Link copied!
Sign in / Sign up
3
Shares

అరటి పండ్లు తింటే నిజంగా బరువు పెరుగుతారా?

అరటి పండ్లు అందరికి సులువుగా దొరుకుతాయి,అంతేకాకుండా అందరూ ఇష్టంగా తింటారు. భోజనం అయ్యాక అరటి పండు తినడం ప్రతి ఇంట్లో సహజమే. అయితే కొంతమంది బరువు పెరగడానికి అరటి పండ్లు తింటారు. అయితే ఇందులో ఎంత నిజం వుందో ఇక్కడ తెలుసుకుందాం…

అరటి పండ్లలో ఏముంటాయి?

ఒక చిన్న అరటి పండులో సుమారుగా 90 క్యాలోరీలు ఉంటాయి, అలానే కొంచెం పెద్దగా ఉండే అరటి పండ్లలో 120 క్యాలోరీలు ఉంటాయి. అరటి పండ్లు  తియ్యగా ఉండడం వలన వాటిని తినకూడని పండ్ల లిస్టులో చేరుస్తారు. అరటి పండ్లలోని తియ్యదనానికి కారణం సహజమైన చక్కర. ఈ సహజమైన చక్కర గ్లూకోజ్ గా మారి శరీరానికి శక్తిని ఇస్తాయి.

 

 

అరటి పండ్లు బరువు పెంచుతాయా?

అరటి పండ్లు తినడం వలన శరీరానికి వచ్చే శక్తి కాలేయం లో చేరుతుంది. తిరిగి శరీర అవసరాల కోసం ఉపయోగించపడుతుంది. అయితే ఎక్కువ అరటిపండ్లు తినడం వలన కాలేయం శక్తిని నిల్వ ఉంచలేదు. ఆ శక్తి కొవ్వుగా మారుతుంది. అయితే చాలా ఎక్కువ అరటి పండ్లు తినడం వలన మాత్రమే ఇలా జరుగుతుంది.

అయితే 7000 క్యాలోరీల శక్తి శరీరానికి అందిస్తే 1 కేజీ బరువు పెరుగుతారు. సాధారణం మనం రోజుకు సగటున 1200 నుండి 1800 క్యాలోరీలు తీసుకుంటాం. ఒక అరటి పండ్లు తినడం వలన 150 అదనపు క్యాలోరీలు అందుతాయి. అంటే ఎక్కువ అరటి పండ్లను ఎక్కువ రోజుల తినడం వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా రోజు కు ఒక అరటి పండు తినడం వలన బరువు పెరగరు.

 

అరటి పండు ఎందుకు తినాలి?

అరటి పండ్లలలో పుష్కలంగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి  చాలా అవసరం. అరటి పండ్లలో ఉండే పీచు పదార్ధం అరుగుదల వ్యవస్థను కాపాడుతుంది. అంతే కాకుండా రక్త హీనత, రక్త పోటు, మరియు గుండె సమస్యలను నివారిస్తుంది. జంక్ ఫుడ్స్ తినడం కన్నా అరటి పండ్లను తినడం మంచిది. అవి శరీరానికి శక్తి తో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon