యుక్తవయసులో అమ్మాయిలలో, అబ్బాయిలలో శారీరక మార్పులు వస్తాయి. వీటిని ట్యానెర్ అనే శాస్త్రవెత్త కనుక్కోవడం వల్ల వీటిని ట్యానెర్ దశలు అని అంటారు.
ట్యానెర్ మొదటిదశ
ఈ దశను యుక్తవయసు కన్నా ముందు దశ అంటారు. దీనినే బాల్య దశ అని కూడా అంటారు. ఈ దశలో అమ్మాయీలలో కానీ,అబ్బాయిలలో కానీ ఎటువంటి మార్పులూ రావు.
ట్యానెర్ రెండవ దశ
అమ్మాయిలలో: అమ్మాయిలలో ఈదశ 11 సంవత్సరాల ప్రాయంలో మొదలౌతుంది. వారి బ్రెస్ట్ పెరగడం ఈ దశలో మొదలౌతుంది. నిపుల్స్ చుట్టూ ఉండే చర్మం వ్యాకోచించడం మొదలౌతుంది. బ్రెస్ట్ చుట్టూ ఉండే కణజాలం అభివృద్ధి చెందడం మొదలౌతుంది. వెజినా దగ్గర హెయిర్ రావడం గమనించవచ్చు. ఈస్ట్రోజన్ విడుదల అవడం మొదలై గర్భసంచి పెరగుతుంది. ఈదశలో అమ్మాయిలు 7-8 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతారు.
అబ్బాయిలలో: అబ్బాయిలకు ఈదశ 12 సంవత్సరాల వయసులో మొదలౌతుంది. వారికి స్క్రోటం పెరగడం మొదలౌతుంది. పెనిస్ చుట్టూ వెంట్రుకలు రావడం గమనించవచ్చు
ట్యానెర్ మూడవ దశ
అమ్మాయిలలో: 12 సంవత్సరాల వయసులో ఈదశ ప్రారంభం అవుతుంది. బ్రెస్ట్, నిపుల్స్ ఈ దశలో ఇంకా పెరుగుతాయి. వెంట్రుకలు వెజినా దగ్గర ఎక్కువగా అవ్వడం గమనించవచ్చు. మోచేతి కింద కూడా వెంట్రుకలు వస్తాయి. ఈ దశలో 8 సెంటిమీటర్ల వరకు ఎత్తు పెరగవచ్చు.
అబ్బాయిలలో: అబ్బాయిలలో ఈదశ 13 సంవత్సరాలలో ప్రారంభం అవుతుంది. పెనిస్ దగ్గర వెంట్రుకలు ఎక్కువ అవడం గమనించవచ్చు. వారి సైజ్ పెరుఫుతుంది. కొంతమంది అబ్బాయిలలో బ్రెస్ట్ పెరిగి కొన్ని నెలల తర్వాత తిరిగి మామూలు స్టేజ్‌కు వచ్చేస్తుంది. ఈదశలో సెమన్ విడుదల ప్రారంభం అయ్యి నిద్రలో లీక్ అవ్వడం గమనించవచ్చు. ఈదశలో అబ్బాయిలు 7-8 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతారు. అబ్బాయిల గొంతు మారడం గమనించవచ్చు.
ట్యానెర్ నాలుగవ దశ
అమ్మాయిలలో: ఈదశ 13 ఏళ్ళ వయసులో ప్రారంభం అవుతుంది. వారి బ్రెస్ట్ చాలా వరకు అడల్ట్ రూపాన్ని సంతరించుకుంటాయి. వెజినా దగ్గర వెంట్రుకలు కూడా అడల్ట్ లాగా వస్తాయి. సాధారణంగా చాలా మంది అమ్మాయిలకు ఈదశలో మొదటి పీరియడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ దశలో వారి పెరుగుదల కొంచెం మందగిస్తుంది. వారు 7 సెంటిమీటర్ల వరకు ఎత్తు పెరుగుతారు.
అబ్బాయిలలో: ఈదశ అబ్బాయిలలో 14 ఏళ్ళ ప్రాయంలో ప్రారంభం అవుతుంది. వారికి పెనిస్ చుట్టూ హెయిర్ ఎక్కువ అవ్వడం, పెనిస్ దగ్గర చర్మం నల్లగా మారిపోవడం గమనించవచ్చు. మోచేతి కింద వెంట్రుకలు రావడం ఎక్కువ అవుతుంది. వారి వాయిస్ పూర్తిగా మారిపోయి ఉంటుంది.
ట్యానెర్ ఐదవ దశ
అమ్మాయిలలో: వారికి జన్యుపరమైన మార్పులన్నీ వచ్చేస్తాయి. వారు పూర్తి దశలో ఎదిగి ఉంటారు. వారి బ్రెస్ట్, వెజినా పూర్తి అడల్ట్ స్టేజ్‌లోకి వచ్చేస్తాయి. ఈదశలో వారి గ్రోత్ ఆగిపోతుంది. వారి ఎత్తు 5-6 సెంటిమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.
అబ్బాయిలలో: అబ్బాయిలకు ఈదశలో శరీర పార్శ్వాలలో పూర్తిగా వెంట్రుకలు వచ్చేస్తాయి. వారికి ఈ దశంలో గడ్డం బాగా పెరిగి షేవ్ కూడా చేయాల్సి రావచ్చు. వారిలో ఎత్తు పెరగడం కొనసాగినప్పటికీ, యుక్తవయసుకు సంబంధించిన గ్రోత్ తగ్గిపోతుంది. వారు పూర్తి అడల్ట్‌గా ఈదశలో మారిపోతారు.
ఈదశలో అమ్మాయిలలో అబ్బాయిలలో చాలా మార్పులు వస్తాయి. వారి ముఖం మీద మొటిమలు రావడం, చెమట వదిలే గ్లాండ్ సంఖ్య పెరగడం వంటివి జరుగుతాయి. అమ్మాయిలకు ఈ దశంలో పీరియడ్స్ వస్తాయి. వాటి వల్ల వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అవేంటంటే,
- బ్రెస్ట్ నొప్పిగా ఉండటం
- ఎక్కువ ఇరిటేట్ అవ్వడం
- వెన్నునొప్పి రావడం
- మూడ్ స్వింగ్ అవడం
ఈదశలో అబ్బాయిలలో, అమ్మాయిలలో భౌతిక, మానసిక మార్పులు చాలా వస్తాయి. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ టెన్షన్ పడిపోవడం, గాభరాగా ఉండటం, ఒత్తిడిలో ఉండటం వంటివి జరుగుతాయి. ఈదశలో ఆత్మ విశ్వాసం తగ్గిపోవడం, ఎక్కువ డిప్రెసన్లోకి వెళ్ళడం కూడా జరగవచ్చు. అయితే ఇవన్నీ కూడా కేవలం కొన్ని రోజులే అని గుర్తుపెట్టుకోవాలి.
