Link copied!
Sign in / Sign up
8
Shares

ఆపిల్ విత్తనాలు విషమా? తింటే పిల్లల ప్రాణాలకు ప్రమాదమా?

ఆపిల్ అందరికి పసందైన పండు. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే పండు ఆపిల్. రోజుకు ఒక ఆపిల్ మనల్ని డాక్టర్ నుండి దూరంగా ఉంచుతుంది అనే మాట అందరికి తెలిసిందే. అది నిజం కూడా. ఆపిల్ లో ఉండే యాంటీఆక్సిడాంట్స్, ఫైబర్స్, పుష్కలంగా ఉంటాయి.  ఆపిల్ తినడం వలన శరీరానికి తక్షణ శక్తి తో పాటు, విటమిన్స్ కూడా అందుతాయి. ఆపిల్ తినడం కాన్సర్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులను నివారిస్తుంది.

ఆపిల్ లో అధికంగా ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పిల్లలకు కూడా ఆపిల్ ఇవ్వడం మంచిదే, కానీ ఇంత మంచిలో ఒక చెడు కూడా ఉంది. అది ప్రాణాంతకం కూడా.

 

 

 

అదేంటంటే…

ఇంత ఆరోగ్యకరమైన ఆపిల్ కూడా హాని చేసే చెడు ఉంటుంది. అదే విత్తనం. ఆపిల్ ఉండే విత్తనం తినడం ప్రమాదం. ఆపిల్ విత్తనంలో అమిగ్డాలీన్ (amigdalin) అనే పదార్ధం ఉంటుంది. మీరు ఆపిల్ పండు తినేటప్పుడు పొరపాటున విత్తనాన్ని కొరికిన, నమిలిన అందులో నుండి సైనైడ్ విడుదలవుతుంది. ఒకటి రెండు విత్తనాలైతె పర్వాలేదు, అంతకు మించి ఎక్కువ విత్తనాలు నమలడం కానీ తినడం కానీ జరిగితే అది ప్రమాదానికి దారి తీయచ్చు. అంతేకాకుండా విత్తనానికి ఉండే తొక్కు అరగదు. అది పిల్లలకు అరగదు. అందుకే మీరు కానీ పిల్లలు కాని ఆపిల్ తినేటప్పుడు విత్తనం నమలకుండా, తినకుండా జాగ్రత్త తీసుకోండి. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon