Link copied!
Sign in / Sign up
18
Shares

అమ్మగా మీ జీవితం సంతోషంగా ఉండడానికి 4 మార్గాలు : ఇవి పాటిస్తే ఎల్లప్పుడూ సంతోషమే

పిల్లలు పుట్టిన కొత్తల్లో వారి బాగోగులు చూసుకోవడంలోనే సమయమంతా గడిచిపోతుంది.  పిల్లలు కొంచెం పెద్ద వారు  అయ్యి స్కూల్ కి వెళ్లడం మొదలు పెట్టె సరికి  మనకు ఏమి చేయాలో అర్థం కాదు, ఇల్లంతా బిసారుమని ఉంటుంది. ప్రతి రోజు చేసే పనుల్లో మునిగి పోయి మనకంటూ సమయాన్ని ఇచ్చుకోవడం మర్చిపోతాము.దీని వలనే చాల మంది మహిళలు వారి జీవితం ఏమంత సంతోషంగా లేదని బాధపడుతుంటారు. అలంటి వారి జీవితాలలో సంతోషం నిమ్పగలిగే ఈ నాలుగు మార్గాలు తెలుసుకోండి.

1. మీకోసం సమయాన్ని కేటాయించుకోండి

అమ్మతనం అనేది, భార్య భాద్యతలనేవి జీతంలేని, ఫుల్ టైం ఉద్యగంలాటివి. అందరి అవసరాలు తీర్చడానికి మనం సమయం కేటాయిస్తాము కానీ మనకంటూ కొంత సమయం కూడా వెచ్చించము. అందువలన జీవితం బోర్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి,  ఒక పుస్తకము చదవడమే, లేదా కాసేపు చల్ల గాలికి నడవడం వంటివి చేస్తూ అందమైన ఆలోచనలతో గడపండి.

2. ఎక్కువ కష్టపడకండి

అమ్మలు తమ పిల్లలకు అన్ని గొప్పవి సమకూర్చాలని ఆరాటపడుతుంటారు. వారి ఆశలు, ఆలోచనలు పిల్లల మీద కోరికలు ఆకాశాన్ని అంటుతాయి. కొన్ని సార్లు ఆ ఆలోచనలు అందుకోలేనప్పుడు చాలా బాధపడిపోతుంటారు. కానీ అది తప్పు. అమ్మగా మీ పనులు మీరు పద్దతిగా చేస్తున్నారు కదా ఇంకా దిగులెందుకు. పక్క ఇంటి వారు ఎదో చేశారని మీరు అదే కావాలి అని అనుకోకండి.  ఇతరులతో పోల్చుకోకండి. మీ జీవితం మీది, వారి జీవితం వాళ్ళది. పోల్చుకోవడం మొదలు పెడితే సంతోషం అనేది దూరం అయిపోతుంది.

3. మీ స్నేహితులతో మళ్ళీ స్నేహం చేయండి

అమ్మ అయినంత మాత్రాన మీ స్నేహితులకు దూరంగా ఉండాలి అని ఏమి లేదు. మీ స్నేహితురాళ్ళకి తరచూ ఫోన్ చేయండి, కుదిరితే కలవండి. వాళ్ళతో సపరేటుగా సమయం గడపడం కష్టమవుతుంది కాబట్టి మీ రోజు వారి పనుల్లో భాగస్వామ్యం చేయండి. కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్ళండి, ఆదివారాలు వాళ్ళ పిల్లలతో మీ ఇంటికి రమ్మని చెప్పండి, లేదా మీరు వారింటికి వెళ్ళండి. ఎలాగోలా మీ సన్నాహం మాత్రం కొనసాగించండి.

4. మీ ఇష్టాలని వీడకండి, మీ లక్షల కోసం ప్రయత్నించండి 

మీకు పెయింటింగ్ అంటే ఇష్టమా? పాటలు పాడటం? ముందుకెళ్ళండి. అమ్మ అయినంత మాత్రాన మీ లక్షలను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా మేరీ కామ్ కి తల్లి అయినా తరువాతనే ఎక్కువ మెడల్స్ వచ్చాయి. మీ లక్షాన్ని ఆపేశక్తి ఎవరికీ లేదు.

జీవిత పరమార్థమే సంతోషం. అది మీ పిల్లల భవిష్యత్తులో వెత్తుకోండి. మీ భర్త ప్రేమలో పొందండి. మీ నచ్చిన పని చేయడంలో వెత్తుకోండి. మీరు ఎల్లపుడు సంతోషాంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాము.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon