Link copied!
Sign in / Sign up
24
Shares

అప్పట్లో మహిళలు (అమ్మమ్మలు) అందంగా కనిపించడానికి వాడిన 5 ఆయుర్వేద రహస్యాలు : అందాన్ని పెంచుతాయి కూడా..

మహిళలు అందంగా కనిపించాలనుకోవడం సహజమే. అందుకు అనేకమైన విధాలుగా ప్రయత్నిస్తూవుంటాం. క్రీమ్స్, ఫేసియల్స్, మేకప్స్ వాడుతూ ఉంటాం. ఇవన్నీ మీకు కృతిమమైన అందాన్ని మాత్రమే అందిస్తుంది. ఈ రోజుల్లో అందం కోసం మనం చేస్తున్నావని పూర్తి కృతిమత్వంతో నిండినవి. కానీ పూర్వ కాలంలో మహిళలు అందాన్ని కాపాడుకోవడానికి సహజమైన ఆయుర్వేద వస్తువుల పైన ఆధారపడేవారు. అందుకే అంత అందం వారి సొంతమైంది. అప్పట్లో మహిళలు  తమ అందాన్ని రక్షించుకోవడానికి వాడిన ఆ రహస్యాలు ఏంటో ఇక్కడ చూడండి…

1. వేప

వేపలో అనేక ఆయుర్వేద గుణాలు ఉంటాయి అంతే కాకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. వేప లోని ప్రతి భాగం చాలా అమూల్యమైనది.

మొటిమలను నిర్ములిస్తుంది

వేపాకు నీటిని కాచి చల్లారాక, ఈ నీటిలో దూదిని తడిపి మీ ముఖం పై మొటిమలున్న చోట తుడవండి, కాసేపయ్యాక చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఇది మొటిమలను తగ్గిస్తుంది.

పొడి బారిన చర్మం కోసం

వేపాకును పెరుగు తో కలిపి ముఖానికి రాసి, 15 నిమిషాల వరకు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో కడుకోండి. ఇది ముఖానికి తేమను ఇస్తుంది.

జుట్టు కోసం

క్రమం తప్పకుండా వేప నూనెతో జుట్టును మర్దన చేసుకోండి. ఇలా చేయడం వలన చుండ్రు తొలిగిపోతుంది, జుట్టు రాలడం తగ్గిపోతుంది.

2. తేనె

తేన అందరికి ఇష్టమే, కానీ ఇది కేవలం ఆహారంగా మాత్రమే కాదు మీ అందానికి కూడా అవసరం. తేన సహాయంతో మీ అందాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చొ ఇక్కడ తెలుసుకుందాం.

కాలిన గాయాల కోసం

కాలిన గాయాలు మానడానికి తేనను వాడచ్చు. కాలిన ప్రాంతాల్లో తేన రాయండి. తేన యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది. కాలిన గాయాలు, వాటి వలన ఏర్పడిన మచ్చలు తొలిగిపోతాయి.

మృదువైన చర్మం కోసం

తేనెను ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం వలన చర్మం మృదువుగా ఉంటుంది. ముఖం పై తేనెను సమానంగా ఫేస్ ప్యాక్ లా పూసుకుని 15 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోండి. అలాగే మహిళల అందమైన కాంతివంతమైన చర్మం కోసం సులువైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి

3.ఉసిరి

ఉసిరి లో అధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇందులోని ఆయుర్వేద గుణాలు అందాన్ని పెంపొందించడానికి చాలా సహాయపడుతాయి.

బలమైన జుట్టు కోసం

ఉసిరి కాయ పొడిని లేదా ఉసిరి రసాన్ని నిమ్మ రసంతో కలిపి జుట్టును పట్టించండి, కాసేపు మర్దన చేయండి. పూర్తిగా ఆరేవరకు అలానే ఉండనివ్వండి. తరువాత తల స్నానం చేయండి.

4. ముల్టానా మట్టి

ప్రాచీన కాలంలో అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా వాడిన ఆయుర్వేద పదార్ధం ముల్టానా మట్టి. ఇందులో వుండే సహజమైన ఆయుర్వేద లక్షణాలు మీ సౌందర్యాన్ని కాపాడుతాయి.

మొటిమల వలన ఏర్పడిన మచ్చలు పోడానికి

ముల్టానా మట్టికి టమాటో రసం కలిపి ముఖానికి రాయండి. కాసేపు ఆరణిచాక చల్లని నీటితో కడుక్కోండి. ఇలా తరచూ చేయడం వలన మొటిమల వలన ఏర్పడిన మచ్చలు తొలిగిపోతాయి.

5. పసుపు

పసుపు లోని ఆయుర్వేద గుణాలు మనకు తెలిసినవే. పసుపు యాంటీ బాక్టీరియా,  యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపుతో మీ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

స్ట్రెచ్ మార్క్స్ తొలిగించడానికి

పసుపు, శెనగ పిండి, పెరుగు కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో రాయండి. ఇలా చేయడం వలన స్ట్రెచ్ మార్క్స్ తొలిగిపోయితాయి.

కాలి పగుళ్ళకు

కొబ్బరి నూనె, పసుపు రెండు కలిపి కాళ్ళు పగిలిన చోట పూయండి. కాళీ పగుళ్లు తగ్గుతాయి. 

..................................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon