Link copied!
Sign in / Sign up
1
Shares

ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని అందించే అప్పటి ఆటలు మీ పిల్లలకు నేర్పించండి

అప్పట్లో మీ చిన్నతనంలో మీరు ఆడుకున్న ఆటలు మీకు గుర్తున్నాయా..! అయితే మీ పిల్లలకు వెంటనే వాటిని నేర్పించండి. ఆ ఆటల వలన మీ పిల్లలకు ఆహ్లాదంతో పాటు మంచి ఆరోగ్యం మరియు తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే సోఫాలో కూర్చుని వీడియో గేమ్స్ ఆడటం లేదా బొమ్మల సినిమాలు, రైమ్స్ ఆటలుగా భావిస్తున్నారు. మీరు ఆడుకున్న ఆ ఆటలు మీ పిల్లలకు ఎలా ఉపయోగపడతాయో కూడా తెలుసుకోండి..

తొక్కుడు బిళ్ళ

అప్పట్లో రోడ్లపై, ఇంటి దగ్గరలో బాక్సులు గీసుకుని ఒక చిన్న రాయిని ఆ బాక్సులలో వేసి ఒంటి కాలిపై పరిగెడుతూ ఆ రాయిని తన్నుకుంటూ వెళ్లేవారు. ఇది అమ్మాయిలకు చాలా ఇష్టమైన ఆట. ఇలా ఆడటం వలన ఎంతో ఆక్టివ్ గా ఉండగలరు. ఒంటి కాలిపై ఇలా చేయడం వలన మంచి వ్యాయామంగా ఉంటుంది కూడా.

కోతి కొమ్మచ్చి

ఒక చెట్టుపై అందరూ ఉండి ఒకరు మాత్రం కింద ఉంటారు. చెట్టుపై ఉన్నవారు కిందకు దిగి, కింద ఉన్న వారు వాళ్ళను తాకితే అవుట్ అయినట్లు. ఇలా చేయడం వలన చెట్టు నుండి స్వచ్ఛమైన గాలి పిల్లలకు అందుతుంది. ప్రకృతిపై ప్రేమ, మమేకం పిల్లలకు పెరుగుతాయి.

దాగుడు మూతలు

ఒకరి కళ్ళను ఇంకొకరి చేతులతో మూసి వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి అంటూ అందరిపేర్లు చెప్పిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టే ఆట దాగుడు మూతలు దండాకోర్. ఈ ఆట ఆడటం వలన మన ఎదురుగా ఉన్నది ఎవరు అని వారి చేతి స్పర్శను తాకడం వలన ఎప్పటికీ వారిని గుర్తించుకోగలరు. అలాగే పిల్లల మెమరీ పవర్ కూడా పెరుగుతుంది.

వంగుడుదూకుడు

పిల్లలకు ఇది ఉల్లాసభరితమైన ఆటగా చెప్పుకోవచ్చు. ఒకరిని వంగమని చెప్పి మిగతా వారు అతడిపై నుండి దూరం నుండి వచ్చి దూకడం చేస్తుంటారు. ఆ తర్వాత కొద్దికొద్దిగా ఎత్తు పెంచుతూ దూకుతుంటారు. ఇలా చేయడం వలన కింద నిల్చున్న పిల్లాడికి మారికి దూకుతున్నవారికి మంచి వ్యాయామం మరియు ఎత్తు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది కూడా.

ఉయ్యాలా

గ్రామాలలో ఇప్పటికి ఈ ఆట ఆడుతూనే ఉన్నారు. ఒక చెట్టుకు ఊయల వేసి ఒకరు లేదా ఇద్దరు ఎదురెదుదుగా ఉంటే ఒకరు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం వలన మానసిక ఉల్లాసం, ఆనందం కలుగుతుంది. ఒకరితో ఒకరికి స్నేహం చిగురిస్తుంది. స్వచ్ఛమైన చెట్ల గాలిని పీలుస్తూ ప్రకృతిని  ఆనందించడం అదృష్టమే కదా.

ఏడుపెంకులు

రెండుగా జట్లు విడిపోయి ఏడు రాళ్లను ఒకచోట ఒకదానిపై ఒకటి పేర్చి బంతితో వాటిని పడగొట్టి మళ్ళీ వాటిని పెట్టేస్తే ఆ జట్టు విజయం సాధించినట్లు. ఈ ఆట ఆడటం వలన గెలవాలనే ఆకాంక్ష కలుగుతుంది మరియు ఓడిపోవడం అంటే ఏంటో కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా అష్టాచమ్మా, దొంగ పోలీసు, రాజు రాణి ఆట, కోకో, గుడుగుడు గుంజం, తాడు బొంగరం, కళ్ళ గంతలు మీ పిల్లలకు నేర్పించడం వలన వారికే ఆరోగ్యకరం మరియు ఆహ్లదకరం.

మీరు ఈ ఆటలు ఆడి ఉంటే, మీకు ఏ ఆట ఇష్టమో COMMENT చేస్తూ అందరికీ SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon