Link copied!
Sign in / Sign up
2
Shares

ఆడ బిడ్డ మరియు మగ బిడ్డల ఎదుగుదల మధ్య 6 తేడాలు

9 నెలలు కడుపులో మోసి ప్రసవించాక అది ఆడ బిడ్డ అయినా మగ ప్రాణమ కన్నా ఎక్కువగానే చూసుకుంటాం. కానీ చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లలను ఇతురుల పిల్లలతో పోల్చుకుంటారు. అలాగే ఆడపిల్ల పుడితే మెగా బిడ్డ పుట్టివుంటే బావుండేది అనుకుంటారు. ఆడ బిడ్డ పుడితే మగ బిడ్డ పుట్టివుంటే బావుండేది అనుకుంటారు. అసలు ఆడబిడ్డకు, మగబిడ్డకు అనేక విషయాలలో ఉన్నా తేడాలేంటో ఇక్కడ చూద్దాం…

1. సామాజిక నైపుణ్యాలు

అందరితో కలిసిపోవడం, మన చెప్తున్నా లేదా చేస్తున్న విషయాలకు స్పందించడం ఇలాంటి వాటిలో ఆడ పిల్లలకే ఎక్కువ మార్కులు పడుతాయి. ఆడ పిల్లలు సామాజిక నైపుణ్యాలను త్వరగా నేర్చుకుంటారు. అధ్యయనాల ప్రకారం ఆడ పిల్లలు తమతో ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు. వారి ముఖకవళికలు గమనిస్తారు. కానీ మగ బిడ్డలు వారి చేతిలోని వస్తువులను గమనిస్తారు. ఇలా ఆడపిల్లలు,మగపిల్లల కన్నా త్వరగా సామజిక నైపుణ్యాలను నేర్చుకుంటారు.

2. వస్తువులను గుర్తుపట్టే నైపుణ్యం

పైన చెప్పిన విధంగా మగ పిల్లలలో వస్తువులను గుర్తుపట్టే నైపుణ్యం ఎక్కువగా వుంటూ ఉంటుంది. మగ పిల్లలు వస్తువులను మధ్య తేడాలను, ఒక వస్తువుకు ఇంకో వస్తువుకు మధ్య సంబంధాన్ని సులువుగా త్వరగా గుర్తించగలరు. కానీ ఆడ పిల్లలలో ఈ నైపుణ్యాలు కొంచెం తక్కువగా ఉంటాయి.

3. బొమ్మలు

ఆడ పిల్లలు బార్బీ డాల్స్, మగ పిల్లలు కార్లు, గన్నులు లాంటి బొమ్మలతో ఆడుకోడానికి ఇష్టపడుతారు అని అందరూ అనుకుంటారు. కానీ చిన్న పిల్లలకు బొమ్మల మధ్య తేడాలు తెలీవు. వారికి ఏది నచ్చితే వాటితో ఆడుకోనివ్వండి.

4. మాట్లాడడం

సాధారణంగా పిల్లలు మొదటి ఏడాది గడిచి, రెండవ ఏడాది ప్రథమార్ధంలో మాటలు నేర్చుకుంటారు. కానీ ఆడపిల్లలు మగపిల్లలకన్నా ఒక నెల ముందు మాటలు నేర్చుకుంటారు. ఏదిఏమైనా పిల్లలు మాటలు నేర్చుకోవడం అనేది, వారికి చుట్టుపక్కల పరిసరాల ప్రభావం మీద ఆధారపడివుంటుంది.

5. నడవడం

ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు 9 నుండి 11 నెలల వయసు సమయంలో నడవడానికి ప్రయత్నిస్తారు. కొంత మంది తల్లి తండ్రులు తమ మగ బిడ్డ త్వరగా నడిచాడని, ఇంకొంతమంది తమ ఆడబిడ్డ త్వరగా నడిచిందని చెప్తుంటారు. కానీ వైద్యుల ప్రకారం, నడవడంలో ఆడపిల్లకు మగపిల్లలకు మధ్య పెద్ద తేడా ఉండదని చెపుతారు.

6. కోపం

ఇది మనకు తెలిసిందే, మగ పిల్లలు కోపాన్ని త్వరగా ప్రదర్శిస్తారు. కేవలం రెండేళ్ళ వయసునుండే వీరికి కోపం వస్తుంది. దానికి కారణం వారిలోని టెస్టోస్టెరోన్ స్థాయులు అయ్యుండచ్చు. అది సహజంగా జరిగేదే. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon