అప్పుడే పుట్టిన పిల్లల శరీరం మొత్తం జుట్టు ఉండడం ప్రమాదమా? కారణాలు-చికిత్స
పిల్లలు పుట్టాక ఎలా ఉంటారు? దీని మీద అందరికి ఒక అంచనా ఉంటుంది. కానీ కొన్ని సార్లు మన అంచనాలు తారుమారు అవుతాయి. పుట్టిన పిల్లలకు శరీరం మొత్తం జుట్టు ఉండడం అందులో ఒకటి. ఇలా జరగడాన్ని చాలా మంది తల్లి తండ్రులు ఊహించరు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం?
శరీరం మొత్తం జుట్టు ఉండడం అసాధారణమా?
అప్పుడే పుట్టిన శరీరం మీద కొంత జుట్టు ఉండడం, సాధారణమే. కానీ నుదిటి మీద, బుగ్గలు, వీపు లాంటి శరీర భాగాలలో అధికంగా జుట్టు ఉండడం సాధారణం కాదు.
ఎందుకు జరుగతుంది? కారణాలు!
సాధారణ కారణం
పిల్లలు సాధారణంగా శరీరం మీద కొంత జుట్టుతో పుడుతారు. దీనిని లానుగో (lanugo) అంటారు. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు, ఇది రక్షణగా ఉంటుంది. పుట్టిన రెండు రోజుల తరువాత రాలిపోతుంది. ఒకవేళ నెలలు నిండకుండా పుడితే, శరీరం మీద జుట్టు తొలగి పోవడానికి కొన్ని నెలలు పట్టచ్చు.
అసాధారణ కారణం
అప్పుడే పుట్టిన పిల్లలకు, అధికంగా జుట్టు ఉండడాన్ని కంజెనిటల్ అడ్రినల్ హైపర్ లాసియా (Congenital Adrenal Hyperplasia or CAH) అంటారు. ఇలా జరగడానికి కారణం హార్మోన్ల ఉత్పత్తికి అవసరమయ్యే ఎంజైములు లోపించడం. దీని కారణంగా హార్మోన్ల సమతుల్యత తప్పుతుంది. అధికంగా ఆండ్రోజెన్స్ ఏర్పడి, శరీరం మొత్తం జుట్టు రావడానికి కారణం అవుతాయి. కొన్ని సార్లు ఇది పిల్లలలో గుండె జబ్బులకు కారణమవుతుంది.
చికిత్స
సాధారణంగా ఏర్పడే జుట్టు గురుంచి భయపడాల్సిన అవసరం లేదు. కొంత కాలం తరువాత రాలిపోతుంది. కానీ హార్మోన్ల లోపం వలన అయితే, తప్పకుండా చికిత్స చేయించాలి. చికిత్సలో భాగంగా కృతిమ హార్మోన్లను, స్టెరాయిడ్ల ద్వారా ఇంజెక్ట్ చేస్తారు.
