Link copied!
Sign in / Sign up
3
Shares

ఈ రోజు (ఏప్రిల్ 2) రాశి ఫలాలు : ఈ రాశి వారికి చాలా అదృష్టం..


ముందుగా టైనీ స్టెప్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారములు. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునేవరకు ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొందరు జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారు, మరికొందరు వారి రాశి ప్రకారం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుంటూ ఉంటారు. రాశులు, జాతకాలను ఫాలో అయ్యేవారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకు అందిస్తున్నాం..

మేష రాశి

ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని అనుకోకుండా గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. మీది కాని దాంట్లో అస్సలు జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న ఒక వార్త మిమ్మల్ని ఎంతో సంతోషపరుస్తుంది. అలాగే మీకు రావాల్సిన డబ్బు, ఆదాయం మీకు వస్తాయి.

వృషభ రాశి

కొత్త పనులు మొదలు పెడతారు. మీ వ్యాపారాలలో మంచి లాభం వస్తుంది. మీరు ఇంతకుముందు గొడవపడ్డ వ్యక్తులతో అన్ని విషయాలు మర్చిపోయి వాళ్లే వచ్చి మాట్లాడతారు. పార్టీ లేదా ఫంక్షన్స్ లలో పాల్గొంటారు.

మిధున రాశి

పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి ఈ రోజు శుభమైనదిగా చెప్పవచ్చు. మంచి వార్తలు వింటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు.

కర్కాటకము

డబ్బు పరంగా కొన్ని సమస్యలు ఎదురైనా సమయానికి మిమ్మల్ని ఆర్ధిక పరిస్థితుల నుండి కాపాడుతుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతాయి. హడావిడిగా ఎక్కడికీ బయలు దేరడం అంత మంచిది కాదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

సింహ రాశి

మీకు దగ్గరైన వారు మీ కుటుంబ సభ్యుల మాటను వినండి, వారి మాటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు బాగా కలిసివస్తుంది. ఐతే కొన్నిచోట్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

కన్య రాశి

మీరు పెట్టుబడిగా పెట్టిన డబ్బు మీకు మంచి లాభాలను అందిస్తుంది. మిమ్మల్ని చాలారోజులుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు మీకు కాస్త రిలీఫ్ ను అందిస్తాయి. ఆరోగ్యం బాగోలేని వారు నిర్లక్ష్యం చేయకండి, దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి.

తుల రాశి

మీకు రావాల్సిన ఆదాయం మీకు ఈ రోజు వస్తుంది. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. మీరు చేస్తున్న పని లేదా వ్యాపారంలో మరిన్ని లాభాలు పొందుతారు.

వృశ్చికం

ఈ రోజు ఏదైనా వస్తువులు కొనాలి అనుకున్నవారికి బాగా కలిసివస్తుంది. మీరు చేసే వ్యాపారం లేదా ఉద్యోగంలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మార్పులు వస్తాయి, ఇవి కూడా మీ మంచికే కాబట్టి అదృష్టంగా భావిస్తారు. అంతకుమించి ఈ రోజు మీకు పరిచయం అయ్యేవాళ్ళు ఎప్పటికీ మీకు తోడుగా, అండగా నిలుస్తారు.

ధనస్సు

ఈ రాశి వారి హడావిడి ప్రయాణాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంతమంచిది కాదు. ఫ్రెండ్స్ లేదా బంధువులతో గొడవలు దూరమవుతాయి. ఏదైనా వస్తువులు కొనాలి అనుకుంటే కొనవచ్చు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

మకర రాశి

మీ మంచి కోరేవారి మాటకు విలువనివ్వడం గానీ వారి చెప్పిన పని చేయడం వలన మీరు లాభం పొందుతారు. మీ ఫ్రెండ్స్ లేదా బంధువులు మీకు అండగా నిలబడతారు. మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్న ఆటంకాలు, సమస్యల నుండి బయటపడతారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టమే అని చెప్పాలి. కొత్తవాళ్లతో పరిచయాలు సంతృప్తిని ఇస్తాయి. ఎన్నోరోజులుగా వినాలనుకుంటున్న ఆ గుడ్ న్యూస్ ఈ రోజు వింటారు. ఏ పనిచేసినా అంతా మంచే జరుగుతుంది. వీరు చేస్తున్న పనిలో కూడా మంచి లాభాలు చూస్తారు.

మీనము

ఈ రోజు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకున్నవారు మొదలు పెట్టవచ్చు. ఎటువంటి విషయాలకు ఆందోళన చెందకండి. శుభవార్తలు వింటారు. పార్టీ లేదా ఫంక్షన్ లలో పాల్గొంటారు.

ఇది ఎవ్వరినీ బాధపెట్టడానికి కాదు, గమనించగలరు.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon