Link copied!
Sign in / Sign up
2
Shares

అమ్మలకు ఈ పిల్లలు ఇస్తున్న అరుదైన గౌరవం : ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఫోటో

పెద్దలకు ఎందుకు నమస్కరించాలి ?

కొన్ని ఏళ్ళ క్రితం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా పెద్దలు బయటకు కనిపిస్తే చాలు వంగి వారి పాదాలకు నమస్కారం చేసి వారి పెద్దల ఆశీర్వాదాన్ని పిల్లలు పొందేవారు. ఇలా చేయడం అనేది మహాభారత కాలం నాటి నుండే ఉంది. ఐతే ప్రస్తుత రోజుల్లో ఇలా చేసి ఎక్కడో అరుదుగానే ఉన్నారు అనే చెప్పేదానికన్నా అసలు ఎవరూ ఇలా చేయడం లేదనే చెప్పాలి. పెద్దలకు ఇలా నమస్కారం చేయడం వలన పిల్లలలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ దృక్పధం కలుగుతుంది మరియు పెద్దలంటే గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఐతే ఇక్కడ కింద ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లుల కోసం ఈ పిల్లలు చేస్తున్న గొప్ప పని చూస్తే అభినందించకుండా ఉండలేరు..

స్కూల్ యాజమాన్యం తీసుకున్న గొప్ప నిర్ణయం 

ఈ ఫోటో ఇండోనేషియా దేశంలోని ఒక స్కూల్ లో తీసినది. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే తమకు జన్మను ఇచ్చిన తల్లి పాదాలను శుభ్రం చేసి వారికి నమస్కరిస్తున్నారు. ఈ ఒక్క స్కూల్ లోనే కాదు, ఇండోనేషియాలోని ప్రతి స్కూల్ లో ఇలా వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి విద్యార్ధి, విద్యార్థినుల తల్లులను స్కూల్ కు రమ్మని ఆహ్వానించి, వారిని కుర్చీలలో కూర్చోపెట్టి నీటితో తమ తల్లుల పాదాలను శుభ్రం చేసి వారి పాదాలకు నమస్కరించడం చేస్తుంటారు. ఇలా ప్రతి ఒక్క విద్యార్ధి చేయాలని ఇండోనేషియాలో నిర్ణయం తీసుకున్నారట.

ఎందుకు ఇలా చేస్తున్నారు..?

కంటికి కనిపించని దేవుడు కన్నా కళ్ళ ముందు ఉన్న తల్లితండ్రులను ప్రేమించడం, వారిని గౌరవించడమే ఆ పరమాత్మకు సేవ చేసుకున్నంత సమానమని అంటుంటారు. ఇక్కడ వీరు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఇలా పిల్లలు తమ తల్లులకు చేయడం వలన విద్యార్ధి దశ నుండి ఏనాడూ తమ తల్లితండ్రులను అశ్రద్ధ చేయకుండా, వారికి అండగా ఉంటూ, తమ కన్నవారి ఋణం తీర్చుకోవాలని చెప్పడమే దీని వెనుక ఉన్న అసలు రహస్యం. ఇంకో విషయం ఏమిటంటే చాలామంది పెళ్లి అయ్యాక తమ తల్లితండ్రులను వారికి దూరంగా వృద్ధాశ్రమాలలో పెట్టడం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్క వృద్ధాశ్రమం కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే ఈ గొప్ప విషయం, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

నిజమే కదా ఇలా పిల్లలకు బాల్య దశ నుండే అలవాటు చేయడం వలన పిల్లలు క్రమశిక్షణగా పెరుగుతారు, పెద్దలంటే గౌరవ మర్యాదలు ఇస్తారు. వారి ఉన్నత భవిష్యత్ కు బాగా ఉపయోగపడుతుంది కూడా. ఇలా మనదేశంలో కూడా వస్తే బాగుణ్ణు అంటున్నారు అందరూ. అందరికీ తప్పకుండా SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon