ఆడవాళ్లు భర్త నుండి కోరుకునే 5 పనులు : ఇలా మీ ఆయన చేస్తున్నాడో లేదో చూడండి
పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చిన తర్వాత ప్రతి మహిళకు ఎన్నో భయాలు మరెన్నో సందేహాలు. వీటన్నిటి దాటుకుని ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తూ అందరూ సంతోషంగా ఉండేలా చూసుకుంటుంది. అయితే భార్యగా తన భర్త నుండి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో పాటు ఈ పనులలో నాకు కాస్త సహాయంగా మా ఆయన ఉంటే బాగుండని అనుకుంటుంది. కొన్నిసార్లు బయటకు కూడా చెబుతుంది. మహిళలు తమ భర్త నుండి కోరుకునే పనులేమిటి? ఇవన్నీ మీ ఆయన మీకు చేస్తున్నారో లేదో చూడండి..
పిల్లలను ఆడించడం
పిల్లలంటే ప్రతి అమ్మనాన్నలకు ఇష్టమే, కానీ ఇంటి పనులతో సతమతమవుతూ ఉన్నప్పుడు ఒకవైపు పిల్లలు ఏడుస్తుంటే వారిని చూసుకోవాలా? లేక వంటింట్లో పనులు చేయాలా? అని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటప్పుడు భర్త ఎంత బిజీగా ఉన్నా, ఆఫీస్ నుండి అప్పుడే వచ్చినా సరే పిల్లలను ఎత్తుకుని అటూఇటూ తిప్పడం, ముద్దుగా ఆడిస్తూ ఏడవకుండా చేయడాన్ని తల్లి అయిన తర్వాత ప్రతి మహిళ కోరుకునే మొదటి విషయం. ఇలా చేస్తే భర్తపై మరింత గౌరవం పెరుగుతుంది కూడా. మరి మీ ఆయన ఇలా మీకు సహాయం చేస్తున్నారా..!!
ఐ లవ్యూ అని చెప్పడం
మహిళలకు నగలు కావాలి, చీరలు కావాలి, పెద్ద పెద్ద ఇల్లు కావాలని ప్రతి ఒక్కరూ చాలా పొరపాటు. భర్త నుండి ప్రతి క్షణం ప్రేమను కోరుకుంటారు, భర్త నుండి పొగడ్తలను ఆశిస్తారు. పెళ్లి అయిన మొదట్లో మాత్రమే కాదు ప్రతి రోజూ ఐ లవ్యూ, నువ్వే నా సర్వస్వం, నువ్వు ఈ రోజు చాలా అందంగా ఉన్నావు అంటూ ప్ర్రేమగా చెప్పడం వలన చాలా సంతోషిస్తారు. ఈ విషయాలు భార్యగా వాళ్ళు కోరుకోవడంలో తప్పేమీ లేదు, వీటిని గ్రహించకపోవడం చెప్పకపోవడం మగవారి తప్పు.
ఇంటి పనుల్లో సహాయం
భర్త బయటకు వెళ్ళో లేక ఆఫీస్ నుండో వచ్చి అలసిపోయుండవచ్చు, కానీ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏం కావాలో దగ్గరుండి మరీ చూసుకుని వారి ఆనందానికి కారణమవుతుంది. అంత కష్టపడుతున్నా కూడా నాకు సహాయం చేయండని భర్తను అడగదు. అలా అడగనప్పుడే భర్తే వెళ్లి నువ్వు తప్పుకో నేను చేస్తాను, కాసేపు నువ్వు కూర్చో నేను చూసుకుంటాను, ఏమైనా తిన్నావా లేదా..అని సున్నితంగా అడుగుతూ వారికి సహాయం చేయడం వలన నాకు మీరు భర్తగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను అనే ఫీలింగ్ వారికి కలుగుతుంది. ఇంతకు మించిన సంతోషాన్ని వారు కోరుకోరు కూడా. మరి మీ భర్త మీ ఇంటి పనుల్లో సహాయం చేస్తారా..!
బయటకు తీసుకెళ్లడం
ఎప్పుడు ఇంట్లోనే ఉండి బోర్ గా ఫీలవుతూ ఉంటారు మహిళలు. చూస్తే టీవీలో వచ్చే సీరియల్స్ చూడాలి, పిల్లలను ఆడించాలి, పెద్దవాళ్లకు కావాల్సిన పనులు చేయాలి, కరెక్ట్ టైంకు వంట చేయాలి. ఇదే నా ప్రతిరోజూ అని ఎంత చేసినా కూడా మళ్ళీ చేస్తూనే ఉంటారు. అందుకని వారికి కాస్త రిలీఫ్ ఇచ్చే విధంగా సినిమా, పార్క్, విహారయాత్రలు, గుడి, ఇష్టమైన ప్రదేశాలు, ఇష్టమైన ఫుడ్ తినిపించడం, బంధువులు లేదా స్నేహితుల ఇంటికి కనీసం వారానికి లేదా నెలకు ఒక్కసారి తీసుకెళ్తూ ఉండాలి. ఇలా మీ భర్త మీ సంతోషం కోసం బయటకు తీసుకెళ్తూ ఉంటారా..
ఏం కావాలో అడగటం
భర్త భార్యకు చేసే అతి పెద్ద పని, అతి పెద్ద సహాయం ఆమెకు ఏం కావాలో అడగటం. అవును చాలామంది తమ భార్యతో మనసువిప్పి మాట్లాడటం చేయకుండా ఉండటం వలన ఒకరి మధ్య ఒకరికి దూరం పెరుగుతోంది. అందుకని భార్యకు ఉద్యోగం చేయాలని ఉందేమో అడగటం, ఆరోగ్యం సరిగ్గా ఉందేమో అని పట్టించుకోవడం, సంతోషంగా ఉన్నావా లేదా, నీకు ఏదైనా కావాలనుకుంటే భయపడకుండా నాతో చెప్పు అని సున్నితంగా చెప్పడం వంటి విషయాలను భర్త అడుగుతే బాగుండు అని ప్రతి భార్య తన భర్త నుండి కోరుకుంటుంది. మరి మీ ఆయన ఇలా మీకు ఏం కావాలో అడుగుతుంటారా..!
ఇలా భార్యలకు భర్తలు ఈ పనులు చేయడం దాంపత్య జీవితం, ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరుగుతుందని చెప్పడానికే ఇదంతా.. మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి..
Image Source : wallpaper Better
