేశ్ లో ఈ మగ బిడ్డ జన్మించాడు. ఇది ఏమీ పెద్ద సమస్య కాదని అందరిలాగే ఈ బిడ్డ ఆరోగ్యంగా పెరగటం జరుగుతుందని, ఐతే ఎప్పుడు ఏమి జరుగుతుందో మాత్రం చెప్పలేమన్నారు.

ఆనందిస్తున్న తల్లితండ్రులు

ఇలా పుట్టుకతోనే జన్మించిన తమ బిడ్డను చూసి ఆ తల్లితండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మాకు ఇదివరకే ఆడపిల్ల ఉంది, ఇప్పుడు మగబిడ్డ పుట్టాడు మాకు చాలా ఆనందంగా ఉంది. బిడ్డ ఎలా ఉన్నాడు అనేది మాకు భయం లేదు, ఎలా పుట్టినా మేము సంతోషంగానే ఆహ్వానించేవాళ్ళం, మా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆ తల్లితండ్రులు తమ బిడ్డపై ఉన్న ప్రేమను చాటుతున్నారు. బిడ్డ ఎలా ఉన్నాసరే అక్కున చేర్చుకోవడం, ప్రేమగా చూసుకోవడమే తల్లితండ్రులకు తెలిసిన గొప్ప విషయమని మరోసారి నిరూపించారు. ఆ వీడియో మీరూ చూడండి..

ఈ వీడియోపై మీరు ఏమైనా చెప్పాలనుకుంటే COMMENT చేయవచ్చు. ఆ తల్లితండ్రులు బిడ్డపై చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదో అందరికీ SHARE చేయండి…. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon