Link copied!
Sign in / Sign up
6
Shares

అవిసె గింజలతో ఇలా చేస్తే మీ జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది

జుట్టు రాలడం ఆపడానికి మీరు అనేక రకాలుగా ప్రయత్నించుంటారు. కానీ ఏది సరైన ఫలితాన్ని ఇవ్వలేదు కదా. అందుకే మీకోసం ఒక సులువైన ఉపాయం అందిస్తున్నాం. అవిసె గింజలు. వీటిని మీరు తలకు పూసుకోవడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. కేవలం తింటే చాలు జుట్టు రాలడం తగ్గిపోతుంది. అవిసె గింజలు జుట్టు రాలడాన్ని ఎలా తగ్గిస్తాయో మరియు వీటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం…

1. విటమిన్స్

జుట్టు కుదుళ్ళకు పోషకాలను అందిస్తుంది, కొత్తగా వచ్చే జుట్టును దృడంగా, బలంగా చేస్తుంది. ఇందుకు కావాల్సిన విటమిన్లు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. మీరు రోజు అవిసె గింజలను తీసుకోవడం వలన మీ జుట్టు రాలిపోకుండా ఉండడానికి కావాల్సిన విటమిన్లు మీకు అందుతాయి.

2. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్

ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మీ జుట్టు బలంగా రాలకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్స్ మీ మాడు భాగాన్ని పొడిబారిపోనివ్వకుండా చేస్తుంది. దీని కారణంగా చుండ్రు తొలిగిపోతుంది. జుట్టుకు సాగే గుణం పెరుగుతుంది, జుట్టు విరిగి పోకుండా ఉంటుంది.

3. ఫైబర్

అవిసె గింజల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జుట్టుకు చాలా అవసరం. మీ జుట్టుకు పోషకాలు అందేలా చేస్తుంది. జుట్టు బలంగా దృడంగా, రాలిపోకుండా ఉంటుంది.

అవిసె గింజలను ఆహారంగా ఎలా తీసుకోవాలి?

అవిసె గింజలను వేయించి తినడం మంచిది. అలా తినడానికి సులువుగా ఉంటుంది. అంతే కాకుండా పోషకాలు అందకుండా చేసే యాంటి మినరల్స్ తొలిగిపోతాయి. సలాడ్స్, పరాటాలు, చట్నీ లాగా తీసుకోవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon