Link copied!
Sign in / Sign up
7
Shares

ఆడపిల్లలు తప్పక మాట్లాడాల్సిన 5 మాటలు

మాకు అబ్బాయా పుట్టిన, అమ్మాయి పుట్టినా ఒకటే, ఒకేలా చూసుకుంటాం.  అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు, కానీ అమ్మాయి పుట్టి పెద్ద అయిన తర్వాత అది చేయకూడదు, ఇలానే చేయాలి అనే రూల్స్ పెడుతూ ఉంటారు. నిజానికి ఆడపిల్ల పుట్టగానే లక్ష్మిదేవి పుట్టిందని ఎంతగా ఐతే సంతోషిస్తారో లోపల కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు కూడా. ప్రేమను పంచుతూ, ఆప్యాయతను చూపిస్తూ, తల్లితండ్రులు చెప్పే మాటలు వింటూ గౌరవిస్తుంది. మరి అలాంటి ఈ మాటలు తప్పకుండా తల్లితండ్రులతో చెప్పుకోవాలి. మనస్సు విప్పి మాట్లాడాలి, అవేంటో మీరే చూడండి.

నువ్వు అబ్బాయివి కాదు కదా, నీకు ఎందుకులేమ్మా..

పెద్ద చదువులు చదవడానికి, ఏదైనా ఊరికి వెళ్ళాలనప్పుడు, కావల్సినది కొనిపెట్టమని అడిగినప్పుడు నీకు ఎందుకు లేమ్మా ఆడపిల్లవు అనే మాట ఎవరైనా అంటే ఆడపిల్ల ఏం పాపం చేసింది అని తప్పకుండా అడగాలి. మేము అబ్బాయిలతో సమానమే కదా అనే మీ హక్కు వారికి తెలిసేలా చేయాలి. ఎప్పుడైతే ఈ తేడా ఉండదో అప్పుడే ఆడపిల్లలకు మీరు స్వాతంత్ర్యాన్ని ఇచ్చినట్లు.

బంధించకూడదు

మనిషిగా పుట్టిన తర్వాత ఆడ, మగ అనే లింగభేదం ఉన్నా అందరికీ కొన్ని కొన్ని కోరికలు, మంచి మంచి ఆలోచనలు,  ఇష్టాలు ఉంటాయి. ఆడపిల్లలు నా ఇష్టం ఇది అని అడిగినప్పుడు నువ్వు ఆడపిల్లవు నీ వల్ల కాదు, నీకు ఎందుకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పుడు ఒకే విధమైన డైలాగులు చెప్పి వారి కోరికలను, ఆశలను బంధించకుండా వారికి కావాల్సిన స్వేచ్ఛను ఇవ్వాలి.

ఆడపిల్లవు అని మాటిమాటికీ గుర్తు చేయకండి

ఆడపిల్లల గది పింక్ కలర్ లో ఉండాలి, వారి చుట్టూ ఎప్పుడు బొమ్మలు ఉండాలి, వారికి కావాల్సిన మేకప్ కిట్స్, ఇంటిగదిలోనే ఉండమని ఆడుకోమనాలి. ఇది చాలామంది పేరెంట్స్ తమ ఆడపిల్లల పట్ల ప్రవర్తిస్తున్న తీరు. ఇక్కడే చాలామంది పెద్దతప్పు చేస్తున్నారు. ఇలా చేయడం వలన బయట మేము ఏమీ చేయలేము, మా కాళ్లపై మేము ఇండిపెండెంట్ గా నిలబడలేము అనే నమ్మకాన్ని వారికి లేకుండా చేస్తున్నారు.

ఇది చేయద్దు అని చెప్పడం

ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకు, ఇప్పుడు అమ్మగా మారిన ప్రతి తల్లికీ ఎదురయిన సంఘటనే ఇది. నేను ఇది చేస్తాను, ఇది సాధిస్తాను అని ధైర్యంగా చెప్పినప్పుడు నీకెందుకు ఇవన్నీ పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండకుండా అని చెప్పడం చేస్తుంటారు. ఇది చేయద్దు అది చేయద్దు అని వారి హక్కులను పక్కకు తోసివేసి హక్కు పేరెంట్స్ గా ఉండవచ్చు కానీ, ఒక వ్యక్తిగా ఎవరినీ నియంత్రించే హక్కు లేదు.

ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించండి

అమ్మాయి పుట్టి పెద్ద అవుతుంటే మా అమ్మాయి డాక్టర్, లాయర్ అవుతుంది, కలెక్టర్ ను చేస్తాను అని ఎంతో గొప్పగా చెప్పిన పేరెంట్స్ తీరా అమ్మాయి బాగా చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లే టైంలో ఇక నీ చదువు ఆపేసి మేము చెప్పినట్లు విని వారిని అక్కడితో ఆపివేయడం చాలా పెద్ద తప్పు. చదువుకున్న అమ్మాయి ఉద్యోగం చేయాలనుకుంటే చేయనీయండి, వారికి ఎక్కడ ఆనందం దొరుకుతుందని అనిపిస్తుందో అది ఇవ్వండి. ఆడపిల్లగా సంతోష క్షణాలు వారికి కొన్నే కాబట్టి వారి ఆనందానికి మీరు అడ్డురాకండి.

ప్రతి ఆడపిల్లల్లో ఆనందాన్ని ప్రేమను పంచే అమ్మ ఉందని గుర్తు పెట్టుకోండి. ఇది మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon