Link copied!
Sign in / Sign up
7
Shares

అనుకోని పరిస్థితులలో నడి రోడ్డు పై వేగంగా వెళ్తున్న కారులోనే ప్రసవించిన మహిళ


అందరూ తమ ప్రసవం అన్ని సౌకర్యాలున్న హాస్పిటల్ లో డాక్టర్ల సహాయంతో జరగాలని కోరుకుంటారు. అలా జరగడం తమకు పుట్టబోయే తమ బిడ్డకు సురక్షితం అని భావిస్తారు. కానీ అనేక కారణాల వలన అందరికి ఆ అవకాశం దొరకకపోవచ్చు. కొంత మంది తమ ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిస్తారు. అయినా కూడా ప్రసవం గురించి, బిడ్డ జన్మించిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిసిన వారు పక్కనే ఉంటారు. కానీ కనీసం అలాంటి సౌకర్యం, అవకాశం కూడా లేకుండా కొంత మంది అనుకోని విచిత్రమైన పరిస్థితులులలో, ప్రదేశాలలో ప్రసవిస్తుంటారు.

ఇలా జరిగింది…

అలాంటి సంఘటనే ఈ మధ్య ఒకటి జరిగింది. నెలలు నిండి ప్రసవం కోసం హాస్పిటల్ వెళ్తున్న సమయంలో, ఒక మహిళ కారులోనే ప్రసవించింది. తన భర్త పక్కనుండగా ఏ మాత్రం భయపడకుండా, కంగారుపడకుండా తన బిడ్డను కారులోనే ప్రసవించింది. తరువాత కొద్ది నిమిషాలలో హాస్పిటల్ కు చేరుకున్నారు. ఇప్పుడు తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారు.

ఆ వీడియో ఇక్కడ చూడండి....

అనుకోని పరిస్థితులలో ధైర్యాన్ని ప్రదర్శించి, కారులోనో ప్రసవించి, తన బిడ్డను కాపాడుకున్న ఈ మహిళ సాహసాన్ని, గుండె ధైర్యాన్ని సామాజిక మాధ్యమాలలో అందరూ మెచ్చుకుని, దీనిని SHARE చేస్తున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon