Link copied!
Sign in / Sign up
121
Shares

అల్లం టీతో బరువు సులువుగా ఎలా తగ్గవచ్చో చూడండి..

మనకు ప్రకృతి ఉచితంగా ప్రసాదించిన సహజసిద్ధమైన ఆహారాలలో అల్లం ఒకటి. దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లోనూ అల్లం ఉండే ఉంటుంది. మసాలా వంటలు చేసుకున్నవారే అల్లం ఉపయోగించుకోవాలనుకోవడం పొరపాటు. అల్లం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఇలా తప్పకుండా చేస్తారు. అలాగే అల్లంటీ తో సులువుగా బరువు ఎలా తగ్గవచ్చో ఇక్కడ వివరంగా చూడండి..

1.అల్లం టీ తయారు చేయడం ఎలా?

2.అల్లం ఆరోగ్య ప్రయోజనాలు 

3. అల్లం టీతో బరువు ఎలా తగ్గుతారు?

4.పిల్లల బరువును పెంచే ఆహారాలు 

బరువు పెరగడం అనేది కొందరికి చాలా ఈజీ, మరికొందరికి చాలా కష్టం. కానీ బరువు తగ్గడం అనేది అందరికీ చాలా ఇబ్బందికరమైన సమస్య. సరైన డైట్ పాటించాలి, వ్యాయామాలు చేయాలి, ఎంత ఇష్టమైన ఆహారమైనా సరే తినకుండా కంట్రోల్ లో ఉండాలి. ఇలాంటివి చాలానే బరువు తగ్గడానికి చేయవలసి ఉంటుంది. అయితే ఇవేమీ అవసరం లేకుండా సులువుగా బరువును, చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసే చిట్కాలు మీకోసం...

1.అల్లం టీ తయారు చేయడం ఎలా?

అల్లం టీ తయారు చేసుకోవడం చాలా సులభం. ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని పైన ఉన్నటువంటి పొట్టును తీసుకోవాలి. అల్లం పై పొట్టు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక గ్లాస్ నీటిని తీసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఇలా నీరు బాగా కాగుతున్నప్పుడే అందులో అల్లం ముక్కలను వేసి వేడి చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత కిందకు దించుకుని గోరు వెచ్చగా ఉండేలా చల్లార్చుకోవాలి. తాగేముందు ఒక స్పూపఁ తేనె కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కాస్త నిమ్మరసం కలిపి సేవించకోవడం మరీ మంచిది. మీ శరీరాన్ని ఉక్కులా మార్చే అల్లం టీ గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.. 

2.అల్లం ఆరోగ్య ప్రయోజనాలు 

మనకు ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన వాటిలో అల్లం ఒకటిగా ఇదివరకే చెప్పుకున్నాం. అయితే అల్లం మన ఆరోగ్యాన్ని ఎన్ని విధాలుగా కాపాడుతుందో ఇక్కడ చూడండి..

- జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది

- నోటి దుర్వాసన, దంతాల సమస్య ఉండదు 

- వాంతులు, వికారం లేకుండా ఉపయోగపడుతుంది 

- జలుబు, దగ్గు, అజీర్తి సమస్యలకు మంచి ఉపశమనం 

- మోకాళ్ళు, కీళ్ల నొప్పులు రాకుండా కాపాడుతుంది

అలాగే మీకు కొత్త రకాలు వంటలు చేయడం అంటే చాలా ఇష్టమా..! అయితే మీ ఆరోగ్యానికి మేలు చేసే అల్లం పచ్చడిని 5 నిముషాలలో ఎలా చేసుకోచ్చో ఇది క్లిక్ చేసి వివరంగా తెలుసుకోండి.  

3.అల్లం టీతో బరువు ఎలా తగ్గుతారు?

మీరు ఇప్పటివరకు బరువును, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆయుర్వేద చిట్కాలు, ఇంట్లో తయారు చేసుకునే సహజ సిద్ధమైన హోమ్ రెమెడీస్, ఇంకా ఎన్నో మందులను ప్రయత్నించి చూసి ఉండవచ్చు. అయితే మనకు ఎటువంటి ఖర్చు లేకుండా లభించే అల్లం టీతో సులువుగా ఎలా బరువు తగ్గవచ్చో ఇక్కడ తెలుసుకోండి. పైన చెప్పుకున్నట్లు అల్లం టీని తయారు చేసుకుని అందులో తేనె గానీ, నిమ్మరసం గానీ కలుపుకుని ప్రతి రోజూ ఉదయం నోటిని శుభ్రం చేసుకున్న తర్వాత సేవించడం వలన అధిక బరువు ఉండేవారికి సులువుగా బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేయడానికి అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది కూడా. అలాగే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులువుగా బరువును తగ్గించుకునే మరికొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి..

బరువు తగ్గాలంటే ముందుగా సరైన డైట్ పాటించడం చాలా ముఖ్యం. అలాగే తీసుకునే ఆహారం, పనిచేసే విధానం, సరైన నిద్ర మరియు విశ్రాంతి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఇలా అన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం వలన మీ బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. అయితే చాలామంది అనుకున్నట్లు అధిక బరువు ఉన్నవారు సులువుగా బరువు తగ్గడం అనేది అంత ఈజీ పని కాదని అంటుంటారు. అలా అనుకోవడం పొరపాటు. ఎలాంటి వారైనా సరే సులువుగా బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

4.మీ పిల్లలు బరువు పెరగడం లేదా..!

అమ్మనాన్నలను కంగారుపెడుతూ, బాధపెట్టే విషయాలలో పిల్లలు త్వరగా బరువు పెరగకపోవడం ఒకటి. పాలు తాగుతున్నా, ఆరోగ్యంగా ఉన్నా కూడా బరువు మాత్రం ఎప్పటిలాగానే ఉంటారు. ఇది ప్రతి అమ్మనాన్నకు పిల్లల విషయంలో కంగారుపెట్టే విషయమే కదా. అందుకని కొన్ని సహజ చిట్కాలను ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం తెలుసుకుని, పిల్లలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించకుండా పిల్లలకు పౌష్టికరమైన ఆహారాన్ని పిండి రూపంలో సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో వివరంగా చెప్పడం జరిగింది. అదెలాగో ఇక్కడ చూడండి. మీ పిల్లల బరువును సులభంగా పెంచే అద్భుతమైన ఆహారం ఇదే..

అల్లం టీ ఎలా తయారు చేసుకోవాలి, అల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అల్లంతో సులువుగా ఎలా బరువు తగ్గవచ్చో మరియు పిల్లల బరువును ఎలా పెంచుకోవచ్చో. ఈ విషయాలు మీకు నచ్చి ఉంటే అందరికీ షేర్ చేయండి మరియు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon