Link copied!
Sign in / Sign up
0
Shares

అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలోనే బిడ్డకు జన్మను ఇచ్చిన తల్లి 😱😱

అంబులెన్స్ రాకపోవడంతో భర్తే భార్యను భుజాన మోసుకువెళ్లిన ఘటన, నిండు గర్భిణీని బంధువులు అంబులెన్స్ ఆలస్యం కావడంతో హాస్పిటల్ కు అష్టకష్టాలు పడి తీసుకువెళ్లిన మరో ఘటన.. ఇలా రోజుకి మనం చాలానే వింటున్నాం. వీటన్నిటిలో ప్రధాన సమస్య ఏంటంటే అంబులెన్స్ లు సరైన సమయానికి అందుబాటులో లేకపోవడమే. సరైన సమయానికి అనే దానికన్నా తక్కువలో ఉన్నాయనే చెప్పాలి. చూడండి ఇక్కడ ఓ నిండు గర్భిణీ అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో హాస్పిటల్ కు బయలుదేరగా హాస్పిటల్ గేట్ ముందు డెలివరీ అయ్యింది..

అసలేం జరిగిందంటే..

ఈమె చెబుతున్న ప్రకారం నెలలు నిండిన గర్భిణికి నొప్పులు రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేశారట. ఒక గంట తర్వాత వస్తామని చెప్పారట. ఆలస్యం అవుతుందని భావించి, ఊర్లో ఆటోను తీసుకుని హాస్పిటల్ కు బయలుదేరారు. అలా ఆటోలో వచ్చి హాస్పిటల్ గేట్ ముందర బిడ్డకు జన్మను ఇచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అంబులెన్స్ సరైన సమయానికి రాకపోవడం మరియు కావలసినన్ని అంబులెన్స్ లు లేకపోవడం. ఇక్కడంటే హాస్పిటల్ గేట్ ముందు డెలివరీ జరిగింది కాబట్టి, ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అదే మరెక్కడో సదుపాయాలు, సౌకర్యాలు సరిగ్గా లేని చోట జరిగి ఉంటే పరిస్థితి  ఏంటని ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగినా, ప్రతి రాష్ట్రంలోనూ ఇటువంటి పరిస్థితే ఎదురవుతోంది. అందుకని ప్రభుత్వాలు అంబులెన్స్ ల పట్ల కాస్త జాగ్రత్తగా ఆలోచించి, ప్రజల ప్రాణాల పట్ల బాధ్యతగా ఉంటే బాగుటుందని కోరుకుంటున్నారు. మరి మీరేమంటారు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon