Link copied!
Sign in / Sign up
9
Shares

అద్భుతమైన మరియు అర్ధవంతమైన 10 పిల్లల పేర్లు


పిల్లలు పుట్టిన ఎంతో ఆనందమైన సమయంలో వారికి పేరు పెట్టడం అనేది మరింత ఉత్సాహంగా చేసే పని. కానీ ఎలాంటి పేరు పెట్టాలి? కొన్ని వందల పేర్లు మన మనస్సులో మెదులుతాయి. కానీ ఒక్కటి కూడా పెట్టాలనిపించదు. ఇంకా మంచి పేరు ఇంకా మంచి పేరు కావలి అని ఆలోచిస్తూనే ఉంటాము. మీకోసమే 10 అద్భుతమైన మరియు అర్థవంతమైన పేర్లు కింద వివరించాము. ఇవి కొత్తగా ఉండడమే కాకుండా పది మందిలో ఉన్నపుడు మీ పిల్లలను ప్రత్యేకంగా నిలబెడతాయి.

10 అందమైన పేర్లు మరియు వాటి అర్థాలు

1. కియాన్

కియాన్ అనేది హిందూ పేరు, ఇది కొత్తగా మరియు స్టైల్ గా ఉంటుంది. కియాన్ అంటే అర్థం దేవుడిచే ఎంచుకోబడ్డవాడు లేదా దేవుడి కృప పొందినవాడు అని అర్థం.

2. సమైరా

సమైరా అనేది చాలా సులువుగా, అందంగా ఉండే అమ్మాయి పేరు. దీని అర్థం మంత్రముగ్దులను చేయగల వారు అని అర్థం.

3. అథర్వ్

ఈ పేరుని చాలా మంది వారి పిల్లలకు పెట్టుకుంటున్నారు. దీనిలో ఉండే హుందాతనమే ఈ పేరుని ప్రాచుర్యం చేస్తోంది. అంతే కాకుండా అథర్వ్ అంటే గణపతి దేవునికి మరో పేరు కావడంతో తల్లితండ్రులు ఎంతో ఇష్టంగా వారి పిల్లలకు ఈ పేరుని పెట్టుకుంటున్నారు.

4. విహాన్

విహాన్ అంటే సూర్యుని మొదటి కిరణాలూ అని అర్థం. ఈ పేరుని కూడా ఈ మధ్య చాలా మంది వారి పిల్లలకు పెట్టుకుంటున్నారు. ఆధునిక రోజుల్లో ఎలాంటి పేరు పిల్లలకు మంచి గుర్తింపు తెస్తుందని వారి నమ్మకం.

5. అయేషా

సాధారణంగా ఈ పేరుని ముస్లిమ్స్ వారి పాపకి పెట్టుకుంటారు. అరబిక్ లో అయేషా అంటే స్త్రీతత్త్వం అని అర్థం. అంతే కాకుండా ప్రోఫెట్ మహమ్మద్కి ఇష్టమైన భార్య పేరు కూడా అయేషా అని అంటారు.

6. సారా

సాధారణంగా ఈ పేరుని క్రిస్టియన్స్ పెట్టుకుంటారు. ఇస్సాక్ అమ్మగారి పేరు సారా అని బిల్ చెప్తుంది. అంతే కాకుండా సారా అంటే యువరాణి అని అర్థం.

7. నీల్

నీల్ అంటే ఛాంపియన్ లేదా ప్యాషనేట్ అని అర్థం. నీల్ అనే పేరు కూడా ఈ మధ్యకాలంలో అందరు ఇష్టపడుతున్నారు.

8. జియా

జియా అంటే మంచి మనస్సు కల్గిన అని అర్థం. ఈ పేరు పిలిచాడు సులువుగా వినడానికి శ్రావ్యంగా ఉండడం తో ఎక్కువ మంది దీనిని ఇష్టపడుతున్నారు.

9. సమర్థ్

ఏమైనా చేయగలవాడు, కష్టాన్ని కూడా సులువుగా అధిగమించేవాడు, సమర్థవంతుడు అనేవి ఈ పేరుకి అనేక అర్థాలు.

10. శనాయ

ఈ పేరు విహాన్ అనే పేరుకి స్త్రీలింగ పేరు అనుకోవచ్చు. విహాన్ మరియు శనాయ అనే పేర్లు ఒక అర్థంతో ఉండడం వలన అన్న చెల్లెలు ఎలాంటి పేర్లు ఉంటె బాగుంటుందని చాలా మంది వారి పిల్లలకు పెట్టుకుంటున్నారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon