Link copied!
Sign in / Sign up
7
Shares

అమ్మను బ్రతికించిన 'మిరాకిల్ బేబీ' : వైద్యులకే షాక్ ఇచ్చిన అమ్మాయి పుట్టుక

అప్పుడప్పుడు మనం సినిమాలలో చూస్తూనే ఉంటాం కదా.. బిడ్డ ఏడుపు వినో లేదా తమకు ఇష్టమైన వారి మాటలు విన్నప్పుడు వారి మెదడుకు డైరెక్ట్ గా తాకినప్పుడు కోమా నుండి బయటకు వచ్చారని, ఇక్కడ కూడా అలాంటి అరుదైన సంఘటనే జరిగింది. అప్పటివరకు కోమాలో ఉన్న ఆ తల్లి బిడ్డ ఏడుపు వినగానే కోమా నుండి బయటకు వచ్చింది. ఇది వైద్య చరిత్రలోనే ఒక మిరాకిల్ అని, అమ్మను ప్రాణాలతో కాపాడిన చిన్నారి అంటూ ప్రపంచం అంతా ఈ బిడ్డ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలేం జరిగిందో మీరే చూడండి.. 

3 నెలల గర్భంతో ఉన్నప్పుడు.. 

కేరళలోని కొట్టాయంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని మాట్లాడుకునేలా చేసింది. అమ్మకు, అమ్మ కడుపును చీల్చుకుని బయటకు వచ్చిన బిడ్డకు ఎటువంటి అనుబంధం ఉంటుందో మరోసారి ఈ తల్లీ బిడ్డ ద్వారా నిరూపితమైంది. బెటీనా అనే ఈ మహిళ జనవరిలో రోడ్డు ప్రమాదానికి గురైంది. తలకు, బ్రెయిన్ కు దెబ్బలు తగలడంతో కోమాలో వెళ్ళింది. అప్పుడు మూడు నెలల గర్భవతి. ఒక్క ఊపిరి తీసుకోవడం తప్ప ఆమె శరీరంలో ఎటువంటి చలనం లేదు. గర్భవతి కావడంతో మందులు, ఫ్లూయిడ్స్ ఇవ్వడం వలన కడుపులోని బిడ్డకు ప్రమాదమని డాక్టర్లు అనుకున్నారు. కానీ ఆమెను ప్రాణాలతో బ్రతికించుకోవడానికి మందులు, ఫ్లూయిడ్స్ తప్పక ఇవ్వాల్సి వచ్చింది. ఇలా ఆమెకు ఒకవైపు ట్రీట్మెంట్ జరుగుతున్న కొన్ని నెలల తర్వాత స్కానింగ్ చేయగా కడుపులోని బిడ్డ కదులుతున్న దృశ్యాలు గమనించి షాక్ అయ్యారు. మొదట అబార్షన్ చేయాలనుకున్నారు కానీ తల్లికి ఏమైనా ప్రమాదం ఉంటుందేమోనని నిలిపివేశారు. 

కోమా నుండి తల్లిని బ్రతికించిన బిడ్డ 

బెటీనా పరిస్థితిని భర్త అనూప్, 3 ఏళ్ళ కుమారుడు బాధపడేవారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటిలేటర్ నుండి ఐసీయూలోకి తరలించారు. కడుపులోని బిడ్డ ఎదుగుదలను పరిశీలిస్తున్న వైద్యులు 37 వారంలో ఉన్నప్పుడు బిడ్డను సిజేరియన్ ద్వారా బయటకు తీశారు. పండంటి ఆడపిల్ల జన్మించింది. బిడ్డ ఏడుస్తూ బయటకు రావడంతో అప్పటివరకు ఊపిరి తీసుకోవడానికి కష్టపడిన ఆ తల్లి, బిడ్డ ఏడుపు వినగానే కోమా నుండి బయటకు వచ్చింది. ఇది చూసిన వైద్యులు 'అమ్మను బ్రతికించుకోవడానికే తల్లి కడుపు నుండి బయటకు వచ్చిన మిరాకిల్ బేబీ' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. గత నెలలో కేరళలోని కొట్టాయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

10 రోజుల్లోనే ఇంటికి వెళ్లారు 

బిడ్డ ఏడుపు విని కోమా నుండి బయటకు వచ్చిన బెటీనా తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. తన భర్తను చూసి సంతోషించింది. కోమా నుండి బయటకు రావడం, సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మను ఇవ్వడంతో 10 రోజుల పాటు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. 10 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో విటమిన్ టాబ్లెట్స్ మరియు ఫిజియోథెరపీ మాత్రమే తీసుకుంటున్నారు. 

చూశారు కదా, 'అమ్మకు బిడ్డకు ఎటువంటి పేగు బంధాన్ని ఆ దేవుడు ముడివేస్తాడో' అంటూ సోషల్ మీడియాలో ఈ తల్లి బిడ్డ గురించి మాట్లాడుకుంటున్నారు. 

Image and Information : Manorama Online 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon