Link copied!
Sign in / Sign up
2
Shares

ఈ రోజు ‘’అక్షయ తృతీయ’’ : ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి..

అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన రోజు అని అంటారు. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది, క్షయం లేనిది అని అర్థం. అయితే చాలామంది ఈ పవిత్రమైన రోజున కొంచెం బంగారం అయినా సరే కొనాలని అనుకుంటూ ఉంటారు. ఈ రోజు పసిడి ఇంట్లోకి తెచ్చుకోవడం వలన ఇల్లు ఎప్పటికీ సిరిసంపదలతో వెలిగిపోతుందని చెబుతున్నారు కొందరు. నిజానికి ఇలా ఏమీ చేయక్కర్లేదట. అసలు ఈ రోజు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుందాం..

అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి..!!

1. అక్షయ త్రితీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుని లక్ష్మీదేవి, విష్ణువుకు లేదా ఇంట్లో పూజగదిలో పూజ చేసుకోవాలి.

2. ఈ రోజున కుండ దానం, భోజనం, ధన సహాయం, బట్టలు, చెప్పులు, ఉదక భాండం, దాహం, స్వయం పాకం వంటివి దానం చేయాలి.

3. భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేయవచ్చు.

4. మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి భోజనం పెట్టి, ఆకు వక్క, కుంకుమ ఇవ్వవచ్చు.

5. ఈ దానాలు చేసి ఉపవాసం చేయడం వలన నరక బాధలు ఉండవు, వంశ అభివృద్ధి జరుగుతుంది, పాపాలు తొలగిపోయి మీ జీవితం సంతోషమయంగా ఉంటుంది.

అక్షయ తృతీయ ఏం చేయకూడదు..??

1. నిజానికి ఈ రోజున బంగారం, వెండి కొనాలని ఎక్కడా తెలుపలేదు. ఏ పురాణాలు, వేద పండితులు, పూజారులు చెప్పలేదు. కొందరు వ్యాపారులు ఈ విధంగా తమ వ్యాపార వృద్ధి కోసం చేస్తున్నారు.

2. బంగారం, వెండి అప్పు చేసి కొనటం వలన అక్షయం తరగటం కాదు అప్పు పెరుగుతుంది. కాబట్టి అప్పు చేసి మాత్రం అస్సలు కొనకండి. మీ ఇంట్లో బంగారం అవసరం అనుకుంటే కొనండి.

3. పవిత్రమైన ఈ రోజున పాపకార్యాలు అస్సలు చేయకూడదు, అబద్ధాలు అస్సలు ఆడరాదు.

4. గొడవలకు దూరంగా ఉండాలి, ఒకరిపై మరొకరు ద్వేషం చూపించకూడదు.

అక్షయ తృతీయ మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండండి. పైన చెప్పుకున్న విషయాలు నిజమే ఐతే అందరికీ వెంటనే SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon