Link copied!
Sign in / Sign up
7
Shares

ఆడవాళ్ళకు పుట్టినిళ్ళంటే ఎందుకంత ప్రేమ : ఇవే 7 కారణాలు


పెళ్ళి అవడం చాలా సంతోషకరమైన విషయం. అందులోనూ మీకు నచ్చిన వ్యక్తితో పెళ్ళి అవడం ఇంకా సంతోషించాల్సిన విషయం. అయితే మీరు మీకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉన్నా కూడా మీ అమ్మతో కలిసి ఉండిన క్షణాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే, మీరు మీ పుట్టింట్లోనే చాలా సౌకర్యంగా ఉండి ఉంటారు. అలాంటి సంధర్భాలు ఏవంటే,

ఇష్టమైన ఆహారం

మీరు ఎప్పుడైనా మీకు ఇష్టమైన ఆహారం తినాలని అనుకున్నారనుకో, అప్పుడు మీరే వండుకోవాలి మీరే తినాలి కానీ మీరు మీఇంట్లో ఉంటే మీఅమ్మ మీకు అన్నీ స్వయంగా వండి పెట్టి మీ ఆకలిని తీరుస్తుంది.

నిద్ర లేపడం

మీరు మీ పుట్టింట్లో ఉన్నప్పుడు మీ అమ్మ రోజూ మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తూ ఉండేది. మీ అమ్మ అరుపు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మీరు అలాగే పడుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని లేపడానికి ఎవరూ లేరు, మీ అంతకు మీరే లేచి అన్ని పనులు చేసుకోవాలి.

చాయ్ టైమ్

మీరు ఇప్పుడు మీ భర్తతోనో, కుటుంభంతోనో టీ తాగుతూ గడిపినా మీకు మునుపటి ఫీలింగ్ రాదు. ఇంతకు మునుపు మీరు మీ అమ్మతో కలిసి అన్ని విషయాలు షేర్ చేసుకొనేటప్పుడు మీకు ఎంతో హాయిగా ఉండేది కానీ ఇప్పుడు మీరు మీ అమ్మను మిస్ అవుతున్నారు.

ఆహారం

మీరు ఎంత శ్రద్ధగా వంట చేసినా మీ అమ్మ చేసినంత రుచికరంగా రాదు. అమ్మ ఎంత తొందరగా చేసినా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాంటి సమయాలలో మీ అమ్మ వంట మీకు గుర్తుకు వస్తూ ఉంటుంది.

ఆరోగ్యం బాగా లేనప్పుడు

అమ్మ పెద్దగా చదువుకొని ఉండదు కానీ వైద్యుని కన్నా మెరుగ్గా, తొందరగా మీ అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. ఎప్పుడు ఏమి తినాలి, ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలి అన్నవిషయాలు అమ్మ ఎప్పుడూ మర్చిపోకుండా మీకు అందిస్తుంది. మీరు పెళ్ళి అయిన తర్వాత అనారోగ్యం పాలైతే మీ అమ్మ తప్పకుండా గుర్తుకు వస్తుంది.

ఎక్కడ ఏవి ఉండాలో

మీ పుట్టింట్లో ఎక్కడ ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువు ఉంటుంది. చిన్న పేపర్ కూడా ఎక్కడంటే అక్కడ పడి ఉండదు. చాలా శుభ్రంగా, అందంగా ఇల్లు ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటిని కూడా మీరు అలా చేయాలని చాలా సార్లు అనుకొని ఉంటారు కానీ అది సాధ్యం కాక చాలా సార్లు మీ అమ్మను మీ మనసులోనే పొగిడి ఉంటారు.

మీ అమ్మ మీతో ఉండాలని

మీరు మీ అమ్మతో ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడినా మీ అమ్మ మీతో ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. అంతేకాక, అమ్మ ఫోన్‌లో మాట్లాడుతూ ఏమి చేస్తూ ఉంటుంది? ఇంట్లో ఎక్కడ కూర్చొని ఉంటుంది అన్న విషయాల గురించి మీరు ఫోన్‌లో మాట్లాడుతూ మీరు ఆలోచిస్తూ ఉంటారు.

పై అన్ని సంధర్భాలలో మీరు మీ అమ్మను మిస్ అవుతుంటారు మరియూ మీ పుట్టిల్లే చాలా సౌకర్యంగా ఉండేదని మీరు బావిస్తూ ఉంటారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon