Link copied!
Sign in / Sign up
1
Shares

అంబులెన్స్ రాకపోవడంతో గర్భవతి అయిన భార్యను భుజాలపై మోసుకెళ్లిన భర్త 😥😥👏

ఈ బాధాకరమైన సంఘటన చూసిన తర్వాత మనదేశంలోనే ఇలా జరుగుతుందా లేక ప్రపంచం మొత్తం ఇలాగే వ్యవహరిస్తున్నారా..! అనే బాధ ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీరులా, మనస్సులోని బాధ బయటకు వస్తోంది. నిండు గర్భవతి అనారోగ్యంతో బాధపడుతోందని ఓ పేదవాడు అంబులెన్స్ కు ఫోన్ చేసినా కూడా రాకపోవడంతో తన భుజాలపై భార్యను మోసుకెళ్లిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది.

ఫోన్ చేసినా కూడా రాలేదని…

ఈ బాధాకరమైన సంఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో గల కోసోహరి ఖోల్లా అనే గ్రామంలో కొన్ని రోజుల క్రితం జరిగింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇతని భార్య గర్భవతి. ఆమె కడుపులో నొప్పిగా ఉందని, నొప్పి తట్టుకోలేకపోతున్నానని చెప్పడంతో వెంటనే 108, 102 నెంబర్లకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఫోన్ చేసి దాదాపు గంట అయినా అంబులెన్స్ రాకపోవడంతో తన భుజాలపై ఇదిగో ఇలా మోసుకెళ్తున్నాడు. ఇది చూసిన వారు ఆ ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఒక కి.మీ అంబులెన్స్ వచ్చింది

గంటసేపు ఎదురుచూసినా అంబులెన్స్ రాకపోవడంతో తన భుజాలపై భార్యను మోసుకువెళ్తున్న ఘటనను చూస్తున్న వారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఐతే ఒక కిమీ వరకు నడిచిన తర్వాత అంబులెన్స్ రావడంతో ఆ వాహనంలో ఆమెను తీసుకెళ్లారు. అదృష్టం బాగుండటం వలన త్వరగా హాస్పిటల్ చేరుకున్నారు. ఇక్కడ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు, కానీ కొన్ని సంవత్సరాల నుండి మన రాజకీయ నాయకులు చేస్తున్న వాగ్ధానాలు చేస్తున్నారు, మార్పు మాత్రం రావటం లేదు.

దయచేసి ఇది ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి పొలిటికల్ పార్టీకి తెలిసేలా SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon