Link copied!
Sign in / Sign up
21
Shares

అల్లం పచ్చడిని 5 నిముషాలలో తయారుచేసుకునే సులువైన పధ్ధతి ఎలాగో తెలుసుకోండి..

తెలుగువారికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఏ కూర లేకపోయినా సరే పచ్చడి, నెయ్యి ఉంటే చాలు సంతృప్తికరమైన భోజనం చేసేస్తారు. అలా మన తెలుగువారికి బాగా ఇష్టమైన వంటకాలలో ‘అల్లం పచ్చడి’ ఒకటి. ఈ అల్లం పచ్చడిని సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో చూడండి. అల్లం పచ్చడి తయారీ విధానం మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి.

అల్లం పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు :

అల్లం - 50 గ్రాములు

ఎండుమిర్చి -10

వెల్లుల్లి - 3 రిబ్బలు

మినపప్పు - 2 స్పూన్లు

చింతపండు - 50 గ్రాములు

ఆవాలు - ఒక స్పూన్

మెంతులు - ఒక స్పూన్ లో 4 వ వంతు

జీలకర్ర - ఒక స్పూన్

శెనగపప్పు - 2 స్పూన్లు

కరివేపాకు - 4 లేదా 5 ఆకులు

ఉప్పు - రుచికోసం సరిపడా

నూనె- అర కప్పు

అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..?

*ముందుగా అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. బాణలి తీసుకుని అందులో కొంచెం నూనె వేసి అల్లం ముక్కలు కొద్దిసేపు వేగనివ్వాలి.

*చింతపండును నీటితో కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అలాగే బెల్లంను ఒక కూడా ఒక చిన్న గిన్నెలో నీరు పోసి నానబెట్టాలి.

*ఎండుమిర్చిలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో కొద్దిసేపు వేయించాలి.

*ఇప్పుడు అల్లం ముక్కలు, ఎండుమిర్చి, నానబెట్టిన బెల్లం, చింతపండు, ఉప్పు అన్నిటినీ తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా అయిన ఈ పచ్చడిని గిన్నెలోకి వేసుకోవాలి.

*ఇక ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రిబ్బలను బాణాలిలో వేసి అందులో కాస్త నూనె పోసి వేయించాలి. కిందకు దించే సమయంలో 5 కరివేపాకులు వేస్తే సువాసన మరియు ఘుమఘమలుగా ఉంటుంది.

*పక్కన పెట్టిన పచ్చడిలో మినపప్పు, నూనెలో వేసి వేయించిన ఆవాలు, మెంతుల మిశ్రమాన్ని అందులో కలిపాలి. దీంతో మీరు మెచ్చిన అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్లు.

అల్లం పచ్చడిని ఎలా ఉపయోగించాలి..?

అల్లం పచ్చడిని ఎక్కువగా దోస, ఇడ్లీలు తినేటప్పుడు వేసుకుంటూ ఉంటారు. దీనిని అన్నంతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంట్లో వడలు, బొండాలు చేసుకున్నప్పుడు కూడా అల్లంపచ్చడి బాగానే ఉంటుంది. సో, చూశారుగా అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో.. అందరికీ SHARE చేయడం మర్చిపోకండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon