Link copied!
Sign in / Sign up
3
Shares

బుధవారం రోజు కర్పూరంతో ఉదయం లేదా సాయంత్రం ఇలా చేస్తే మీ ఇంట్లో కనక వర్షమే..

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కుంటున్న సమస్య ఏదైనా ఉందంటే అది ఆర్థిక ఇబ్బందులు మాత్రమే. సరైన సమయంలో డబ్బు అందుబాటులో లేకపోవడం, ఎంత సంపాదించినా సరే డబ్బు తరిగిపోవడం, ఎంత పొదుపు చేసుకున్నా కూడా ఎలాగోలా ఖర్చు అయిపోతూ ఉండటం, ఇలా కారణాలు ఏవైనా సరే ప్రతి ఒక్కరిదీ దాదాపు డబ్బు సమస్య. దీని కారణంగానే మానసిక ఇబ్బందులు, దీని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ప్రశాంతత కోల్పోవడం..ఇలా చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే మన పెద్దలు, నిపుణులు చెప్పిన ప్రకారం బుధవారం రోజు ఇలా చేయడం వలన మీ ఆర్ధిక సమస్యల నుండి దూరం కావచ్చని అంటున్నారు. అదేంటో మీరే చూడండి.

అందరూ నమ్మాలని కాదు..

ఇక్కడ చెప్పుకునే విషయం కొందరికి నమ్మబుద్ధి అవుతుంది మరికొందరికి నమ్మకం ఉండదు. మీలో ప్రతి ఒక్కరినీ ఇలా చేస్తే మంచిదని మేము చెప్పట్లేదు గానీ మీకు ఎంతోకొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం మీకు నమ్మకం ఉంటేనే ఇక్కడ చెప్పుకునే విధానాలు ఫాలో అవ్వండి. లేకపోతే అవసరం లేదు. బుధవారం రోజు ఏం చేయాలో మీరే చూడండి.

బుధవారం ఉదయం లేదా సాయంత్రం కర్పూరంతో..

చాలామంది మహిళలు శుక్రవారం లేదా శనివారం రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, తలకు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, పూజ గదిని శుభ్రంగా ఉంచుకుని పూజ చేయడం చేస్తుంటారు. అయితే మన పెద్దలు, గురువులు చెబుతున్న ప్రకారం బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం కర్పూరంతో ఇక్కడ చెప్పుకునే విధంగా చేయడం వలన మీ ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు.

బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తలంటు స్నానం చేసుకుని ఉతికిన బట్టలు లేదా నూతన దుస్తులు ధరించాలి.

మీ పూజ గదిని శుభ్రం చేసుకుని, దేవుడి ఫోటోలను వస్త్రంతో శుభ్రంగా తుడుచుకుని పసుపు, కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి.

ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు కర్పూరం బిళ్ళలు ఉంచి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత ఆవునెయ్యితో దీపారాధన చేసి, హారతి ఇవ్వాలి.

లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఎర్రటి వస్త్రంలో ఉంచుకున్న కర్పూరం బిళ్లలతో సహా, ఆ వస్త్రాన్ని మీరు ఇంట్లో డబ్బు, మీ నగలను దాచుకునే బీరువా లేదా ఏ చోటు ఉంచుతారో ఆ చోట ఉంచడం చేయాలి.

గురువులు, పెద్దలు చెబుతున్న ప్రకారం ఈ వస్త్రాన్ని అక్కడ ఉంచినట్లు మీ ఇంట్లో వాళ్ళతో గానీ, ఎవరితో గానీ అస్సలు చెప్పకూడదట. ఇలా చెబితే ఎటువంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు.

ఇలా చేయడం వలన మీ ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చని సూచిస్తున్నారు. మీకు ఈ విషయాలు చెప్పి మీ విలువైన సమయాన్ని వృధా చేయాలని కాదు, ఐతే మాకు తెలిసిన ఈ విషయం మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే అందిస్తున్నామని గమనించగలరు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే చేయగలరు.

మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, మహిళల ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలన్నా మాకు COMMENT చేయండి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon