Link copied!
Sign in / Sign up
0
Shares

అంబులెన్స్ రాకపోవడంతో 20 కి.మీ నడిచిన గర్భిణీ : కాన్పు అయి ప్రాణాలు విడిచిన చిన్నారి

సమయానికి ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వాలు, హాస్పిటల్ సిబ్బందులు తీసుకున్న గొప్ప నిర్ణయాలలో అంబులెన్స్ సేవలు ఒకటి. అయితే, ఇక్కడ గర్భంతో ఉన్న మహిళకు నొప్పులు వస్తున్నాయని త్వరగా రావాలని ఫోన్ చేశారు ప్రెగ్నన్ట్ మహిళ కుటుంబ సభ్యులు. రెండు గంటలైనా సరే అంబులెన్స్ రాకపోవడంతో దాదాపు 20 కి.మీ నడిచివెళ్ళింది. నడిరోడ్డులోని బిడ్డకు జన్మను ఇచ్చింది, కానీ దురదృష్టవశాత్తు బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. మరి ఇందులో తప్పెవరిది? ఎవరిని ప్రశ్నించాలి..?

20 కి.మీ నడిచిన గర్భిణీ మహిళ

నిజంగా వినడానికి, చదవడానికే మనస్సుకు బాధగా ఉంది కదూ. ఒకటి కాదు, రెండు కాదు దాదాపు 20 కి.మీ కాలినడకన తన ప్రాణాలు, బిడ్డ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడిచింది. మధ్యప్రదేశ్ లోని కితానిజిల్లాలో గల బర్మాని గ్రామంలో బీనా అనే మహిళ గర్భవతి. కడుపునొప్పిగా ఉండి, నొప్పులు రావడంతో బర్హి అనే టౌన్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఫోన్ చేసి అర్జెంట్ గా అంబులెన్స్ ఇక్కడికి రావాలని కోరారు. ఐతే ఫోన్ చేసి రెండు గంటలైనా సరే అంబులెన్స్ రాకపోవడంతో దాదాపు 20 కి.మీ పాటు బిడ్డను కాపాడుకోవడానికి నడిచి వెళ్లారు.

తల్లి గర్భం నుండి జారిపడ్డ బిడ్డ

అంబులెన్స్ రాకపోవడంతో 20 కి.మీ నడవగా మార్గమధ్యంలోనే బర్హి టౌన్ కు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో నిండు గర్భిణీ మహిళ నుండి బిడ్డ కిందకు జారి నేలపై పడింది. ఒకవైపు రక్తస్రావం కారుతుంటే. ఆ రక్తస్రావం మధ్యలో నుండి బిడ్డ కిందకు వచ్చింది. కానీ, బాధాకర విషయం ఏమిటంటే ఆ పాప ప్రాణాలు విడిచింది. అదే సరైన సమయానికి అంబులెన్స్ వచ్చి ఉంటే వారి కుటుంబంలో సంతోషాలు విరాజిల్లేవి.

హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే..

నిండు గర్భిణీ ప్రసవ నొప్పులతో ఇబ్బంది పడుతోంది అని ఫోన్ చేసినా మీరు ఎందుకు అంబులెన్స్ ను పంపించలేదు అని హాస్పిటల్ అధికారులను ప్రశ్నించగా, ఆమె 7 నెలల గర్భవతి, బిడ్డ ముందుగానే జన్మించడం వలన బ్రతికే అవకాశాలు లేవు. మీ గ్రామానికి ఇక్కడి నుండి అంబులెన్స్ సౌకర్యం లేదు, మీ గ్రామం మా పరిధిలోకి రాదు, అయినా ఆ సమయంలో మా దగ్గర అంబులెన్స్ లేదు అని సమాధానం ఇచ్చారు.

హాస్పిటల్ లో అంబులెన్స్ లేవని వీరిని నిందించాలా, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలా? ఎవరు ఎన్ని చేసినా, సమర్ధించుకున్నా కూడా ఆ పాప ప్రాణాలను ఎవరూ తీసుకురాలేదు కదా..  ప్రభుత్వానికి, అందరికీ ఈ విషయం తెలిసేలా SHARE చేయండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon