Link copied!
Sign in / Sign up
5
Shares

అమ్మ కంటే గొప్ప వారు ఎవరూ లేరు అనడానికి 6 కారణాలు

అమ్మ నవ మాసాలు బిడ్డను మోసి, ఎన్నో కష్టాలు, నొప్పులను కూడా లెక్క చేయకుండా తన బిడ్డకు ప్రాణం పోస్తుంది. బిడ్డకు ఎటు వంటి కష్టం కలగకుండా పెంచుతుంది, పైకి ఎదిగేలా చేస్తుంది, ప్రయోజకుడిని చేస్తుంది, పడిపోతుంటే పట్టుకుంటుంది. సాధారణంగా మార్పు ఒక్కటే నిలకడగా ఉంటుందని అంటారు. కానీ, అమ్మ ప్రేమలో ఎన్నడూ మార్పు ఉండదు, బిడ్డకు బిడ్డలు పుట్టినా, తన కళ్ళకు ఇంకా చిన్న పిల్ల వాడే. తాను ఎప్పుడూ బిడ్డ ఒక్క యోగ క్షేమాలకోసం తపన పడుతూనే ఉంటుంది.

సాధారణంగా వయస్సు వచ్చిన పిల్లలు ప్రేమించిన అమ్మాయితో I love you and I Love You Forever అని ఒక ప్రామిస్ లా చెప్తారు. ఆ ప్రామిస్ ని ఎంత వరకు నిలబెట్టుకుంటారో తెలియదు కానీ, తల్లి మాత్రం బిడ్డకు అటువంటి మాట చెప్పుండకపోయుండచ్చు, కానీ తప్పకుండ నిలబెట్టుకుంటుంది.

1. అమ్మ ఒకేసారి ఎన్ని పనులైనా చేయగలదు

వాళ్ళ ఆరోగ్య విషయాలు నుండి ఇంటి పనులు దాకా అన్ని తానై చూసుకుంటుంది. ఒకే సమయంలో భర్తకు భార్యలాగా, తల్లి దండ్రులకు బిడ్డలాగా, బిడ్డకు తల్లి లాగా అందరి యోగక్షేమాలు చేసుకోగలదు.

2. పనులను కరెక్ట్ గా చేస్తుంది

ఒక్క సారి మీ అమ్మతో పాటు సూపర్ మార్కెట్కి వెళ్ళండి, తన ఒక సోప్ కొనాలన్నా ఎన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని కొంటుందో.

3. మీ కోసం ఎప్పుడూ సమయం కేటాయించగలదు

ఎంత నీరసంగా ఉన్న, ఇంట్లో 10 మంది బంధువులు ఉన్నా మీతో ఆదుకోవడానికి, కబుర్లు చెప్పడానికి తన దగ్గర ఎప్పుడూ సమయం ఉంటుంది.

4. మీకంటే తనకు ఎవ్వరూ గొప్ప కాదు

మీ అందాల కోసం తన అవసరాలను కూడా త్యాగం చేయగలడు. ఇంత గొప్పవారు ఎవరుంటారు చెప్పండి.

5. తల్లిని మించిన గురువు లేడు

తల్లి ఇచ్చిన సలహాను కంటే మంచి సలహా ఎవ్వరూ ఇవ్వలేరు. తాను చదువుకోలేదేమో కానీ, మీకు ఎటువంటి సమస్య వచ్చినా తన దగ్గర సలహా ఉంటుంది. సమస్య నుండి బయట పడేస్తుంది.

6. అమ్మే మనకు ఆదర్శం, దైవం

వారలు ఇచ్చేవాడే దేవుడైతే, అమ్మ అడగకుండానే ఎన్ని వరాలు ఇచ్చిందో ఆలోచించండి.

ఇవి కొన్ని కారణాలు మాత్రమే, రాస్తూ ఉంటె పేపర్లు అయిపోతాయేమో కానీ, తల్లి గొప్పదనం గురించి తెలియచేయడానికి మాటలు తక్కువ అవ్వవు. ఇంత గొప్ప మనిషికి మీరు ఏమి చేస్తున్నారు. ఏమి చేయనక్కర్లా, ఆమె చెప్పింది వింటూ, మీకు తనంటే ఎంత ఇష్టమో తెలిసాయా చేయండి చాలు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon