Link copied!
Sign in / Sign up
1
Shares

పుట్టిన బిడ్డల గురించి మీకు ఎవ్వరు చెప్పని 8 విషయాలు : కొత్తగా తల్లి అయిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి


మీరు గర్భంతో ఉన్నప్పుడు, మీకు పుట్టబోయే బిడ్డ గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. మీరు ఎన్ని పుస్తకాలు చదివిన, మీ బంధువులు స్నేహితులు ఎన్ని విషయాలు చెప్పిన కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్లల గురించి కొన్ని విషయాలైతే మీకు ఎవరు చెప్పరు, అవేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. అంత చలివుండదు

పుట్టిన పిల్లలకు చలి ఎక్కువగా ఉంటుందనుకుని, చాలా మంది వారిని టవల్స్ తో, దుప్పట్లతో చుట్టేస్తారు. కానీ మీరు అనుకునేంత చలి వారికీ ఉండదు. ఒకవేళ మీరు వెచ్చగా ఉన్నప్పుడు, ఇంకా వెచ్చగా చేయడానికి మిమ్మల్ని, దుప్పట్లతో చుట్టేస్తే, మీకు ఎలా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా. వారిని వెచ్చగా ఉంచడానికి అవసరమైన మేరకు మాత్రమే చేయండి.

2. వెంటనే జరగదు

కొన్ని సార్లు లేదా చాలా సార్లు, మీకు మీ బిడ్డకు మధ్య బంధం మొదటి చూపులోనే ఏర్పడిపోదు. మీరు అంత మాత్రాన మీరు మంచి తల్లి కాకుండా పోరు. తల్లి బిడ్డ మధ్య బంధం ఏర్పడడం కచ్చితం, కానీ కొంత సమయం పట్టచ్చు. మీ బిడ్డ అవసరాలు తీరుస్తూ, ప్రేమిస్తూ బంధాన్ని ఏర్పరుచుకోండి.

3. సలహాలు తక్కువ కాదు

మీరు బిడ్డకు జన్మనిచ్చిన మరుక్షణం నుండి మీకందరు సలహాలు ఇవ్వడం మొదలు పెడుతారు. ఈ సలహాలు మీకు సహాయపడడం కన్నా, ఎక్కువ కంగారు పెడుతాయి. అందులో మీ బిడ్డకు ఉపయోగపడేవి ఉంటె, వాటిని గుర్తుంచుకోండి. మిగతా వాటి గురించి అలోచించి కంగారు పడకండి.

4. డైపర్లు బయపెడుతాయి

మీ బిడ్డ డైపర్లు మిమ్మల్ని బయపెట్టవచ్చు. బిడ్డ పుట్టిన కొన్ని రోజుల వరకు, డైపర్ లో మలం నల్లగా ఉంటుంది. బయపడకండి, దానికి కారణం వుంది. పిల్లలు కడుపులోని అమ్నియోటిక్ ద్రవాలు మలం ద్వారా బయటకు వెళ్తాయి. అందుకే మలం నల్లగా ఉంటుంది.

5. దాని గురించే ఆలోచన

మీ బిడ్డ పుట్టాక, తన No.2 మీరు ఆలోచించే విషయాలలో No.1 అయిపోతుంది. అది అవసరం కూడా. బిడ్డ మలం ద్వారా తన ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవచ్చు. అందుకే ఎప్పుడు దానిని గమనిస్తూనే ఉండాలి.

6. జారిపోతారు

పిల్లలు చాలా సున్నితమైన చర్మంతో ఉంటారు. సులువుగా జారిపోతారు. స్నానం చేయించేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరదైన సహాయం తీసుకోడానికి వెనుకాడకండి. పిల్లలను ఎత్తుకోవడానికి, ఆడించడానికి ఎప్పుడు నాలుగు చేతులుండడం మంచిదే.

7. అపరాధ భవన

మీ బిడ్డ గురించి తీసుకునే జాగ్రత్తలలో మీరు ఎలాంటి రాజి పడరని తెలుసు. కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న కొన్ని తప్పులు తప్పకుండా జరుగుతాయి. అది సహజమే. అలాంటి తప్పులు జరిగినప్పుడు వాటి గురించి ఎక్కువ అలోచించి బాధపడకండి. ఇంకో సారి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.

8. మొటిమలు

అవును పసి పిల్లలకు కూడా మొటిమలు వస్తాయి. పిల్లల చర్మం బయట వాతావరణానికి అలవాటు అయ్యే ప్రయత్నంలో, ఇలా జరగవచ్చు. ఎట్టి పరిస్థితులలోను వాటిని గిల్లడం కానీ, నలపడం కానీ చేయకండి. కొన్ని రోజులకు అవే తగ్గిపోతాయి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon