Link copied!
Sign in / Sign up
60
Shares

అన్నం తినేటప్పుడు కింద పడిందని 6 ఏళ్ళ కూతురిని కఠినంగా హింసించిన తల్లి : బయటకు వచ్చిన వీడియో..

అన్నం తినకుండా పక్కకు చల్లినందుకు 6 ఏళ్ళ ఈ చిన్నారిని అత్యంత దారుణంగా శిక్షించింది ఓ మహిళ. ఇది జరిగి కొన్ని రోజులే అవుతున్నా ప్రేమగా చెప్పకుండా ఇలా కఠినంగా హింసించడం చాలా దారుణం అని ఆమెను విమర్శస్తున్నారు నెటిజన్స్. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో మీరే చూడండి..

6 ఏళ్ళ బిడ్డపై అమానుషంగా దాడి..

అన్నం ప్లేట్ తో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అన్నం తింటున్న 6 ఏళ్ళ కూతురిని ఇక్కడికి రా అని పిలిచింది. ఆప్యాయంగా ఆమె దగ్గరకు వెళ్లగా ఇష్టం వచ్చినట్లు కర్రతో కొట్టింది. ఆ దెబ్బలకు ఏడుస్తుంటే ఏడవకు, ఏడ్చావో ఎక్కువ దెబ్బలు పడతాయంటూ మరింత గట్టిగా కొట్టింది. అన్నం తింటుండగా కొన్ని మెతుకులు కింద పడటం వలనో లేక కింద చల్లిందనే కారణంతోనే కఠినంగా శిక్షించింది.

గోడకేసి కొట్టింది..

6 ఏళ్ళ ఆ చిన్నారి ఆ దెబ్బలకు తట్టుకోలేక దాక్కోగా అక్కడి నుండి లాక్కుని వచ్చి మరీ కొట్టింది. ఆ తర్వాత ఈ బట్టలు వేసుకో అంటూ డ్రస్ వేస్తూ గోడకేసి కొట్టింది. ఇంట్లో విశ్వాసం చూపించే కుక్క పిల్ల కూడా ఆ చిన్నారిని కొడుతుంటే వద్దు అన్నట్లుగా ఆమెపై వారించింది. చిన్న పిల్ల అనే కనికరం, జాలి లేకుండా ఇలా చేయడంతో ఎవరో వీడియో తీసి పోలీస్ అధికారులకు చెప్పగా వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు. తమిళనాడు నుండి వెళ్లిన ఈ కుటుంబం మలేషియాలో నివసిస్తున్నారు.

పిల్లలు చాలా గొప్ప మనస్సు. అమాయకంగా తెలిసో తెలియక చేసిన చిన్న చిన్న తప్పులను దయచేసి క్షమించాలి లేదా వారికి అర్థమయ్యేలా నచ్చచెప్పాలి. కానీ ఇలా చేయడం చాలా దారుణం కదా.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon